Home /News /explained /

EXPLAINED WHY DO SO MANY IN THE US OPPOSE STRICT LAWS GOVERNING GUN CULTURE GH VB

Explained: USలో తుపాకీ సంస్కృతిని నియంత్రించే చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..? కారణం ఏంటి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టెక్సాస్‌లోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం జరిగిన కాల్పుల్లో 19 మంది పిల్లలు, ఇద్దరు వ్యక్తులు మరణించారు. యూఎస్‌లో తుపాకీ హింస ఎక్కువగా ఉన్నప్పటికీ, దేశంలోని రాజకీయ నాయకులు, కొందరు ఓటర్లు తుపాకీల వినియోగాన్ని కట్టుదిట్టం చేసేందుకు చట్టాల్లో మార్పులు చేయడాన్న

ఇంకా చదవండి ...
టెక్సాస్‌లోని(Texas) ప్రాథమిక పాఠశాలలో మంగళవారం(Tuesday) జరిగిన కాల్పుల్లో 19 మంది పిల్లలు, ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఇది ఈ ఏడాది యూఎస్‌లో(US) కాల్పులు జరిగిన 27వ పాఠశాల. 20 మంది చిన్నారులు మరణించిన శాండీ హుక్ ఎలిమెంటరీ స్కూల్(School) మారణకాండ జరిగి 10 ఏళ్లు పూర్తయ్యాయి. యూఎస్‌లో తుపాకీ హింస ఎక్కువగా ఉన్నప్పటికీ, దేశంలోని రాజకీయ నాయకులు, కొందరు ఓటర్లు తుపాకీల వినియోగాన్ని కట్టుదిట్టం చేసేందుకు చట్టాల్లో మార్పులు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

రాజకీయ విభజన
శాండీ హుక్ ఘటన తర్వాత.. డెమొక్రాట్‌ల నేతృత్వంలో ఉన్న 13 రాష్ట్రాల్లో కొత్త తుపాకీ కొనుగోలు చేసేవారి నేపథ్యాన్ని తనిఖీ చేసేలా నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్(New York Times) నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు రిపబ్లికన్ల ఆధ్వర్యంలో ఉన్న 14 రాష్ట్రాలలో ఎటువంటి అనుమతి ప్రక్రియ అవసరం లేకుండానే తమ పౌరులు తుపాకీలను వినియోగించేందుకు చట్టాలు ఆమోదిస్తున్నాయి. 2021 నాటి ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం.. రిపబ్లికన్లు కొత్తగా గన్‌ రెగ్యులేషన్స్‌ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఐడియా ఆఫ్‌ ఫ్రీడమ్‌
ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం.. యూఎస్‌లో తుపాకీ యజమానులు.. తుపాకీ కొనుగోలు చేయడాన్ని వ్యక్తిగత స్వేచ్ఛగా భావిస్తున్నారు. తమ హక్కును వినియోగించుకుంటున్నట్లు చెబుతున్నారు. దాదాపు 74 శాతం మంది తుపాకీ యజమానులు తుపాకీ అవసరమని చెప్పారు. తుపాకీ యజమానులు పేర్కొన్న మరో ప్రధాన కారణం వ్యక్తిగత రక్షణ.

Ukraine-Russia: ఉక్రెయిన్‌ యుద్ధంలో పుతిన్ తన లక్ష్యాలను సాధిస్తున్నారా..?యుద్ధం ముగినట్లేనా..?


 శక్తివంతమైన NRA
తుపాకీ నియంత్రణకు బలమైన వ్యతిరేకత ఇన్‌ఫ్లూయెన్షల్‌ నేషనల్ రైఫిల్ అసోసియేషన్(NRA) నుంచి వచ్చింది. శాండీ హుక్ మారణకాండ తర్వాత.. అసోసియేషన్ CEO వేన్ లాపియర్ మాట్లాడుతూ.. ‘తుపాకీల వినియోగాన్ని నియంత్రించే నిబంధనలు అమెరికన్లను రక్షించవు. తుపాకీ లేని పాఠశాలలే వాస్తవానికి కాల్పులకు తెగబడే కిల్లర్‌లకు లక్ష్యంగా మారుతాయి. తుపాకీలను రక్షణ కోసం ఉపయోగించాల్సిన అవసరం పెరిగింది. తుపాకీ అమ్మకాలను ప్రోత్సహించాలి. అప్పుడే మాస్ షూటర్‌లను ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. అందుకు సాయం చేయడానికి NRA.. నేషనల్ స్కూల్ షీల్డ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రోగ్రామ్‌ను రూపొందిస్తుంది.’ అని వివరించారు. ఆసక్తికరంగా తుపాకీలను కలిగి ఉన్న NRA సభ్యులలో 77 శాతం మంది రిపబ్లికన్లు ఉన్నట్లు ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ పేర్కొంది.

బ్యాక్‌గ్రౌండ్‌ తనిఖీలు లేవు
2021 డిసెంబర్ లో లైసెన్స్ పొందిన డీలర్ లేదా తయారీదారు తుపాకీ కొనుగోలు చేస్తున్నవారి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తే తప్ప అక్రమ వినియోగాలను అడ్డుకోలేమని, చట్టంలో పొందుపరచాలనే అభ్యర్థనను రిపబ్లికన్ చక్ గ్రాస్లీ వ్యతిరేకించారు. చట్టబద్ధమైన తుపాకీ యజమానులు, డీలర్‌లను ఇవి సమస్యలు సృష్టిస్తాయని, బ్యాక్‌గ్రౌండ్‌ తనిఖీలు నేరాలను నిరోధించలేవని, చట్టాలను గౌరవించే పౌరులను నేరస్థులుగా మారుస్తాయని గ్రాస్లీ చెప్పారు. స్మాల్ ఆర్మ్స్ సర్వే ప్రకారం.. 2018లో US వద్ద 390 మిలియన్ తుపాకులు వినియోగంలో ఉన్నాయి. అలాగే ప్రతి పది మంది వ్యక్తులలో ముగ్గురి వద్ద తుపాకీ ఉందని ప్యూ రీసెర్చ్ సెంటర్‌ పేర్కొంది.

Explained: ప్రభుత్వానికి RBI ట్రాన్స్‌ఫర్ చేసే డివిడెండ్‌లో భారీ తగ్గుదల.. ఈ డివిడెండ్ ఎందుకు తగ్గుతోంది..?


మానసిక అనారోగ్యము
తుపాకీ నియంత్రణ చట్టాలను విమర్శిస్తున్నవారు సామూహిక కాల్పులకు మానసిక అనారోగ్యాలే ప్రధాన కారణంగా పేర్కొన్నారు. 2019లో 24 గంటలలోపే టెక్సాస్, ఒహియోలో జరిగిన రెండు సామూహిక కాల్పుల తరువాత, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ..‘ఇది కూడా మానసిక అనారోగ్య సమస్య. వీరు చాలా తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు.’ అన్నారు.
అయితే కొలంబియా యూనివర్సిటీలో ఫోరెన్సిక్ సైకియాట్రిస్ట్ డాక్టర్ మైఖేల్ స్టోన్ చేసిన పరిశోధనలో.. చాలా మంది మాస్ షూటర్లు మానసిక అనారోగ్యంతో లేరని పేర్కొన్నారు. మాస్ షూటర్లలో 65 శాతం మందిలో మానసిక అనారోగ్యం లేదని స్పష్టం చేశారు.

జాత్యహంకార వాదం(The racism argument)
2021 మార్చిలో తుపాకీ హింసపై సెనేట్ జ్యుడీషియరీ కమిటీ విచారణ సందర్భంగా రిపబ్లికన్ సెనేటర్లు దేశ జాతి వివక్ష చరిత్రలో భాగంగా తుపాకీ నియంత్రణ చట్టాలను రూపొందించారు. తుపాకీ యాజమాన్యం చరిత్ర, ఆఫ్రికన్ అమెరికన్లపై శ్వేతజాతీయులు విధించిన ఆంక్షలు, తుపాకీ నియంత్రణ చర్యలు మైనారిటీ కమ్యూనిటీల హక్కులపై భంగం కలిగిస్తాయని వారి వాదన.
Published by:Veera Babu
First published:

Tags: Explained, Schools, USA

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు