EXPLAINED WHY DID INDIA BAN WHEAT EXPORTS WILL THIS DECISION BRING DOWN PRICES GH VB
Explained: గోధుమల ఎగుమతిపై భారత్ ఎందుకు నిషేధం విధించింది..? ఈ నిర్ణయంతో ధరలు తగ్గుతాయా..?
ప్రతీకాత్మక చిత్రం
గోధుమల రోజువారీ సగటు రిటైల్ ధర మే 9న ఒక కిలోపై 19.34 శాతం పెరిగి రూ.29.49కి చేరింది. ఏడాది క్రితం కిలో రూ.24.71గా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గోధుమల ఎగుమతిని ఎందుకు నిషేధించింది? నిషేధం వల్ల వీటి ధరలు తగ్గుతాయా? లేదా? వంటి వివరాలు తెలుసుకుందాం.
దేశీయ మార్కెట్లో(Domestic Market) ఆహార పదార్థాల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం గోధుమల(Wheat) ఎగుమతిని నిషేధించింది. గోధుమల రోజువారీ సగటు రిటైల్(Retail) ధర మే 9న ఒక కిలోపై 19.34 శాతం పెరిగి రూ.29.49కి చేరింది. ఏడాది క్రితం కిలో రూ.24.71గా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) గోధుమల ఎగుమతిని(Export) ఎందుకు నిషేధించింది? నిషేధం వల్ల వీటి ధరలు తగ్గుతాయా? లేదా? వంటి వివరాలు తెలుసుకుందాం.
* గోధుమల ఎగుమతిని ప్రభుత్వం ఎందుకు నిషేధించింది?
అంతర్జాతీయంగా గోధుమల ధరలు పెరుగుతున్నాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ గోధుమ ధరలు ఇప్పటివరకు 40 శాతానికి పైగా పెరిగాయి. యుద్ధానికి ముందు ప్రపంచ గోధుమలు, బార్లీ ఎగుమతుల్లో ఉక్రెయిన్, రష్యా వాటా మూడు వంతులుగా ఉంది. ఇతర దేశాలు టన్ను గోధుమలను 420- 480 డాలర్లకు విక్రయిస్తున్నాయి.
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గోధుమల ఎగుమతులపై నియంత్రణ నిర్ణయం ఆహార ధరలను అదుపు చేస్తుంది. భారతదేశం, లోటును ఎదుర్కొంటున్న దేశాల ఆహార భద్రతను బలోపేతం చేస్తుంది. అన్ని ఒప్పందాలను గౌరవిస్తున్నందున భారతదేశం నమ్మకమైన సరఫరాదారుగా నిలుస్తుంది. ఈ విషయంపై మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే మాట్లాడుతూ..‘భారతదేశంలో గోధుమలు, గోధుమ పిండి రిటైల్ ధరలు గత సంవత్సరంలో 19 శాతం వరకు పెరిగాయి. గోధుమల ఎగుమతిని నిషేధించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక వారంలో దేశీయ ధరలను అదుపు చేస్తుంది’ అని వివరించారు.
ఆహార మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుబోధ్ కుమార్ ఓ ప్రకటనలో..‘గోధుమ రోజువారీ సగటు రిటైల్ ధర మే 9న కేజీ రూ.24.71గా ఉంది. అనంతరం 19.34 శాతం పెరిగి రూ.29.49కి చేరుకుంది. రిటైల్ గోధుమ పిండి ధర కేజీ రూ.28.8గా ఉండగా.. 14.27 శాతం పెరిగి రూ.32.91కి చేరుకున్నాయి.’ అని తెలిపారు. హోల్సేల్ మార్కెట్లో కూడా గోధుమల రోజువారీ సగటు ధర మే 9న 21.55 శాతం పెరిగి రూ.25.82కి చేరగా, క్రితం ఏడాది ఇదే కాలంలో కేజీ రూ.21.24గా ఉంది. గోధుమ పిండి ధర కేజీపై 15.88 శాతం పెరిగి రూ.27.89కి చేరుకుంది. గతేడాది రూ.24.06గా ఉంది.
దేశంలోని గోధుమల ఉత్పత్తి 2022-23 పంట సంవత్సరానికి (జూలై-జూన్) 111 మిలియన్ టన్నుల కంటే తక్కువ అంచనా నుండి 105-106 మిలియన్ టన్నులకు సవరించారు. ఎగుమతుల నిషేధ నిర్ణయం కచ్చితంగా సహాయపడుతుందని పాండే చెప్పారు. అయితే ధరలు ఎంత వరకు తగ్గుతాయో అంచనా వేయలేమని, దేశీయ ధరలు ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలంలో తగ్గుతాయని చెప్పారు.
* ఏదైనా మినహాయింపు ఉందా?
నిషేధానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. నోటిఫికేషన్ తేదీ లేదా అంతకు ముందు జారీ చేసిన చెల్లుబాటు అయ్యే రీరివోకబుల్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (LoC)తో గోధుమ రవాణాను ప్రభుత్వం అనుమతించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 4.5 మిలియన్ టన్నుల గోధుమలు ఎగుమతి చేసేందుకు దేశం ఒప్పందం చేసుకుంది. అధికారిక సమాచారం ప్రకారం, వీటిలో ఏప్రిల్లో 1.46
మిలియన్ టన్నులు ఎగుమతి అయ్యాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.