హోమ్ /వార్తలు /Explained /

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లులను పాలకులు ఎందుకు పక్కన పెడుతున్నారు? ఇలాంటి బిల్లులతో ప్రయోజనాలు ఏంటి?

Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లులను పాలకులు ఎందుకు పక్కన పెడుతున్నారు? ఇలాంటి బిల్లులతో ప్రయోజనాలు ఏంటి?

తొలి దశ సమావేశాలు (Sessions).. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు (Corona cases) పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ.. పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తొలి దశ సమావేశాలు (Sessions).. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు (Corona cases) పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ.. పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

భారత పార్లమెంటులో మొదటిసారి 1996లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే 25 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. 2008లో రాజ్యసభలో చివరిసారి మరో బిల్లును ప్రవేశపెట్టారు. ఇది 2010లో ఎగువ సభ ఆమోదం పొందింది. కానీ దీన్ని లోక్‌సభ సుమారు నాలుగేళ్లు పక్కన పెట్టింది. 15వ లోక్‌సభ ముగింపుతో ఈ బిల్లు సైతం వీగిపోయింది.

ఇంకా చదవండి ...

భారతదేశ జనాభాలో 48 శాతానికి పైగా మహిళలు ఉన్నారు. కానీ పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో వారి ప్రాతినిధ్యం 15 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం దేశంలోని పశ్చిమ బెంగాల్‌కు మాత్రమే ఒక మహిళ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాలు, చట్ట సభల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందడంలో విఫలమవుతున్నాయి. ప్రస్తుత లోక్ సభలో మహిళా ఎంపీల ప్రాతినిధ్యం గతంలో కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, రాజకీయ పరంపరలో మహిళలు ఇప్పటికీ అట్టడుగున కొనసాగుతున్నారు. మొదటిసారి పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా.. ఈ బిల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

భారత్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుల పరిస్థితి ఏంటి ?

భారత పార్లమెంటులో మొదటిసారి 1996లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే 25 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. 2008లో రాజ్యసభలో చివరిసారి మరో బిల్లును ప్రవేశపెట్టారు. ఇది 2010లో ఎగువ సభ ఆమోదం పొందింది. కానీ దీన్ని లోక్‌సభ సుమారు నాలుగేళ్లు పక్కన పెట్టింది. 15వ లోక్‌సభ ముగింపుతో ఈ బిల్లు సైతం వీగిపోయింది.

1998, 1999లో కూడా రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు లోక్‌సభలో మూడింట ఒక వంతు సీట్ల మేర రిజర్వేషన్‌ని కల్పించడానికి ఉద్దేశించిన బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే వీటి విషయంలో రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఎప్పుడూ కుదరలేదు. 2008లో అప్పటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు కొంతమంది సభ్యులు మంత్రి చేతిలో నుంచి బిల్లు ప్రతులను లాక్కోవడానికి ప్రయత్నించి వికృతంగా ప్రవర్తించారంటే.. ఈ బిల్లులపై ఎంపీలకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. అయినప్పటికీ పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం అనేది అన్ని ప్రధాన రాజకీయ పార్టీల లక్ష్యం కావడం గమనార్హం. 2019 లోక్ సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ, కాంగ్రెస్ ఈ అంశాన్ని చేర్చాయి. మహిళలకు లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీలలో 33 శాతం సీట్ల రిజర్వేషన్ కల్పిస్తామని ఈ పార్టీలు పేర్కొన్నాయి.

అయితే పార్లమెంట్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై 2019 డిసెంబర్‌లో అడిగిన ప్రశ్నకు అప్పటి న్యాయ శాఖ మంత్రి, బీజేపీకి చెందిన రవిశంకర్ ప్రసాద్ సమాధానం ఇచ్చారు. ఈ సమస్యను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజ్యాంగ సవరణ కోసం ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావాల్సిన అవసరం ఉందని లోక్‌సభలో మంత్రి వెల్లడించారు.

రిజర్వేషన్ బిల్లుతో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు ?

పంచాయతీలు, మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 1993లోనే బిల్లులు ఆమోదించారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో మహిళా సాధికారతపై సానుకూల ప్రభావం కనిపించింది. అయితే భారతదేశంలో ఉండే పితృస్వామ్య వ్యవస్థ వల్ల ఈ రిజర్వేషన్ ఫలాల ప్రభావం చాలా తక్కువగానే కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. మహిళలు ఎన్నికైనప్పటికీ, వారి స్థానంలో పురుషులే పరోక్షంగా పాలన వ్యవహారాలు చూస్తున్నారు.

2008లో లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల కోసం ప్రవేశపెట్టిన సవరణ బిల్లును వ్యతిరేకించిన వారు ఇదే వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ బిల్లు మహిళల అసమానత స్థితిని శాశ్వతం చేస్తుందని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ (పీఆర్ఎస్) తెలిపింది. వారు సొంత శక్తి సామర్థ్యాలతో పోటీ చేస్తున్నట్లు కాకుండా, మగవారికి ప్రాక్సీ లేదా ఏజెంట్ మాదిరిగానే గుర్తింపు ఉంటుందని విశ్లేషించింది. ఈ రిజర్వేషన్ బిల్లుతో ఓటర్ల చాయిస్ తగ్గుతుందని పీఆర్‌ఎస్ సంస్థ వెల్లడించింది. రిజర్వేషన్‌లో రొటేషన్ విధానాన్ని అనుసరిస్తే.. ఇప్పటికే ఎంపికైన పురుష ఎంపీలు తరువాత ఎన్నికల్లో పోటీ చేయలేరు కాబట్టి నియోజక వర్గాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశాలు తగ్గుతాయని విశ్లేషించింది.

2002లో పాకిస్థాన్‌ సైతం జాతీయ అసెంబ్లీలో 17 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేసింది. అయితే అక్కడి రాజకీయ పార్టీలు జనరల్ సీట్లలో పోటీ చేయడానికి మహిళలకు సీట్లు కేటాయించలేదు. దీనివల్ల మహిళా సాధికారత ఫలాలు నెరవేరలేదని గుర్తు చేశాయి. స్థానిక సంస్థలకు మహిళలు నాయకత్వం వహించిన సందర్భాల్లో వారు తాగునీరు, మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, రోడ్లు, పాఠశాల మరమ్మతులు, ఆరోగ్య కేంద్రాల మరమ్మతులు, నీటిపారుదల సదుపాయాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు కొన్ని అధ్యయనాలు గుర్తించాయి. అయితే మహిళలను శక్తిమంతం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ఇలాంటి రిజర్వేషన్లు అత్యంత ప్రభావవంతమైన మార్గం కాకపోవచ్చని మరికొన్ని అధ్యయనాలు విశ్లేషించాయి.

ఇతర దేశాల్లో ఇలాంటి రిజర్వేషన్లు ఉన్నాయా ?

ప్రపంచంలోని మూడు దేశాల్లో మాత్రమే జాతీయ అసెంబ్లీల్లో కనీసం 50 శాతం మంది మహిళలు ఉన్నారని ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ తెలిపింది. ఈ జాబితాలో రువాండా మొదటి స్థానంలో ఉంది. భారత్‌లో మహిళా ఎంపీల వాటా లోక్ సభలో 14.4 శాతం, రాజ్యసభలో 11.2 శాతంగా ఉంది. అయితే చట్ట సభల్లో రిజర్వేషన్లకు బదులుగా రాజకీయ పార్టీలు మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తే మంచిదని బ్రూకింగ్స్ బ్లాగ్ సూచించింది. ఫ్రాన్స్, దక్షిణ కొరియా, నేపాల్ వంటి దేశాలు.. అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు 50 శాతం టికెట్లను రిజర్వ్ చేయాలని చట్టాలు చేశాయి. అయితే దక్షిణాఫ్రికాలోని రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా మహిళాసాధికారత సాధ్యమవుతుందని స్టాక్‌హోమ్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రటిక్ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ (IDEA) సైతం విశ్లేషించింది.

First published:

Tags: Explained, Lok sabha, Parliament

ఉత్తమ కథలు