Home /News /explained /

EXPLAINED WHY 2021 SAW HIGHEST TIGER DEATHS IN DECADE AND WHAT THAT MEANS FOR EFFORTS TO SAVE THE BIG CAT GH VB

Explained: 2021లో అత్యధిక పులుల మరణాలు.. దశాబ్దంలోనే ఎక్కువ.. ఎందుకు ఇలా జరుగుతోంది..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచంలోని మొత్తం పులుల సంఖ్యలో 75 శాతం భారత్‌లోనే ఉన్నాయి. భారత సంరక్షణ చర్యలతో దశాబ్దకాలంగా పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అయితే 2021లో మాత్రం పులుల సంఖ్య దారుణంగా పడిపోయింది.

పర్యావరణ వ్యవస్థ(Ecosystem)లో ఆహార గొలుసులో పులుల స్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆహార గొలుసులో సమతుల్యతను స్థిరంగా ఉంచుతూ వాతావరణ పరిరక్షణలో పులులు(Tigers) కీలక పాత్ర పోషిస్తాయి. పులుల సంఖ్య తగ్గితే శాకాహార జంతువులు(Animals) పెరిగి అవన్నీ చెట్లను అతిగా మేయవచ్చు. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే పులులను సంరక్షించడం అత్యావశ్యకం. అయితే పులుల సంరక్షణలో భారత్(India) ఇప్పుడు ప్రపంచంలోనే ముందంజలో ఉంది. ప్రపంచంలోని మొత్తం పులుల సంఖ్యలో 75 శాతం భారత్‌లోనే ఉన్నాయి. భారత సంరక్షణ చర్యలతో దశాబ్దకాలంగా పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అయితే 2021లో మాత్రం పులుల సంఖ్య దారుణంగా పడిపోయింది. వేటగాళ్లు, ప్రమాదాలు (Accindents),మానవులు-పులుల మధ్య ఏర్పడుతోన్న సంఘర్షణ వల్ల 120 కంటే ఎక్కువ పెద్ద పులులు చనిపోయాయని తాజా గణాంకాలు చాటుతున్నాయి. ఈ తరుణంలో ఏడాది కాలంలోనే అధిక సంఖ్యలో పులుల సంఖ్య ఎందుకు తగ్గింది? ఇప్పుడు అత్యవసరంగా చేపట్టాల్సిన సంరక్షణ చర్యలు ఏంటి? లాంటి విషయాలు తెలుసుకుందాం.

Explained: భారత్‌లో 5G నెట్‌వర్క్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది..? ఇది యూజర్లకు ఎలాంటి అనుభవాన్ని ఇస్తుంది.. పూర్తి వివరాలిలా..


భారతదేశంలో ఎన్ని పులులు ఉన్నాయి..?
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకారం, 2018లో చేసిన లెక్కింపు ప్రకారం పులుల సంఖ్య 2,967గా ఉంది. 2014లో దేశంలో 2,226 పులులు ఉండగా ఇప్పుడవి పెరిగాయి. పంతొమ్మిది రాష్ట్రాల్లో 51 టైగర్ రిజర్వ్‌ల ఉండగా అవన్నీ ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు పొందాయి. ఈ టైగర్ రిజర్వ్‌లు భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో 2.24 శాతం విస్తరించి ఉన్నాయి. పులుల సంఖ్యలో అన్ని రాష్ట్రాల కంటే మధ్యప్రదేశ్ ముందుంది. 2018 గణాంకాల ప్రకారం మధ్యప్రదేశ్ భూభాగంలో 526 పులులు ఉన్నాయి. కర్ణాటక 524 పులులతో రెండవ స్థానంలో ఉండగా, ఉత్తరాఖండ్ 444 పులులతో మూడవ స్థానంలో నిలిచింది.

పులుల మరణాలు ఎక్కడ ఎక్కువగా నమోదయ్యాయి?
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) 2012 నుంచి పులుల మరణాల సంబంధించి పబ్లిక్ రికార్డ్‌ను మెయింటైన్ చేసింది. ఇది 2021లో మొత్తం 126 పులులు మరణించినట్లు తాజాగా ఒక లిస్ట్ విడుదల చేసింది. అయితే ఎన్‌టీసీఏ ప్రకారం 2020లో 106 పులులు మరణించాయి. అంటే ఈ ఏడాది టైగర్స్ మరణ రేటు 20 శాతం పెరిగింది. 2021లో మధ్యప్రదేశ్ లో 42 పులులు మృత్యువాత పడ్డాయి. మహారాష్ట్రలో 26, కర్ణాటకలో 15 పులులు చనిపోయాయి.

ఎన్‌టీసీఏ (NTCA) అభయారణ్యాల్లో పులుల మరణాలు రిపోర్ట్ చేయనందున వాస్తవ మరణాల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు, ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా (WPSI) కలెక్ట్ చేసిన డేటా ప్రకారం, 2021లో దేశంలో 160కి పైగా పులులు మరణించాయని తెలుస్తోంది. ఈ ఏడాదిలో జులై నాటికి 94 టైగర్లు చనిపోయాయని అంచనా వేసిన అధికారులు ఈ మరణ రేటును షాకింగ్‌గా పరిగణించారు.

పులుల మరణాలకు ప్రధాన కారణాలు ఏంటి?
జాతీయ పులుల సంరక్షణ మండలి (NTCA) ప్రకారం, 65 మరణాలు టైగర్ రిజర్వ్‌లో నమోదయ్యాయి. మిగిలినవి అభయారణ్యం పరిమితికి వెలుపల సంభవించాయి. మరణాలకు గల కారణాలు అందుబాటులో లేనప్పటికీ, పులుల మరణాల వెనుక వేట ప్రధాన కారణాలలో ఒకటిగా మిగిలిపోయింది. 2018 - 2020 మధ్యకాలంలో అంటే మూడేళ్లలో మొత్తం 303 పులులు మరణించగా వాటిలో 57 వేటగాళ్ల వల్లనే మరణించాయి. అదే సమయంలో 112 పులుల సహజ మరణం పొందాయి. అయితే 100 మరణాలకు కారణం తెలియ రాలేదు. మానవ-జంతు సంఘర్షణ అనేది మానవ, పులుల జీవితాల్లో పెను ముప్పుగా పరిణమిస్తోంది. 2020లో పులుల దాడి కారణంగా 44 మంది మరణించగా.. 2021లో పులులు, చిరుతపులితో కూడిన మానవ-జంతు సంఘర్షణలో 80 మందికి పైగా మరణించారు.

Explained: భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులు.. డోసుల మధ్య గ్యాప్ ఎంత ఉండాలి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..


మరణాలను తగ్గించడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు.. భవిష్యత్ కార్యాచరణ ఏంటి?
కేంద్రం 1973లో 'ప్రాజెక్ట్ టైగర్'ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు అనేది ప్రపంచంలో అతిపెద్ద జాతుల పరిరక్షణకు ఉద్దేశించిందని కేంద్రం తెలిపింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) రెడ్ లిస్ట్ ఆఫ్ త్రెటెండ్(Threatened) జాతుల్లో పులులను అంతరించిపోతున్న జాతులుగా పరిగణించారు. అయితే వీటిని రక్షించే ప్రయత్నాల్లో విజయం సాధించిన భారతదేశాన్ని నిపుణులు ప్రశంసించారు. పరిరక్షణ వ్యూహాల పర్యవేక్షణ, అంచనాను బలోపేతం చేయడానికి దేశం ఇంకా ప్రయత్నిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక నిపుణుల ప్రశంసలను చూరగొంటోంది.

2006లో ఎన్‌టీసీఏ ఏర్పాటుకు మార్గం సుగమం చేయడానికి వన్యప్రాణుల (రక్షణ) చట్టం, 1972 సవరించడం జరిగింది. అయితే టైగర్ రిజర్వ్‌లు ఉన్న రాష్ట్రాలకు నిధులను అందించడం ద్వారా వేట నిరోధక కార్యకలాపాలను బలోపేతం చేయడానికి యాంటీ-పోచింగ్ స్క్వాడ్‌ల మోహరింపుతో ప్రయత్నాలు జరిగాయి. కొన్ని టైగర్ రిజర్వ్ రాష్ట్రాల్లో ప్రత్యేక టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ (STPF) కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

పులులు అంతరించిపోయినట్లు గుర్తించిన సరిస్కా, పన్నా వంటి రిజర్వ్‌లలో పులులను తిరిగి ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అయితే మానవ-జంతు సంఘర్షణ కారణంగా సంభవించే పులుల మరణాలను నివారించడానికి తక్షణ చర్యలు అవసరమని నిపుణులు అంటున్నారు. పులుల సురక్షిత సంచారానికి వీలుగా కారిడార్‌లను రూపొందించాలని సలహా ఇస్తున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Tigers

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు