Home /News /explained /

EXPLAINED WHO ARE THE HOUTHIS AND WHY DID THEY ATTACK UAE HERE DETAILS NS GH

Explained: యూఏఈపై హౌతీల దాడి.. ఇద్దరు భారతీయులు మృతి.. అసలేవరీ హౌతీలు? దాడుల ఉద్దేశం ఏంటి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అరబ్ దేశాల్లో అత్యంత పేద దేశం యెమెన్. దాదాపు ఏడేళ్లుగా అంతర్యుద్ధంతో(Yemen civil war) నలిగిపోతోంది. ఇరాన్ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ రాజధాని సనాను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఇది ప్రారంభమైంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) రాజధాని అబుదాబిలో ఇటీవల పెట్రోలియం ట్యాంకర్లపై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ అనుమానాస్పద దాడుల్లో ఇద్దరు భారతీయులు (Indians killing yemen), పాకిస్థాన్​కు చెందిన ఓ పౌరుడు మరణించారు. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు హౌతీ తిరుగుబాటుదారులు (Houthi rebels) ప్రకటించారు. యెమెన్​పై(Yemen attack) ఆధిపత్యం చెలయించాలన్న ఆలోచన కొనసాగుతున్నంత కాలం యూఏఈ లక్ష్యంగా దాడులు చేస్తూనే ఉంటామని హౌతీ ఈ సందర్భంగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హౌతీలు ఎవరు? యూఏఈపై ఎందుకు దాడి చేశారు? అసలు వీరికి ఇరాన్ ఎందుకు మద్దతిస్తోంది? వంటి అంశాలను పరిశీలిద్దాం.

అరబ్ దేశాల్లో అత్యంత పేద దేశం యెమెన్. దాదాపు ఏడేళ్లుగా అంతర్యుద్ధంతో(Yemen civil war) నలిగిపోతోంది. ఇరాన్ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ రాజధాని సనాను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఇది ప్రారంభమైంది. అనంతరం 2015లో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యెమెన్​పై ఇరాన్ ఆధిపత్యాన్ని రూపుమాపే లక్ష్యంతో తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాయి. ఈ క్రమంలో గత ప్రభుత్వాన్ని పునరుద్ధరించాయి. ఈ గ్రూపులో యూఏఈ సైతం భాగమైంది.

* ఎవరీ హౌతీలు?
1990లో యెమెన్​లో మెజారిటీ వర్గమైన షియా తెగకు హుస్సేన్ బద్రెద్దీన్ అల్-హౌతీ.. హౌతీ ఉద్యమాన్ని స్థాపించాడు. “దేవుడు గొప్పవాడు, అమెరికా, ఇజ్రాయెల్​ల నాశనం సహా.. యూదులకు మరణం తప్పదు. వీరిపై ఇస్లాం గొప్ప విజయం సాధిస్తుంది’’ అనే నినాదంతో ఈ సంస్థ పనిచేస్తోంది. 2004లో యెమెన్ సైన్యం హుస్సేన్​ను మట్టుబెట్టిన తర్వాత అతని సోదరుడు అబ్దుల్ మాలిక్ హౌతీ బాధ్యతలు చేపట్టాడు.

అంతకు ముందు చరిత్రను గమనిస్తే.. 1962-70లో యెమెన్ అంతర్యుద్ధం తరువాత ఒకప్పుడు శక్తిమంతమైన వర్గంగా పేరొందిన జైదీలకు దేశంలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. 1980ల నుంచి పొరుగునే ఉన్న సౌదీ అరేబియాలో సున్నీలకు ఆదరణ పెరుగుతున్న కారణంగా జైదీలు మరింత వివక్షకు గురవుతూ వచ్చారు. అదే సమయంలో దీర్ఘకాలం అధ్యక్షుడుగా ఉంటూ.. సౌదీతో స్నేహపూర్వక సంబంధాలను(Soudi-yemen relations) కొనసాగిస్తూ వస్తున్న అలీ అబ్దుల్లా సలేహ్​ పాలనతో దేశంలో అసంతృప్తి చెలరేగింది. దీనితో అసంతృప్త షియా యెమెన్లంతా సౌదీకి వ్యతిరేకంగా పోరాడుతున్న మిలిటెంట్ గ్రూపుల్లో చేరారు.

ఈ నిరసనలు తీవ్రతరం కావడంతో సలేహ్ 2012లో పదవి నుంచి వైదొలిగారు. అనంతర పరిణామాలతో 2014లో హౌతీలు సలేహ్​తో పొత్తు పెట్టుకున్నారు. రాజధాని సనాను స్వాధీనం చేసుకుని అధ్యక్షుడు అబ్దుల్ రబ్బు మన్సూర్ హదీ ప్రభుత్వాన్ని కూలదోశారు. 2017 డిసెంబరులో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ(soudi coalition) కూటమితో పొత్తు పెట్టుకోబోతున్నారన్న వార్తల నేపథ్యంలో సలేహ్​ను చంపేశారు. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు హదీ సైతం అవినీతి, పేదరికం, నిరుద్యోగం, జిహాదీలు, వేర్పాటువాద ఉద్యమాలు వంటి సమస్యలను పరిష్కరించలేక పాలనలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అతని బలహీనత కారణంగానే హౌతీలు ఉత్తర యెమెన్​లో ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసుకున్నారన్న వాదనలు ఉన్నాయి.

* సౌదీ అరేబియా(Soudi Arabia) పాత్ర ఏంటి?
యెమెన్​లో హౌతీల ప్రాభవం పెరుగుతుండటం అరబ్ దేశాలు ముఖ్యంగా సౌదీలో భయం మొదలైంది. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతుతో తిరుగుబాటుదారులను ఓడించే లక్ష్యంతో యెమెన్​లో వైమానిక దాడులను ప్రారంభించింది. కొన్ని వారాల్లో వారిని అంతమొందిచగలమని భావించింది సంకీర్ణ కూటమి. కానీ అది కాస్తా ఏడేళ్ల పాటు సాగి పూర్తిస్థాయి అంతర్యుద్ధంగా మారింది. అయితే యెమెన్​లోని దక్షిణ ప్రాంతం నుంచి హౌతీలను విజయవంతంగా తరిమికొట్టగలిగాయి సంకీర్ణ దళాలు. కానీ ఇతర చోట్ల విఫలమయ్యాయి.

ప్రపంచంలోని అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభాల్లో ఒకటిగా పరిగణించే ఈ యుద్ధంలో పదివేల మందికి పైగా మరణించారు. ఇరువైపులా పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం సహా.. అనేక యుద్ధ నేరాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. దీనికి ప్రతీకారంగానే హౌతీలు సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు, చమురు క్షేత్రాలతో పాటు అనేక ప్రదేశాల్లో దాడులు జరుపుతూ వస్తున్నారు.

* ఈ యుద్ధంలో UAE వైఖరి ఏంటి?
సోమవారం యూఏఈపై డ్రోన్ దాడిని గమనిస్తే.. హౌతీల వ్యూహంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటిదాకా సౌదీ అరేబియాపై దాడులు చేస్తూ వస్తున్న వీరు.. UAEని టార్గెట్ చేయడం వ్యూహాత్మకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హౌతీలు చివరిసారిగా యూఏఈపై 2018లో దాడి చేశారు. 2015-మార్చి నుంచి సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమిలో యూఏఈ సభ్యదేశంగా ఉంది. కానీ సౌదీ అరేబియా ఉన్నంత యాక్టివ్​గా ఉండదు. 2019లో ఐరాస(UN) నేతృత్వంలోని శాంతి ప్రక్రియలో భాగంగా యెమెన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. తీరప్రాంత నగరం హొడెయిడా నుంచి వ్యూహాత్మక ఉపసంహరణ చేపడతామని తెలిపింది.

అయితే.. ఇటీవల దక్షిణ యెమెన్​లోని సంపన్న చమురు క్షేత్రమైన జియాన్ ప్రావిన్స్ షాబ్వాలో UAE దాడి చేసింది. మరోవైపు ఈ నెల ప్రారంభంలో ఆయుధాలతో వెళుతున్న యూఏఈ నౌక ర్వాబీని యెమెన్ తీరంలో హౌతీలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. దీనితో యూఏఈపై యెమెన్​ గుర్రుగా ఉంది. ప్రస్తుత యూఏఈ దాడులు ఓ హెచ్చరిక మాత్రమేనని హౌతీల సుప్రీం లీడర్ అబ్దుల్ ఇలాహ్ హజర్ అన్నారు. ఈ మేరకు యెమెన్​ రాజధాని సనాలో ఆయన ఓ న్యూస్​ఛానల్​కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. "వ్యూహాత్మక ప్రాంతాలపై దాడులు చేయడం ద్వారా మా శత్రువులకు స్పష్టమైన హెచ్చరికలు పంపాం" అని హజర్ పేర్కొన్నారు. హౌతీలు చివరిసారిగా 2018-UAE దాడులకు బాధ్యత వహించారు.

మరోవైపు.. సోమవారం నాటి డ్రోన్ దాడి తరువాత హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న రాజధాని సనా లక్ష్యంగా వైమానిక దాడులను ప్రారంభించినట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ప్రకటించింది. మంగళవారం జరిపిన దాడుల్లో 25 మంది వరకు హౌతీ రెబల్స్ చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Attack, UAE

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు