Home /News /explained /

EXPLAINED WHAT TO WATCH OUT FOR WHEN OSCAR NOMINATIONS ARE ANNOUNCED ON TUESDAY GH VB

Explained: ప్రారంభమైన ఆస్కార్ అవార్డుల నామినేషన్ల ప్రక్రియ.. ఈ సారి ఆ వైభవం కనిపించేనా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా పండగ.. ఆస్కార్ అవార్డుల వేడుకలకు రంగం సిద్ధమైంది. 94వ అకాడమీ అవార్డుల(94th Academy Awards) నామినేషన్లను మంగళవారం ప్రకటించనున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా పండగ.. ఆస్కార్ అవార్డుల వేడుకలకు రంగం సిద్ధమైంది. 94వ అకాడమీ అవార్డుల (94th Academy Awards) నామినేషన్లను మంగళవారం ప్రకటించనున్నారు. ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ వేడుకలు మార్చి 27న అట్టహాసంగా జరగనున్నాయి. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా "అవార్డ్స్ సీజన్"గా పిలిచే ఆస్కార్‌(Oscar) వేడుకలు సాధారణంగా జరుగుతున్నాయి. పార్టీలన్నీచాలా వరకు వర్చువల్‌ వేదికకు మారాయి. ఇప్పటికే ఆస్కార్ కు ముందు ప్రకటించే విలక్షణ అవార్డుల కార్యక్రమం అయిన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల(Golden Globe Awards) ప్రదానోత్సవం చాలా సింపుల్ గా ముగిసింది. ఈ ఏడాది ప్రారంభంకానున్న ఆస్కార్ నామినేషన్ల కార్యక్రమాన్ని విలక్షణ నటులైన ట్రేసీ ఎల్లిస్ రాస్, లెస్లీ జోర్డాన్ హోస్ట్ చేయనున్నారు. కరోనా కారణంగా నామినేషన్ల కార్యక్రమాన్ని Oscar.com, Oscars.org, సామాజిక మాధ్యమాలతో పాటు అమెరికాకు చెందిన ఏబీసీ న్యూస్ ఛానల్ ప్రోగ్రాం "గుడ్ మార్నింగ్ అమెరికా"లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

గతేడాది ఏప్రిల్ చివరిలో నిర్వహించిన ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో డాల్బీ థియేటర్‌కు బదులు యూనియన్ స్టేషన్‌లో నిర్వహించారు. ప్రేక్షకులు లేని ఈ వేడుకలకు ఆల్ టైమ్ కనిష్ట స్థాయి అయిన 9.85 మిలియన్ల వీక్షణలు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం జరగనున్న నామినేషన్ల(Oscar nominations) కార్యక్రమం సక్సెస్ అవుతుందా? లేదా? అనేది చూడాలి. ఆస్కార్ నామినేషన్లకు సంబంధించి కొన్ని ప్రశ్నలు తీవ్రంగా ఆలోజింపజేస్తున్నాయి.

Explained: హోమ్‌ లోన్‌ ఒవర్‌డ్రాఫ్ట్‌ ఫెసిలిటీ అంటే ఏంటి..? దాన్ని ఎవరు ఎంచుకోవచ్చు..?


బాక్సాఫీస్ హిట్ మూవీస్‌కే ఛాన్స్..?
కరోనా కారణంగా సినిమా థియేటర్లలో ప్రేక్షకులు తగ్గుముఖం పట్టారు. కరోనా నుంచి ప్రపంచం ఇప్పుడప్పుడే కుదురుకునే పరిస్థితి లేదు. దీనితో వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులను ఆహ్లాదపరిచేలా ఆస్కార్ వేడుకను నిర్వహించాలని భావిస్తున్నారు. "స్పైడర్ మ్యాన్: నో వే హోమ్," ప్రపంచవ్యాప్తంగా $1.77 బిలియన్లతో అతిపెద్ద హిట్ గా నిలిచింది. జేమ్స్ బాండ్ మూవీ "నో టైమ్ టు డై" ప్రపంచవ్యాప్తంగా 774 మిలియన్ డాలర్లు సంపాదించి ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ స్కోర్ ని బట్టి నామినేషన్ సంపాదించగలవా లేదా అనేది వేచి చూడాలి.

అత్యంత జనాదరణ పొందిన చిత్రాలను కొలిచేందుకు ఇతర కొలమానాలు ఉన్నాయి. వాస్తవానికి పెద్ద బడ్జెట్ సినిమాలకు అకాడమీ నిర్మాతల విభాగం మద్దతునిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా 399 మిలియన్ డాలర్లతో "డూన్" ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచే అవకాశం ఉంది. "డోంట్ లుక్ అప్" అనే నెట్‌ఫ్లిక్స్ మూవీ 3,59,790,000 వీక్షణలతో రెండో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది.

అంతర్జాతీయంగా పేరున్న తారలకే అవార్డులు?
రెండేళ్ల క్రితం కొరియన్ థ్రిల్లర్ మూవీ “పారాసైట్”(Parasite) ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఆయా దేశాలకు చెందిన సినిమాలు సైతం అంతర్జాతీయంగా పలు విభాగాల్లో పోటీపడగలవని నిరూపితమైంది. హాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన మొదటి ఆంగ్లేతర చిత్రంగా “పారాసైట్” నిలిచింది. పెడ్రో అల్మోడోవర్ “ప్యారలల్ మదర్స్”, అస్గర్ ఫర్హాదీ “ఎ హీరో,” జోచిమ్ ట్రియర్ తీసిన “ది వర్స్ట్ పర్సన్ ఇన్ ది ది వర్స్ట్ పర్సన్‌తో సహా అకాడమీ ఉత్తమ అంతర్జాతీయ చిత్రాల జాబితా పెద్దదే. ఇవన్నీ చెబుతున్నదొకటే.. బలమైన కంటెంట్ ఉంటే పాన్ వరల్డ్ లెవెల్లో రాణిస్తాయని.

ఓటీటీల ఆధిపత్యం ఎంతవరకు?
ఈసారి డెనిస్ విల్లెనెయువ్ తీసిన సైన్స్ ఫిక్షన్ మూవీ "డూన్," కెన్నెత్ బ్రనాగ్ ఆటోబయోగ్రఫీ బ్యాక్ డ్రాప్ మూవీ "బెల్ఫాస్ట్", జేన్ కాంపియన్ గోతిక్ వెస్ట్రన్ మూవీ "ది పవర్ ఆఫ్ ది డాగ్" అవార్డులు కొల్లగొడతాయని అంచనా వేస్తున్నారు. ఆన్లైన్ స్ట్రీమింగ్ మూవీస్ సైతం ఆస్కార్‌ అవార్డుకి నామినేట్ అవుతున్నాయి. అయితే అవి ఈ సంవత్సరం ఉత్తమ చిత్రాలుగా అవార్డులను కొల్లగొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్కార్ రూల్స్ ను మార్చిన తర్వాత 10 చిత్రాలు బెస్ట్ మూవీ కోసం నామినేట్ అయ్యాయి. వాటిలో కొన్ని మాత్రమే థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Explained: ప్రపంచ వ్యాప్తంగా వర్డ్‌లె గేమ్‌కు పెరుగుతున్న క్రేజ్.. దీన్ని ఎలా ఆడాలి..? ఇది ఎందుకు వైరల్ అవుతోంది..?


నెట్‌ఫ్లిక్స్ నుంచి ఇప్పటికే "ది పవర్ ఆఫ్ ది డాగ్," ఆడమ్ మెక్‌కే తీసిన కామెడీ జానర్ మూవీ "డోంట్ లుక్ అప్", లిన్ మాన్యువల్ మిరాండా సినిమా "టిక్, టిక్ … బూమ్!" వంటి బెస్ట్ మూవీస్ పోటీలో ఉన్నాయి. అలాగే జోయెల్ కోయెన్ దర్శకత్వంలో వచ్చిన షేక్స్‌పియర్ మూవీ “ది ట్రాజెడీ ఆఫ్ మెక్‌బెత్” అమెజాన్ ఆరోన్ సోర్కిన్ సారథ్యంలో వచ్చిన “బీయింగ్ ది రికార్డోస్” సైతం గట్టి పోటీనిస్తున్నాయి. ఇక “డూన్”, “కింగ్ రిచర్డ్” సైతం ఆస్కార్ బరిలో ఉన్నాయి.

క్రిస్టెన్ స్టీవర్ట్ అవార్డ్ కొడుతుందా?
పాబ్లో లారైన్ తీసిన "స్పెన్సర్"లో ప్రిన్సెస్ డయానాగా క్రిస్టెన్ స్టీవర్ట్ నటనకు ఆస్కార్ నామినేషన్‌ పొందుతుందని విపరీత అంచనాలుండేవి. అయితే ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ అవార్డు మాత్రం వరించలేదు. ప్రస్తుతం ఆమె ఈ సంవత్సరం ఉత్తమ నటి అవార్డు గెలుచుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆమెకు ఒలివియా కోల్మన్ ("ది లాస్ట్ డాటర్"), లేడీ గాగా ("హౌస్ ఆఫ్ గూచీ"), జెన్నిఫర్ హడ్సన్ ("రెస్పెక్ట్"), నికోల్ కిడ్‌మాన్ ("బీయింగ్ ది రికార్డోస్"), జెస్సికా చస్టెయిన్ ("ది ఐస్ టామీ ఫాయే") అలానా హైమ్ ("లికోరైస్ పిజ్జా") వంటి అగ్రతారల నుంచి బలమైన పోటీ ఎదురవనుంది.

ప్రజల ఆదరణ ఎంతవరకు?
ఈ సంవత్సరం ఆస్కార్‌ అవార్డుల ఫంక్షన్ ను ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రశ్న.. ఈ వేడుకలకు ప్రజల నుంచి పెద్దఎత్తున వీక్షణలు వస్తాయా? లేదా? అని. ఇప్పటికే అవార్డ్ షోలకు రేటింగ్‌లు క్షీణించాయి.
Published by:Veera Babu
First published:

Tags: National Awards, Oscar 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు