Home /News /explained /

EXPLAINED WHAT IS UPI123PAY RBIS NEW PAYMENTS SERVICE FOR FEATURE PHONES GH VB

Expained: ఇంటర్నెట్ అవసరం లేని పేమెంట్ గేట్‌వే.. UPI123Pay అంటే ఏంటి..? ఇది ఎలా పనిచేస్తుంది..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటి వరకు యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్ఫేస్‌(UPI) సేవలు స్మార్ట్‌ఫోన్‌లకే పరిమితమయ్యాయి. అయితే ప్రస్తుతం UPI123Pay ద్వారా స్మార్ట్‌ఫోన్‌లకే పరిమితమైన UPI సేవలను ఇంటర్నెట్ లేని ఫీచర్ ఫోన్‌లకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అందుబాటులోకి తీసుకురానుంది.

ఇంకా చదవండి ...
ఇప్పటి వరకు యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్ఫేస్‌(UPI) సేవలు స్మార్ట్‌ఫోన్‌లకే పరిమితమయ్యాయి. అయితే ప్రస్తుతం UPI123Pay ద్వారా స్మార్ట్‌ఫోన్‌లకే పరిమితమైన UPI సేవలను ఇంటర్నెట్ లేని ఫీచర్ ఫోన్‌లకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ‘ UPI123Pay సేవలు 40 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులకు అందుతాయి. ముఖ్యంగా దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను పెంచడంలో భాగంగా ఇంటర్నెట్‌ లేకుండా యూపీఐ సేవలు అందిస్తున్నాం. ఇండియాలో ఎక్కువ మంది ఉన్న వర్గాలకు ఈ సేవలు అందిస్తే డిజిటల్‌ ఇండియా కల త్వరగా సాకారమవుతుంది’ అని చెప్పింది.

RRB NTPC: ఆర్​ఆర్​బీ NTPC అభ్యర్థులకు అలర్ట్.. ఆ రోజే రివైజ్డ్ రిజల్ట్.. పెరగనున్న అర్హుల జాబితా..


రిజర్వు బ్యాంక్‌ చర్యలతో ప్రయోజనాలివే..!
దేశంలోని సగానికి పైగా రిటైల్ చెల్లింపులు ప్రస్తుతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ఈ పద్ధతి అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే, NPCI అందించే ఆఫర్ ఇంటర్నెట్-ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే పరిమితం అయింది. ఫిబ్రవరి నెలలో యూపీఐ ద్వారా జరిగిన 78 శాతం మర్చంట్ చెల్లింపుల విలువ రూ.500 కంటే తక్కువగా ఉంది. పీర్-టు-పీర్ చెల్లింపుల్లో 59% ట్రాన్సాక్షన్ల విలువ రూ.500 కంటే తక్కువ. ఇది యూపీఐ ట్రెండ్‌ని సూచిస్తోంది. చిన్న రిటైల్ లావాదేవీల కోసం ఎక్కువగా యూపీఐ సేవలను వినియోగదారులు ఉపయోగిస్తున్నారు.

ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఫీచర్ ఫోన్‌లలో యూపీఐ సేవలు అందుబాటులోకి వస్తుండటంతో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా వినియోగదారులు చేరుతారు. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌, డిజిటల్‌ ఇండియా పథకం సాకారం చేయడంలో ఉపయోగపడుతుంది. అదే విధంగా యూపీఐ ద్వారా చేసే పేమెంట్ల సంఖ్య కూడా పెరుగుతుంది.

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మాట్లాడుతూ..‘ ఈ ఏడాది ఫిబ్రవరిలో యూపీఐ ద్వారా 450 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. వాటి విలువ దాదాపు రూ.8.26 లక్షల కోట్లు. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ట్రాన్సాక్షన్లతో పోలిస్తే ప్రస్తుతం రెట్టింపు ఉంది. 2021-22లో జరిగిన మొత్తం ట్రాన్సాక్షన్ల విలువ రూ.41 లక్షల కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిన మొత్తం ట్రాన్సాక్షన్ల విలువ రూ.76 లక్షల కోట్లు.’ అని చెప్పారు.

PayNearby సీఈవో, ఫౌండర్‌ ఆనందక్‌ కుమార్‌ బజాజ్‌ మాట్లాడుతూ..‘ స్మార్ట్‌ఫోన్లను కొనలేని, వినియోగించలేని వర్గాలకు కూడా యూపీఐ సేవలు అందించాలి. డిజిటల్‌ భారత్‌ పథకం సాకారంలో వారి భాగస్వామ్యం కూడా అవసరం. అందుకే ఫీచర్‌ ఫోన్లలో కూడా యూపీఐ సేవలు తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తోంది. ఈ అడుగుతో యూపీఐ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇంటర్నెట్‌ అవసరం కూడా లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న దుకాణాలు సైతం యూపీఏ నెట్‌వర్క్‌లో చేరుతాయి.’ అని వివరించారు.

Telangana Jobs: నిరుద్యోగులకు మరో శుభవార్త.. పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్

UPI123Payని ఎలా ఉపయోగించాలి?

UPI123Payలో మూడు దశల్లో ట్రాన్సాక్షన్‌ జరపవచ్చు. ఇందులో IVR (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) నంబర్‌కు కాల్ చేయడం, ఫీచర్ ఫోన్‌లలో యాప్ ఫంక్షనాలిటీ, మిస్డ్ కాల్ ఆధారిత పద్ధతి, సౌండ్ బేస్డ్‌ పేమెంట్స్‌ ఉంటాయి. మిస్డ్ కాల్ ఫీచర్ ద్వారా బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సేవలు.. మమనీ పంపడం, తీసుకోవడం, సాధారణ కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులు వంటి ట్రాన్సాక్షన్లను నిర్వహించవచ్చు. దీన్ని వినియోగించేందుకు వ్యాపారి అవుట్‌లెట్‌లో ఉన్న నంబరుకు వినియోగదారుడు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఆ తర్వాత UPI పిన్‌ను ఎంటర్‌ చేస్తే ధ్రువీకరణ కోసం వినియోగదారుడికి ఇన్‌కమింగ్ కాల్‌ వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లలో లభించే UPI యొక్క స్కాన్-అండ్-పే ఫంక్షన్ UPI123Payలో లేదు.

ఇది UPI ప్రోగ్రామ్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లుంది?

*99# కోడ్‌ని ఉపయోగించి నేషనల్ యూనిఫైడ్ USSD ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రత్యామ్నాయంగా UPIని యాక్సెస్ చేయగలిగినప్పటికీ.. ప్రజాదరణ లభించలేదు. UPI123Payతో దేశంలోని 40 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులకు యూపీఐ సేవలు అందుతాయి. యూపీఐలో జరిగే మొత్తం ట్రాన్సాక్షన్ల విలువ త్వరలో రూ.100 కోట్లకు చేరుతుందని ,UPI123Pay దానిలో గణనీయమైన పాత్ర పోషిస్తుందని RBI అంచనా వేసింది.
Published by:Veera Babu
First published:

Tags: Explained, Paytm, Phone pay, Upi payments

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు