Home /News /explained /

Explained: స్టాగ్‌ఫ్లేషన్ అంటే ఏంటి? ఒమిక్రాన్ కార‌ణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను స్టాగ్‌ఫ్లేషన్‌ ఉచ్చులో చిక్కుకోనుందా?

Explained: స్టాగ్‌ఫ్లేషన్ అంటే ఏంటి? ఒమిక్రాన్ కార‌ణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను స్టాగ్‌ఫ్లేషన్‌ ఉచ్చులో చిక్కుకోనుందా?

ఒమిక్రాన్ వేరియంట్

ఒమిక్రాన్ వేరియంట్

Omicron Corona Variant: ప్రస్తుతం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను స్టాగ్‌ఫ్లేషన్ (Stagflation) భయాందోళనలకు గురిచేస్తుంది. ధరలు, నిరుద్యోగిత భారీగా పెరిగిపోతూ, ఆర్థిక వృద్ధి మందగించే సందర్భాన్ని స్టాగ్‌ఫ్లేషన్ అంటారు. దీనికి ఎన్నో కారణాలు దారి తీయవచ్చు. దీన్ని ద్రవ్యోల్బణం పరంగా స్తబ్దత అని కూడా పిలుస్తారు.

ఇంకా చదవండి ...
ఒమిక్రాన్ కొవిడ్ వేరియంట్ (Omicron corona variant )  వ్యాప్తి కారణంగా ప్రపంచ దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు.. ముఖ్యంగా దశాబ్దాలుగా అధిక ద్రవ్యోల్బణం ప్రభావాన్ని ఎదుర్కొంటున్న అమెరికా వంటి దేశాలను స్టాగ్‌ఫ్లేషన్ (Stagflation) ప్రభావం మరింత ఆందోళనలకు గురిచేస్తోంది. ఏదైనా దేశంలో నిరుద్యోగం (Unemployment)  పెరిగిపోవడం, దానికి ద్రవ్యోల్బణంతో కూడిన ఆర్థిక మందగమనం తోడవ్వడాన్ని స్టాగ్‌ఫ్లేషన్ అంటారు. లాక్‌డౌన్ల తరువాత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి సరైన పరిస్థితులు నెలకొంటున్న సమయంలో ఒమిక్రాన్ వ్యాప్తి వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే కొత్త వేరియంట్ తీవ్రతను ఇప్పటికిప్పుడు అంచనా వేయలేం కాబట్టి, అది ఆర్థిక వ్యవస్థలపై చూపే ప్రభావాన్ని సైతం కచ్చితంగా అంచనా వేయలేం.

స్టాగ్‌ఫ్లేషన్ గురించి చర్చ ఎందుకు?
ప్రస్తుతం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను స్టాగ్‌ఫ్లేషన్ భయాందోళనలకు గురిచేస్తుంది. ధరలు, నిరుద్యోగిత భారీగా పెరిగిపోతూ, ఆర్థిక వృద్ధి మందగించే సందర్భాన్ని స్టాగ్‌ఫ్లేషన్ అంటారు. దీనికి ఎన్నో కారణాలు దారి తీయవచ్చు. దీన్ని ద్రవ్యోల్బణం పరంగా స్తబ్దత అని కూడా పిలుస్తారు. ఈ పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందదు కానీ, కానీ ఖర్చులు పెరుగుతాయి. వాస్తవానికి ఆర్థిక వ్యవస్థ బాగా పని చేస్తున్నప్పుడు, నిరుద్యోగం తక్కువగా ఉన్నప్పుడు, వ్యాపారాలు పెరుగుతున్నప్పుడు ధరలు పెరుగుతాయని ఆశించవచ్చు. ఎందుకంటే ప్రజలకు ఖర్చు చేసే శక్తి ఉంటుంది.

కానీ వృద్ధి సక్రమంగా లేకుండానే, ధరలు ఎక్కువగా ఉండటం సప్లై చైన్ (Supply Chain) సమస్యలకు కారణమవుతుంది. వృద్ధి పరంగా సమస్యలు ఉంటే వ్యాపారాలు తమ ఉత్పత్తులకు కొనుగోలుదారులు లేరనే ఆందోళనతో ఉత్పత్తిని తగ్గిస్తాయి. దీంతో వివిధ రంగాల్లో నియామకాలు తగ్గుతాయి.

Explained: ప్రమాద‌క‌రంగా కోవిడ్ కొత్త వేరియంట్‌లు.. వాక్సిన్‌ల‌తోనే పిల్ల‌ల‌కు ర‌క్ష?


ఇదే సమయంలో మూలధనాన్ని సంరక్షించడంపై వ్యాపార వర్గాలు దృష్టి సారిస్తాయి. దీంతోపాటు తక్కువ మొత్తంలో చేసే ఉత్పత్తులకు అధిక డిమాండ్‌ ఉంటుంది. ఇది ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోస్తుంది.

కోవిడ్ లాక్‌డౌన్‌ (Covid LockDown)లు, పరిమితులు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు సప్లై చైన్‌ను ప్రభావితం చేశాయి. ఇది ఉత్పత్తిలో కోతకు దారితీసినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల కారణంగా మళ్లీ రికవరీ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రివెంజ్ స్పెండింగ్ అనే ధోరణి పెరగడంతో డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా వ్యాపారాలు ఉత్పత్తిని పెంచడం కోసం నియామకాలను పెంచుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మళ్లీ షట్‌డౌన్ (Shut Down), ప్రయాణాలపై నిషేధాలు తప్పట్లేదు. ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థలు గాడిలో పడుతుండగా, ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని మళ్లీ మొదటి దశకు తీసుకువెళుతుందని నిపుణులు భయపడుతున్నారు. తాజా ఆంక్షలు మళ్లీ డిమాండ్‌ను దెబ్బతీస్తాయి. దీంతో కంపెనీలు మళ్లీ ఉత్పత్తి, నియామకాలను తగ్గించుకోవాల్సి వస్తుంది. వినియోగదారులు అధిక ధరల ప్రభావాన్ని ఎదుర్కొంటారు. ఈ సమస్యపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Omicron Corona Variant: పొంచి ఉన్న ‘ఒమిక్రాన్‌’ ముప్పు.. తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు తెలుసుకోండి


స్టాక్‌ మార్కెట్లపై ఒమిక్రాన్ ప్రభావం ఎలా ఉంది?
ఒమిక్రాన్‌ (Omicron) కారణంగా ఆంక్షలు విధిస్తారనే ఊహాగానాలతో మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. చాలామంది పెట్టుబడిదారులు (Investors) రిస్క్ ఆస్తులను విక్రయించడంపై దృష్టిపెట్టారు. చమురు ధరలు కూడా తగ్గాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1,000 పాయింట్లకు పైగా పడిపోయింది. S&P 500 ఇండెక్స్ 106.84 పాయింట్లు పడిపోయింది. బెంచ్‌మార్క్ వాల్ స్ట్రీట్ ఇండెక్స్ ఫిబ్రవరి నుంచి కనిష్టానికి దిగజారింది. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తే సప్లై చైన్ సమస్య మరింత దిగజారుతుంది. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న రికార్డు స్థాయి అధిక ద్రవ్యోల్బణాన్ని ఒమిక్రాన్ మరింత పెంచుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తక్కువ వృద్ధి, అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఎదురయ్యే స్టాగ్‌ఫ్లేషన్ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్ (Market) ఒడిదొడుకులకు గురవుతున్నాయి.

అమెరికాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి?
ఈ నెల ప్రారంభంలో అమెరికా (America) వినియోగదారుల ధరల సూచీ గత ఏడాది కంటే 6.2 శాతానికి పెరిగింది. 1990 నుంచి ఇదే అతిపెద్ద పెరుగుదల అని నివేదికలు చెబుతున్నాయి. అయితే యూఎస్ ఫెడరల్ రిజర్వ్, వైట్ హౌస్ (White House) అధికారులు మాత్రం, ఈ ధరల పెరుగుదల తాత్కాలికమైనదని చెబుతున్నారు. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం సమీప భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీస్తుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మహమ్మారి కారణంగా 22 మిలియన్ల మంది అమెరికన్లు ఉద్యోగాలను కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ భారీ పతనాన్ని నమోదు చేసినప్పటికీ, భారీ ప్రభుత్వ వ్యయం, ఫెడరల్ రిజర్వ్ అత్యవసర చర్యల కారణంగా మళ్లీ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంది. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో డిమాండ్ పెరిగింది. దీంతో కస్టమర్ల అవసరాలు తీర్చడానికి కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి.

Omicron Corona Variant: క‌ల‌వ‌రపెడుతున్న కొత్త వేరియంట్‌.. టీకాలు ప‌ని చేస్తాయా?.. శాస్త్ర‌వేత్త‌లు ఏమంటున్నారు


సప్లై చైన్‌ను మెరుగుపర్చడానికి సరుకు రవాణా ఛార్జీలు, వస్తువుల సేకరణ ఖర్చులు పెంచాల్సి వచ్చింది. ఈ ఖర్చులను కంపెనీలు కొనుగోలుదారులకు బదిలీ చేశాయి. ఇదే సమయంలో 1.9 ట్రిలియన్ డాలర్ల కరోనావైరస్ రిలీఫ్ ప్యాకేజీ, గృహ అవసరాల కోసం 1,400 డాలర్ల చెల్లింపులు.. వంటి చర్యలు ఆర్థిక వ్యవస్థను ఎక్కువగా ప్రేరేపించాయి.

 అమెరికా స్టాగ్‌ఫ్లేషన్‌ను ఎదుర్కొంటుందా?
అమెరికాలో స్టాగ్‌ఫ్లేషన్ పరిస్థితులను ఇప్పటికిప్పుడు ఊహించడం తొందరపాటు అవుతుందని కొందరు నిపుణులు తెలిపారు. అయితే ఒమిక్రాన్ కేసుల (Omicron Cases)  పెరుగుదల పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా తరువాత నెలకొన్న గ్రేట్ రిజిగ్నేషన్ (Great Resignation) పరిస్థితుల తరువాత కార్యాలయాలకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్న కార్మికులను నియమించుకోవడానికి వ్యాపారాలు ముందుకు వస్తున్నాయి. దీనికి తోడు ఉద్దీపన చర్యల కారణంగా కంపెనీలు, గృహాల పరిస్థితులు బలమైన స్థితిలోనే ఉన్నాయి. నాలుగో త్రైమాసికంలో వృద్ధి రేటు పెరుగుతుందని చాలా మంది ఆర్థికవేత్తలు ఆశిస్తున్నారు. అంటే వృద్ధి రేటు, అధిక ద్రవ్యోల్బణం వంటి రెండు పరిస్థితులను అమెరికా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Published by:Sharath Chandra
First published:

Tags: America, Covid -19 pandemic, Increase unemployee, Omicron corona variant

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు