హోమ్ /వార్తలు /Explained /

Explained: ఇన్‌కమ్ ట్యాక్స్‌లో రూల్ 132 అంటే ఏంటి? పన్ను చెల్లింపుదారులకు ఇది ఎందుకు ముఖ్యమైనది?

Explained: ఇన్‌కమ్ ట్యాక్స్‌లో రూల్ 132 అంటే ఏంటి? పన్ను చెల్లింపుదారులకు ఇది ఎందుకు ముఖ్యమైనది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆదాయ పన్నుపై సెస్సు లేదా సర్‌చార్జిపై డిడక్షన్‌ అందించాలా? లేదా? అనే వివాదాలను పరిష్కరించేందుకు రూల్‌ 132ను తీసుకొచ్చారు. బిజినెస్‌లు చెల్లించే ఆదాయ పన్నుపై డిడక్షన్‌ ఇవ్వకూడదని చట్టం స్పష్టం చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Explained: బిజినెస్ యూనిట్ల ట్యాక్స్ డిడక్షన్స్‌కు(Tax deductions) సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ (Income Tax Dpartment). సెస్/సర్‌ఛార్జ్‌పై డిడక్షన్‌ పొందిన వ్యాపార సంస్థలకు ప్రభుత్వం ఓ అవకాశం కల్పించింది. తమ ఆదాయాన్ని తిరిగి లెక్కించేందుకు అవకాశం కల్పించింది. నిబంధనలకు విరుద్ధంగా క్లెయిమ్‌ చేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) రూల్ 132ని ప్రవేశపెట్టింది. ఇది 2022 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. రూల్ 132, ఇన్‌కమ్ టాక్స్ రూల్స్, 1962లో ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 155లోని సబ్-సెక్షన్ 18 కింద రీ కంప్యుటేషన్‌ ఆఫ్‌ ఇన్‌కం గురించి తెలుపుతుంది. బిజినెస్‌ లేదా ప్రొఫెషన్‌ నుంచి ఆదాయం పొందే వారిపై ఈ కొత్త రూల్‌ ప్రభావం ఉంటుంది. ఐటీ డిపార్ట్‌మెంట్ తాజా నిర్ణయంతో రూల్‌ 132పై అందరి దృష్టి పడింది.

రూల్ 132 అంటే ఏంటి?

ఆదాయ పన్నుపై సెస్సు లేదా సర్‌చార్జిపై డిడక్షన్‌ అందించాలా? లేదా? అనే వివాదాలను పరిష్కరించేందుకు రూల్‌ 132ను తీసుకొచ్చారు. బిజినెస్‌లు చెల్లించే ఆదాయ పన్నుపై డిడక్షన్‌ ఇవ్వకూడదని చట్టం స్పష్టం చేసింది. అయితే అటువంటి ఆదాయ పన్నుపై సెస్సు లేదా సర్‌ఛార్జ్ డిడక్షన్‌ అమలు గురించి చట్టం పేర్కొనలేదు. దీంతో కొన్ని వ్యాపార సంస్థలు సెస్ లేదా సర్‌చార్జి డిడక్షన్‌ క్లెయిమ్ చేస్తున్నాయి. ఇటీవలి తీర్పులో కోర్టులు సెస్, సర్‌చార్జ్‌ల డిడక్షన్‌ను అనుమతించాయని వేద్ జైన్ & అసోసియేట్స్ భాగస్వామి అంకిత్ జైన్ ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌తో చెప్పారు.

ఫైనాన్స్ యాక్ట్ 2022లో, ఆదాయ పన్నుపై అటువంటి సెస్, సర్‌ఛార్జ్‌ల మినహాయింపు.. పన్ను పరిధిలోకి వచ్చే లాభం నుంచి పొందే డిడక్షన్‌ కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2005 నుంచి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్‌తో ఆదాయ పన్ను చట్టాన్ని సవరించి స్పష్టత ఇచ్చింది. పన్ను చెల్లించదగిన లాభాల నుంచి మినహాయింపుగా సెస్ లేదా సర్‌ఛార్జ్‌లను క్లెయిమ్ చేసిన పన్ను చెల్లింపుదారులను తిరిగి గణించడానికి ప్రభుత్వం అనుమతించింది. అటువంటి సెస్ లేదా సర్‌ఛార్జ్‌ని తీసివేసిన తర్వాత పన్ను విధించదగిన లాభాలపై పన్ను వసూలు చేస్తారు.

 ఇన్‌కం తిరిగి లెక్కించేందుకు రూల్ 132

సెస్సు లేదా సర్‌చార్జి డిడక్షన్‌ క్లెయిమ్ చేసిన పన్ను చెల్లింపుదారుడు తమ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం, చెల్లించిన పన్ను, డిడక్షన్‌ క్లెయిమ్‌ చేసిన సెస్/సర్‌ఛార్జ్ మొత్తాన్ని పన్ను అధికారులతో పంచుకోవచ్చు. ఫారమ్ 69ని ఉపయోగించి ఆదాయ పన్ను పోర్టల్‌లో సమాచారాన్ని సమర్పించాలి. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తిరిగి లెక్కిస్తారు. ట్యాక్స్ పేయర్స్ చెల్లించాల్సిన అదనపు పన్నును తెలియజేస్తారు. ఆ మొత్తాన్ని చెల్లించి, ఫారమ్ 70లో పన్ను చెల్లింపు గురించి పన్ను అధికారికి తెలియజేయవచ్చు. అటువంటి చెల్లింపుపై ఎటువంటి జరిమానా విధించరు.

FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పెంచిన ప్రముఖ బ్యాంకులు.. ఎక్కువ వడ్డీని అందించే బ్యాంకులు ఇవే..

రూల్‌ 132 ప్రయోజనాలు

రూల్ 132 అనేది సెక్షన్ 155 నిబంధనకు లోబడి ఉండటానికి మదింపుదారులను అనుమతించే నిబంధన. ఇది అసెస్సింగ్ అధికారులను మునుపటి సంవత్సరాలలో మొత్తం ఆదాయాన్ని తిరిగి లెక్కించే అవకాశం కల్పిస్తుంది. ఇందులో మదింపుదారుడు సర్‌ఛార్జ్ లేదా సెస్‌ను మినహాయించవలసి ఉంటుంది.

 సమాచారం అందించకపోతే ఏం జరుగుతుంది?

2023 మార్చి 31లోపు ఫారమ్ 69లో సమాచారాన్ని అందించాలి. సమయానికి సమాచారం అందించకపోతే, పన్ను చెల్లింపుదారుని డిఫాల్ట్‌గా ఉంచవచ్చు. అటువంటప్పుడు పన్ను మొత్తంతో పాటు వడ్డీ, పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది.

రూల్ 132 ప్రకారం రీకంప్యూటేషన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి

మదింపుదారుడు ఫారమ్ 69లో, సర్‌ఛార్జ్ లేదా సెస్ డిడక్షన్‌ క్లెయిమ్‌ను అనుమతించకుండా మునుపటి సంవత్సరం మొత్తం ఆదాయాన్ని తిరిగి లెక్కించడం కోసం AOని అభ్యర్థించాలి. అప్లికేషన్‌ను ఆన్‌లైన్‌లో సబ్మిట్‌ చేయాలి. PDGIT (సిస్టమ్స్) లేదా DGIT (సిస్టమ్స్) ఫారమ్ 69 ప్రమాణాలను నిర్దేశిస్తుంది. దరఖాస్తును AOకి ఫార్వర్డ్ చేస్తుంది. సంబంధిత ఆర్డర్‌ను సవరించడం ద్వారా AO మొత్తం ఆదాయాన్ని తిరిగి లెక్కించాలి. వారు సెక్షన్ 156 ప్రకారం చెల్లించవలసిన పన్ను మొత్తం (ఏదైనా ఉంటే) చెల్లించాల్సిన సమయాన్ని పేర్కొంటూ నోటీసు జారీ చేస్తారు.

రూల్ 132 vs రివైజ్డ్ రిటర్న్స్

రివైజ్డ్ రిటర్న్‌కి 132 రూల్‌కి చాలా తేడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరం 2021-22 (అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2022-23)కి సంబంధించి దాఖలు చేసిన ITR కోసం రివైజ్డ్‌ రిటర్న్‌ను 2022 డిసెంబర్ 31 వరకు మాత్రమే ఫైల్ చేయవచ్చు. ఆర్థిక సంవత్సరం 2004-05 (అసెస్‌మెంట్ ఇయర్‌ 2005–06) నుంచి ఫారమ్ 69లో 2023 మార్చి 31 వరకు ఇన్‌కం రీ-కంప్యూటేషన్ కోసం ఫైల్ చేయవచ్చు.

First published:

Tags: Income tax

ఉత్తమ కథలు