హోమ్ /వార్తలు /Explained /

Explained: రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ద్రవ్య విధానం అంటే ఏంటి..? ఆర్థిక వ్యవస్థలో వీటి ప్రాధాన్యం ఏమిటి..?

Explained: రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ద్రవ్య విధానం అంటే ఏంటి..? ఆర్థిక వ్యవస్థలో వీటి ప్రాధాన్యం ఏమిటి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ద్రవ్యోల్బణం (Inflation) కంటిన్యూగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆర్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది తాజాగా రెపో రేటు (Repo Rate)ను 40 బేసిస్​ పాయింట్లు పెంచేసింది. దీంతో రేపో రేట్ ఇప్పుడు 4.4 శాతానికి ఎగబాకింది.

ద్రవ్యోల్బణం (Inflation) కంటిన్యూగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆర్​బీఐ(Reserve Bank Of India) కీలక నిర్ణయం తీసుకుంది. ఇది తాజాగా రెపో రేటు (Repo Rate)ను 40 బేసిస్​ పాయింట్లు(Basis Points) పెంచేసింది. దీంతో రేపో రేట్ ఇప్పుడు 4.4 శాతానికి ఎగబాకింది. ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతుందని, అందుకే రేపో రేటు పెంచినట్లు ఆర్​బీఐ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఎలాంటి షెడ్యూల్ లేని సమీక్షలో అనూహ్యంగా వడ్డీ రేట్లు(Interest Rates) పెంచడంతో స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఒక్కసారిగా క్రాష్(Crash) అయ్యాయి. ఈ రోజు అనూహ్య రెపో రేటు పెంపుతో సెన్సెక్స్ 900 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 16,800 దిగువకు పడిపోయింది. రేపో రేట్ పెంచుతూ గవర్నర్ శక్తికాంత దాస్ కొన్ని బ్యాంకింగ్ టర్మ్స్ ఉపయోగించారు. వీటి అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Explained : PPF అకౌంట్ అంటే ఏంటి..? PPF అకౌంట్‌ను ఎందుకు ఓపెన్ చేయాలి..? దీని ప్రయోజనాలు ఏవి..?


ద్రవ్య విధానం లేదా మానిటరీ పాలసీ అంటే ఏంటి?

ద్రవ్య విధానం (Monetary Policy) అనేది దేశ సుస్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఆర్​బీఐ వద్ద అందుబాటులో ఉన్న ఆర్థిక సాధనాలు, చర్యలు అని చెప్పవచ్చు. ప్రతి దేశంలో సెంట్రల్ బ్యాంకులు ఈ పాలసీని అమలు చేస్తాయి. ఈ పాలసీ సహాయంతో దేశంలోని మొత్తం డబ్బు సరఫరాను ఆర్​బీఐ కంట్రోల్ చేస్తుంది. ఇలా చేయడానికి ఇతర మార్గాలు ఉన్నప్పటికీ, ద్రవ్య విధాన సమీక్షలు అత్యంత ప్రభావవంతమైనవిగా నిలుస్తాయి. మానిటరీ పాలసీలు ప్రాథమికంగా కమర్షియల్ బ్యాంకులకు డబ్బు సరఫరాను నియంత్రిస్తాయి. దీనివల్ల పరోక్షంగా ప్రజలు, కంపెనీలపై ప్రభావం పడుతుంది. ఆర్​బీఐ ప్రకారం, మానిటరీ పాలసీ ప్రాథమిక లక్ష్యం ఆర్థిక వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ధరల స్థిరత్వాన్ని కొనసాగించడం. స్థిరమైన వృద్ధికి ధరల స్థిరత్వం తప్పనిసరి అని ఆర్​బీఐ చెబుతుంది.

రెపో రేటు అంటే ఏమిటి?

సాధారణంగా ప్రజలు తమ వద్ద సరిపడా డబ్బు లేనప్పుడు ఏదో ఒకటి తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటారు. ఈ రుణంపై వడ్డీ కడతారు. అయితే బ్యాంకుల వద్ద కూడా ఒక్కోసారి నిధుల కొరత ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఈ బ్యాంకులు ఆర్థిక సహాయం కోసం సెంట్రల్ బ్యాంక్‌ ఆర్​బీఐను ఆశ్రయిస్తాయి. ఈ కమర్షియల్ బ్యాంకులు సెక్యూరిటీలు లేదా బాండ్లను విక్రయించడం ద్వారా ఆర్​బీఐ నుంచి నగదును తీసుకుంటాయి. ఈ నగదుపై ఆర్​బీఐ విధించే వడ్డీ రేటును "రెపో రేటు (Repo Rate)" అంటారు.

రివర్స్ రెపో రేటు అంటే ఏంటి?

సాధారణంగా ప్రజల వద్ద అన్ని ఖర్చులు పోను అదనపు డబ్బులు మిగిలినప్పుడు వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటారు. వీటిపై వడ్డీని బ్యాంకులు ప్రజలకు చెల్లిస్తాయి. అయితే కమర్షియల్ బ్యాంకుల్లో కూడా అవసరానికి మించిన నగదు ఉంటుంది. ఈ నగదును బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తాయి. ఈ డబ్బుపై బ్యాంకులకు ఆర్​బీఐ చెల్లించే వడ్డీని "రివర్స్ రెపో రేటు (Reverse Repo Rate)" అంటారు.

రివర్స్ రెపో రేటు కంటే రెపో రేటు ఎందుకు ఎక్కువగా ఉంటుంది?

అన్ని బ్యాంకుల మాదిరిగానే ఆర్​బీఐ ప్రాఫిట్ ఆశిస్తుంది. అందుకే ఇది కమర్షియల్ బ్యాంకులు ఇచ్చే రుణాలపై ఎక్కువ వడ్డీ రేటు వసూలు చేస్తూ.. కమర్షియల్ బ్యాంకుల నుంచి తీసుకునే డిపాజిట్లపై తక్కువ వడ్డీ రేటు చెల్లిస్తుంది. సరళంగా చెప్పాలంటే, కమర్షియల్ బ్యాంకుల నుంచి వసూలు చేసే వడ్డీ అదే బ్యాంకులకు చెల్లించే వడ్డీ కంటే ఎక్కువగా ఉంటుంది.

UK Vs Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. యూకేపై అణు దాడి చేయాలని వ్యాఖ్యానించిన రష్యన్ స్టేట్ మీడియా..


రెపో, రివర్స్ రెపో రేట్లు ఎందుకు కీలకం?

ఆర్​బీఐ రెపో, రివర్స్ రెపో రేట్లను బ్యాంకింగ్ రంగం అంతటా అందించే వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించడానికి, పెంచడానికి ఉపయోగిస్తుంది. దీని వల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. రెపో రేటు తగ్గించడం ద్వారా ఇది ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇది వ్యాపార రుణాలు, కారు రుణాలు, గృహ రుణాలు మొదలైన వాటిపై వడ్డీ రేటును తగ్గిస్తుంది. ఇది ప్రజలను డబ్బు ఖర్చు చేయమని ప్రోత్సహిస్తుంది. అయితే దీనికి విరుద్ధంగా డబ్బు ఖర్చు చేయకుండా సేవ్ చేసుకోమని ప్రోత్సహించడానికి రివర్స్ రెపో రేట్ ని ఆర్​బీఐ తగ్గిస్తుంది.

First published:

Tags: Monitory policy, Rbi, Repo rate, RRR

ఉత్తమ కథలు