EXPLAINED WHAT IS RBI BACKED DIGITAL RUPEE AND HOW WILL IT BE DIFFERENT FROM BITCOIN GH VB
Explained: డిజిటల్ రూపీ అంటే ఏమిటి..? బిట్ కాయిన్ కు దీనికి తేడా ఏమిటి.. బడ్జెట్ ప్రసంగంలో దీనిపై మంత్రి ఏం మాట్లాడారు..?
ప్రతీకాత్మక చిత్రం
డిజిటల్ కరెన్సీపై ఉన్న అపోహలను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలోనే ఇండియాలో అధికారిక డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
డిజిటల్ కరెన్సీపై(Digital Currency) ఉన్న అపోహలను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం(Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలోనే ఇండియాలో అధికారిక డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రకటించారు. డిజిటల్ రూపీని(Digital Rupee) ప్రవేశపెట్టనున్నట్లు ఆమె చెప్పారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా పనిచేసే డిజిటల్ రూపీని అందుబాటులోకి తీసుకురానున్నామని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రి నిర్మలా తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో కరోనా సమయంలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామన్నారు. వచ్చే 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు తెలిపారు.
బ్లాక్ చైన్, ఇతర టెక్నాలజీలను ఉపయోగించి.. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ డిజిటల్ రూపీని రిజర్వ్ బ్యాంక్ జారీ చేయనుంది. దేశంలో క్రిప్టో కరెన్సీ వాడకం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.
డిజిటల్ రూపీ అంటే..
డిజిటల్ రూపీ అంటే అధికారిక డిజిటల్ కరెన్సీ అని అర్థం. దీనినే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) అని కూడా పిలుస్తారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు (CBDC) డిజిటల్ రూపంలో ఉన్నప్పటికీ, అవి దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ ద్వారా సృష్టించబడిన చట్టపరమైన టెండర్లు. ఇవి నగదు రూపంలో కాకుండా డిజిటల్‌గా ఉంటాయి. ఇకపోతే ఇలాంటి లీగల్ డిజిటల్ కరెన్సీలు పలు దేశాల్లో అమల్లో ఉన్నాయి. డిజిటల్ డాలర్, ఇ-యువాన్, డిజిటల్ యూరో లాంటి అనేక కరెన్సీలతో కేంద్ర బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు చేస్తున్నాయి.
డిజిటల్ కరెన్సీ ఎందుకు?
కొన్ని కీలక ప్రయోజనాల కోసం ఈ డిజిటల్ కరెన్సీ అవసరమవుతుంది. ప్రింటింగ్ ఖర్చులను తగ్గించడం, సెటిల్మెంట్ రిస్క్‌లను తగ్గించడం, టైమ్ జోన్ సమస్యలను నివారించడం లాంటి ప్రయోజనాల కోసం మున్ముందు డిజిటల్ కరెన్సీ ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. అంతేకాకుండా CBDC ప్రవేశపెట్టడం ద్వారా నగదు వినియోగాన్ని తగ్గించినట్లయితే భారతదేశంలో కరెన్సీ, జీడీపీ(GDP) కి ఉన్న నిష్పత్తిని తగ్గించొచ్చు.
బిట్‌కాయిన్‌కు, దీనికి ఏంటి తేడా?
అధికారిక డిజిటల్ కరెన్సీకి ఆర్బీఐ(RBI) మద్దతు ఉంటుంది. అన్ని లావాదేవీలకు వీటిని ఉపయోగించుకోవచ్చు. మామూలు డబ్బు లాగానే డిజిటల్ డబ్బుని కూడా వాడుకోవచ్చు. డిజిటల్ రూపాయి భౌతికమైన రూపాయికి సమానమైన విలువను కలిగి ఉంటుంది. ఇకపోతే బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలకు ఎలాంటి స్థిరమైన వాల్యూ ఉండదు. రకరకాల కారణాల ద్వారా దాని విలువ అమాంతం తగ్గడం అమాంతం పెరగడం జరుగుతుంటుంది. క్రిప్టోకరెన్సీలు పీర్-టు- పీర్ ఆస్తులు. అంటే ఇవి ఏ అధికారిక నియంత్రణ కలిగి ఉండవు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.