EXPLAINED WHAT IS QD OLED THE NEW DISPLAY TECH IN TVS GH VB
Explained: టీవీలలో సరికొత్త డిస్ప్లే టెక్నాలజీ QD OLED.. అసలేంటీ టెక్నాలజీ..? దీని ప్రయోజనాలేంటి..?
ప్రతీకాత్మక చిత్రం
మారుతున్న కాలానికి అనుగుణంగా టీవీల రంగంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత దశాబ్దంలో ఎల్సీడీ, ఎల్ఈడీ నుంచి ఓఎల్ఈడీ (OLED), క్యూఎల్ఈడీ (QLED) వంటి టెక్నాలజీలు పరిచయమయ్యాయి. ఇప్పుడు QD-OLED వంతు వచ్చింది.
మారుతున్న కాలానికి అనుగుణంగా టీవీల(Television) రంగంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత దశాబ్దంలో ఎల్సీడీ(LCD), ఎల్ఈడీ నుంచి ఓఎల్ఈడీ (OLED), క్యూఎల్ఈడీ (QLED) వంటి టెక్నాలజీలు(Technology) పరిచయమయ్యాయి. ఇప్పుడు QD-OLED వంతు వచ్చింది. సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసే వేదిక కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES). ఈ ఏడాది లాస్ వేగాస్(Loss Vegas)లో జరిగిన ఈ షోలో ఫ్యూచర్ టీవీలకు(Future TVs) సంబంధించి QD-OLED పేరుతో సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించారు. తర్వాతి తరం డిస్ప్లే టెక్నాలజీగా(Display Technology) పేర్కొంటున్న ఈ టెక్నాలజీ(Technology)ఎలా పనిచేస్తుందో చూద్దాం.
QD-OLED ఇప్పటికే అందుబాటులో ఉన్న OLED టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. LCDల కంటే OLED డిస్ప్లేలు మెరుగ్గా ఉంటాయి. QD-OLED దీన్ని మరింత మెరుగ్గా చేస్తుంది అనుకోవచ్చు. చిన్న సెమీకండక్టర్ నానోక్రిస్టల్స్ స్వరూపమైన క్వాంటం డాట్స్ (QD) సాంకేతికత దీనిలో ప్రధానం. నిర్దిష్టమైన రంగును ప్రసారం చేసే ఈ నానోక్రిస్టల్స్ లైటింగ్ ద్వారా యాక్టివేట్ అవుతాయి. అనంతరం ప్రకాశవంతమైన, కచ్చితమైన కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేస్తుంది.
QD-OLED డిస్ప్లే ఎలా పని చేస్తుంది?
QD డిస్ప్లే అనేది ఒక సెల్ఫ్ ల్యుమినస్ డిస్ప్లే. ఇది TFT లేయర్‌ను కలిగి ఉంటుంది. ఇది లైట్ ఎమిట్టింగ్ లేయర్‌ను నియంత్రించే ఎలక్ట్రానిక్ సర్క్యూట్. మంచి బ్రైట్నెస్ కోసం QD డిస్ప్లే బ్లూ లైట్‌ను ఉపయోగిస్తుంది. క్యూడీ డిస్ప్లే లైట్ సోర్స్ నుంచి విడుదలయ్యే ఈ బ్లూ లైట్ ప్యూర్‌గా, శక్తిమంతంగా ఉంటుంది. దీన్ని స్వీకరించడం ద్వారా కలర్స్‌ను ఉత్పత్తి చేసే రెడ్, గ్రీన్ QD కూడా హై కలర్ ప్యూరిటీతో కలర్ లైట్‌ను ఉత్పత్తి చేస్తుంది. QD డిస్ప్లేలో ఉండే ఈ కాంపౌండ్స్ అన్నీ టీవీలో సహజమైన, ప్రకాశవంతమైన రంగులను అందిస్తాయి.
QD-OLEDతో ప్రయోజనాలేంటి?
గణనీయమైన ప్రకాశాన్ని ఏర్పరచే క్వాంటం డాట్స్(QD) చాలా స్వచ్ఛంగా ఉంటాయి. వీని వల్ల టీవీ డిస్ప్లేలో ఎటువంటి బర్న్స్ ఏర్పడకుండా నివారించవచ్చు. సంప్రదాయ డిస్ప్లే 1,00,000 కాంట్రాస్ట్ రేషియోను కలిగి ఉంటుంది. దీనితో మనం చూసే స్పెక్ట్రమ్‌లో 41nm-455nm మధ్య తరంగదైర్ఘ్యాలతో కూడిన షార్ట్ వేవ్ బ్లూ లైట్ కంటిపై ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా కంటిలోని మెలటోనిన్ స్రావాలు అణచివేతకు గురవుతాయి. దీనితో నిద్ర తీవ్రంగా ప్రభావితం అవుతుంది. QD-OLED డిస్ప్లేల్లో తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్నందున బ్లూ లైట్ ఎక్స్పోజర్ను ఆప్టిమైజ్ చేస్తూ.. కళ్లకు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తుంది.
QD-OLED టీవీల ధరెంతో?
Samsung, Sony 2022లో ఈ కొత్త టెక్నాలజీతో టీవీలను లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. అయితే, ధరలు మరియు లాంచ్ తేదీలు ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతానికి ధర వెల్లడించనప్పటికీ.. OLED, LED టీవీల కంటే వీటి ధర కొంచెం ఎక్కువగా ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.