హోమ్ /వార్తలు /Explained /

Explained: అసలేంటీ పీఎం శ్రీ పథకం? విద్యార్థులకు లాభమా.. నష్టమా..?

Explained: అసలేంటీ పీఎం శ్రీ పథకం? విద్యార్థులకు లాభమా.. నష్టమా..?

Prime Minister Narendra Modi

Prime Minister Narendra Modi

Explained: ఇటీవల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సరికొత్త పథకాన్ని ప్రకటించారు. అదే పీఎం శ్రీ (ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) స్కీమ్. ఈ పథకం వల్ల విద్యార్థులకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరనున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఏ దేశమైనా ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే విద్య (Education) అనేది ప్రధానమైన అంశం. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యక్తులను నిలబెట్టే దేవాలయం పాఠశాల. ఆ పాఠశాలల దశ, దిశను మార్చేందుకు ఇటీవల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Indian PM Narendra Modi) సరికొత్త పథకాన్ని ప్రకటించారు. అదే పీఎం శ్రీ (ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) స్కీమ్. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలల (Schools)ను ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయనున్నారు.ఈ పథకాన్ని జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నూతన విద్యా విధానాన్ని 2020లో ప్రవేశపెట్టింది. ఈ విధానంలో భాగంగా పాఠశాలల్లో సిలబస్ మార్పుతో పాటు బోధనా పద్ధతులలో మార్పులు చేయనున్నారు. ప్రాథమిక, మాధ్యమిక, సెకండరీ లెవల్స్‌లో విద్యార్థులకు చదువు చెప్పే విధానంలో మార్పులు తీసుకొచ్చి, వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
* నిధులు
ఈ స్కీమ్‌లో భాగంగా కేంద్రం విడుదల చేసే నిధులు 60 శాతం ఉండగా, మిగతా 40 శాతాన్ని రాష్ట్రాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కేంద్ర పాలిత ప్రాంతాలు ఇదే విధంగా తమ నిధులను సమకూర్చుకోవాలి. జమ్ము కశ్మీర్, ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ , ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్రం 90 శాతం వరకు నిధులను అందించొచ్చు. ఈ నిధుల ద్వారా స్కూల్స్‌ను అప్ గ్రేడ్ చేసి అత్యద్భుతంగా తీర్చిదిద్దాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన.
* సదుపాయాలు
ఈ స్కీమ్ లో భాగంగా పాఠశాలల్లో ల్యాబ్‌లు, మోడ్రన్ క్లాస్ రూమ్స్‌, స్పోర్ట్స్ ఎన్విరాన్‌మెంట్, ఆర్ట్ స్టూడియోస్‌ను ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణ హితంగా ఈ పనులు జరగాలని కేంద్రం సూచించింది. పీఎం శ్రీ స్కీమ్ ద్వారా పాఠశాలల దశ, దిశ మారి అవి ‘మోడ్రన్ స్కూల్స్’గా మారుతాయని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ పథకం ద్వారా దేశంలోని వేల మంది విద్యార్థులకు లాభం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పాఠశాలల్లో సిలబస్ మార్పులకు తగ్గట్లు పీఎం శ్రీ పథకం ద్వారా మోడ్రన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి రానుంది.


* బోధన పద్ధతులు
పాఠశాలల్లో సంప్రదాయ విధానాలకు స్వస్తి పలికి నూతన పద్ధతుల్లో బోధన చేయాలని ఇప్పటికే పలు సూచనలను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇచ్చింది. అందులో భాగంగా సిలబస్, బోధనా పద్ధతులను నాలుగు విధాలుగా విభజించారు. ఫౌండేషనల్, ప్రిపరేటరీ, ఇంటర్మీడియట్, సెకండరీ లెవల్స్ గా పేర్కొన్నారు. గ్రేడ్ 1, 2 ల్లో విద్యార్థులకు ప్లే బేస్‌డ్ మోడ్‌లో పాఠాలు చెప్పాలని, ప్రిపరేటరీ లెవల్ 3 నుంచి 5 తరగతుల వరకు లైట్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చి ఫార్మల్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇవ్వాలన్నారు.
ఇది కూడా చదవండి :నీట్ యూజీ 2022 ఫలితాలు విడుదల.. మీ స్కోర్‌కార్డ్‌లో ఎర్రర్స్ ఉంటే ఇలా సరిచేసుకోండి..
ఇక ఇంటర్మీడియట్, సెకండరీ లెవల్స్ లో సబ్జెక్ట్ టీచర్స్ క్లియర్ గా సైన్స్ అండ్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ వివరించాలని సూచించారు. నూతన విద్యా విధానం ప్రాముఖ్యతను పీఎం శ్రీ స్కీమ్ ద్వారా పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు అత్యాధునికంగా మారనున్నాయి.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, PM Narendra Modi, Schools

ఉత్తమ కథలు