Home /News /explained /

EXPLAINED WHAT IS NO FAULT DIVERS HOW DOES IT WORK FOR THOSE WHO WANT TO GET A DIVORCE AT UK DETAILS HERE GH VB

Explained: అక్కడ నో ఫాల్ట్‌ డైవర్స్‌కు ఎగబడుతున్న జంటలు.. అసలు ఏంటిది..? ఎలా పనిచేస్తుంది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్రిటన్‌లో 2022 ఏప్రిల్ 6 నుంచి జంటలు 'నో-ఫాల్ట్ డైవర్స్‌' కోరేందుకు అనుమతి దక్కుతోంది. నో-ఫాల్ట్ డైవర్స్‌ ద్వారా భార్యాభర్తలిద్దరూ ఎలాంటి కారణాలు చూపకుండా తక్కువ సమయంలో విడాకులు పొందే అవకాశం కలుగుతోంది.

విడాకులు(Divorce) తీసుకోవడమనేది ఎవరి జీవితంలోనైనా కష్టమైన సందర్భం. జీవితాన్ని ప్రభావితం చేసే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో పిల్లల సంరక్షణ(Childcare), ఆస్తుల పంపకం(Asset Distribution), న్యాయసంబంధ వ్యవహారాలకు(Legal Issues) సంబంధించిన ఖర్చులు వంటివి ఉంటాయి. విడాకులు కోరుతూ న్యాయస్థానాలను సంప్రదించే జంటలు ముందుగా.. 50 సంవత్సరాలకు పైగా అమలులో ఉన్న ప్రస్తుత చట్టం ప్రకారం వైవాహిక జీవితం పతనమవడానికి, విడిపోవాలని నిర్ణయించుకోవడానికి కారణాలు తెలపాలి. వ్యభిచారం, అసమంజసమైన ప్రవర్తన, సమ్మతి లేకుండా ఐదు సంవత్సరాలపాటు విడిగా ఉండటం వంటి కారణాల్లో కనీసం ఒకదాన్ని న్యాయస్థానం ముందు పెట్టాల్సి ఉంటుంది.

ఏదేమైనప్పటికీ బ్రిటన్‌లో 2022 ఏప్రిల్ 6 నుంచి జంటలు 'నో-ఫాల్ట్ డైవర్స్‌' కోరేందుకు అనుమతి దక్కుతోంది. నో-ఫాల్ట్ డైవర్స్‌ ద్వారా భార్యాభర్తలిద్దరూ ఎలాంటి కారణాలు చూపకుండా తక్కువ సమయంలో విడాకులు పొందే అవకాశం కలుగుతోంది.

Techie Turns Delivery Agent: టీసీఎస్(TCS) లో ఉద్యోగం వదిలి.. జొమాటో డెలివరీ ఏజెంట్‌గా విధులు.. కారణం ఏంటి..?


నో ఫాల్ట్‌ డ్రైవర్స్‌ అంటే ఏమిటి?
డైవర్స్‌ డిసొల్యూషన్‌ అండ్‌ సెపరేషన్‌ యాక్ట్‌ (2020) అనేది యునైటెడ్ కింగ్‌డమ్‌కి సంబంధించిన విడాకుల చట్టంలో అర్ధ శతాబ్ధానికి పైగా కాలంలో జరిగిన అత్యంత ముఖ్యమైన మార్పులలో ఒకటి. దీని ద్వారా విడాకులు కోరుకొనే భార్యాభర్తలు.. ఎలాంటి కారణాలను న్యాయస్థానాలకు తెలపాల్సిన అవసరం లేదు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోకుండానే వీలైనంత త్వరగా విడాకులు తీసుకొని విడిపోవచ్చు. పిల్లలు, ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే ముఖ్యమైన సమస్యలపై దృష్టి పెట్టడానికి, భవిష్యత్తును ఎంచుకొనేందుకు వీలు కల్పిస్తుంది. డైవర్స్‌ డిసొల్యూషన్‌ అండ్‌ సెపరేషన్‌ యాక్ట్‌ (2020) 2022 ఏప్రిల్ 6 నుంచి అమల్లోకి రానుంది.

ఎవరు అప్లై చేయవచ్చు, ఎలా సాయపడుతుంది?
వైవాహిక జీవితం తిరిగి చక్కదిద్దుకోలేని విధంగా దెబ్బతిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి జీవించే సూచనలు లేవని భాగస్వామి లేదా జంట భావించినప్పుడు విడాకుల కోసం అప్లై చేసుకోవచ్చని కొత్తగా వచ్చిన మార్పులు సూచిస్తున్నాయి. దాఖలు చేయవచ్చని మార్పులు సూచిస్తున్నాయి. భావోద్వేగాలు ఇప్పటికే ఎక్కువగా ఉన్న సమాజంలో అనవసరంగా వేలెత్తి చూపే చర్యలను, క్రూరత్వాన్ని కొత్త మార్పులు నివారిస్తాయి. తల్లిదండ్రులు ఒకరిపై ఒకరు బురదజల్లుకోవడాన్ని పిల్లలు చూడకుండా కాపాడుతుంది.

Viral Video:పెళ్లి పీటల మీద కాబోయే భర్తతో కన్నీళ్లు పెట్టించిన యువతి.. కారణం తెలిస్తే షాక్

కనీస సమయం ఎంత?
విచారణ ప్రారంభం అయిన సమయం నుంచి కండిషన్‌ ఆర్డర్‌ ఫర్‌ డైవర్స్‌కి అప్లై చేయడానికి మధ్య 20 వారాల కనీస కాలపరిమితిని కూడా చట్టం కల్పిస్తోంది. ఈ సమయంలో తిరిగి ఆలోచించుకోవడానికి, సయోధ్య కుదుర్చుకోవడానికి, పిల్లలు, ఆర్థిక, ఆస్తి సహా క్లిష్టమైన భవిష్యత్తు అంగీకరించేందుకు సిద్ధపడటానికి సమయం దొరుకుతుంది.
Published by:Veera Babu
First published:

Tags: Divorce, England, Explained

తదుపరి వార్తలు