Home /News /explained /

Explainer: net-zero: నెట్ జీరో అంటే ఏంటి? భారత్ దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తోంది?

Explainer: net-zero: నెట్ జీరో అంటే ఏంటి? భారత్ దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తోంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నెట్ జీరో చాలామంచి పద్ధతే అయితే దానివల్ల పర్యావరణానికి మేలు జరిగితే కేవలం భారత్ మాత్రమే దాన్ని వ్యతిరేకిస్తోంది అన్న ప్రశ్న ప్రతి సాధారణ వ్యక్తికి ఎదురవుతుంది. ఎందుకంటే దీనివల్ల భారత్ చాలా ప్రభావితం కానుంది.

ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. క్లైమేట్ ఛేంజ్ పార్టనర్ షిప్ పేరుతో పర్యావరణాన్ని కాపాడే దిశగా పార్ట్ నర్ షిప్స్ కూడా చేసుకుంటున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడి రాయబారి జాన్ కెర్రీ మన దేశానికి విచ్చేశారు. పర్యావరణ అంశాలపై శ్రద్ధ పెట్టి గత నాలుగేళ్లుగా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆగిపోయిన క్లైమేట్ ఛేంజ్ పార్టనర్ షిప్ గురించి చర్చించేందుకు మూడు రోజుల పాటు ఆయన భారత్ పర్యటనకు వచ్చారు. ఏప్రిల్ 22, 23న వర్చువల్ మాధ్యమంలో క్లైమేట్ లీడర్స్ సమ్మిట్ జరుగనున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జో బైడెన్ పాల్గొంటున్న ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. పర్యావరణం గురించి చర్చించేందుకు ఏర్పాటు కానున్న ఈ అంతర్జాతీయ సమావేశాల్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అందుకే ఈ సమావేశాల్లో ఏదైనా మంచి ఫలితం లభించే దిశగా అమెరికా అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నిస్తోంది. అందులో భాగమే జాన్ కెర్రీ భారత పర్యటన అని కూడా చెప్పుకోవచ్చు.

ఈ గ్లోబల్ క్లైమేట్ లీడర్ షిప్ లో భాగంగా మరోసారి అమెరికా నెట్ జీరో ఎమిషన్ కి మరోసారి కట్టుబడి ఉంటున్నట్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు. 2050 కల్లా జీరో నెట్ ఎమిషన్ ఉండేలా ప్రయత్నించేందుకు చాలా దేశాలు చట్టాలు చేసుకొని మరీ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందులో యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు చట్టాలు చేస్తే కెనడా, దక్షిణ కొరియా, జపాన్, జర్మనీ వంటి దేశాలు చట్టాలు చేయకపోయినా తాము 2050 కల్లా నెట్ జీరో ఎమిషన్ కి కట్టుబడి ఉన్నామని ప్రకటించాయి.

చైనా కూడా 2060 కల్లా నెట్ జీరో అమలు పరుస్తామని ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ తన సభ్య దేశాలన్నింటికీ కలిపి ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఆలోచిస్తోంది. అమెరికా, చైనా తర్వాత గ్రీన్ హౌజ్ గ్యాసెస్ విడుదల చేసే దేశాల్లో మూడో స్థానంలో నిలుస్తోంది భారత్. కానీ నెట్ జీరోకి కట్టుబడి ఉంటామని మన దేశం ఇప్పటికీ ప్రకటన చేయట్లేదు. కెర్రీ భారత్ కి రావడం వెనుక కారణం కూడా అదే.. ఈ విషయంలో భారత్ కి ఉన్న వ్యతిరేకత ఎందుకో తెలుసుకొని.. దానికి తగిన మార్గాలను వెతికేందుకే ఆయన మూడు రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తున్నారు. దీని ద్వారా మన దేశాన్ని కూడా నెట్ జీరో 2050 ప్రమాణంలో భాగం చేయాలన్నది అమెరికా ఆలోచన.

నెట్ జీరో గోల్ ఏంటి?
దీన్నే కార్బన్ న్యూట్రాలిటీ అని కూడా పిలుస్తారు. దీని ఉద్దేశం దేశాలన్నీ గ్రీన్ హౌజ్ గ్యాసెస్ విడుదలను పూర్తిగా ఆపేయడం కాదు. కానీ నెట్ జీరో స్టేట్ అంటే విడుదలయ్యే గ్రీన్ హౌజ్ గ్యాసెస్ విలువకు సమానంగా దాన్ని పీల్చుకునేలా ఏర్పాట్లు కూడా చేయడం.. దీనికి గాను అడవులను ఎక్కువగా పెంచడం, వాతావరణం నుంచి ఈ వాయువులను పీల్చుకునేలా కార్బన్ కాప్చర్, స్టోరేజ్ వంటి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలను ఏర్పాటు చేయడం వంటివి కూడా చేయవచ్చు. ఇలా చేయడం వల్ల వాహనాలు, పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యం కంటే ఇవన్నీ కలిపి పీల్చుకునే కాలుష్యం ఎక్కువగా ఉంటుంది.

ఇలాగే జరిగితే నెగెటివ్ ఎమిషన్స్ స్టేటస్ లోకి కూడా వెళ్లే అవకాశాలుంటాయి. దీనికి చక్కటి ఉదాహరణ మన పక్కనే ఉన్న భుటాన్. అక్కడ విడుదలయ్యే కాలుష్యం కంటే వాటిని తిరిగి పీల్చుకునే ఏర్పాట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ దేశాన్ని కార్బన్ నెగెటివ్ దేశంగా పిలుస్తారు. సాధారణంగా కార్బన్ న్యూట్రల్ దేశంగా పిలిపించుకోవాలంటే దేశంలో విడుదలవుతున్న కార్బన్ లెవల్స్ ని తగ్గించడంతో పాటు వాటిని వాతావరణం నుంచి పీల్చుకునే లేదా తొలగించే ఏర్పాట్లు చేయడం అన్నమాట. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అన్ని దేశాలు సమాన బాధ్యత తీసుకొని దీన్ని చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

భారత్ ఎందుకు కాదంటోంది?
నెట్ జీరో చాలామంచి పద్ధతే అయితే దానివల్ల పర్యావరణానికి మేలు జరిగితే కేవలం భారత్ మాత్రమే దాన్ని వ్యతిరేకిస్తోంది అన్న ప్రశ్న ప్రతి సాధారణ వ్యక్తికి ఎదురవుతుంది. ఎందుకంటే దీనివల్ల భారత్ చాలా ప్రభావితం కానుంది. మన దేశంలో వచ్చే రెండు మూడు దశాబ్దాల్లో కార్బన్ ఉద్గారాలు ప్రపంచంలోని అన్ని దేశాల కంటే వేగంగా పెరగనున్నాయి. కోట్లాది మందిని పేదరికం నుంచి కాపాడేందుకు ఇదే మార్గంగా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి తగినట్లు ఎన్ని వేల ఎకరాల్లో అడవులను పెంచినా ఈ పెరుగుతున్న రేటుకు సమానంగా దాన్ని మార్చడం సాధ్యం కాని పని.. కార్బన్ రిమూవల్ టెక్నాలజీలు కూడా చాలా ఖరీదుతో కూడుకున్నవి. భారత్ అంత ఖర్చుతో వాటిని ఏర్పాటు చేసే స్థితిలో ప్రస్తుతం లేదు. అందుకే భారత్ దీనికి సంబంధించి తనదైన వాదన వినిపిస్తోంది. వీటిలోనూ ఎన్నో వాస్తవాలు ఉన్నాయి.

2015 లో జరిగిన ప్యారిస్ అగ్రిమెంట్ లో నెట్ జీరో భాగంగా లేదు. పర్యావరణ మార్పులపై పోరాటాన్ని కొనసాగించేలా ప్రతి సభ్య దేశం తనకు సాధ్యమైన చర్యలన్నీ తీసుకుంటూ కార్బన్ ఉద్గారాలను తగ్గించాలన్నదే అందులో ఉంది. ప్రతి దేశం తనకోసం ప్రత్యేకంగా ఐదేళ్ల, పదేళ్ల చొప్పున టార్గెట్స్ పెట్టుకుంటూ పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నించాలి. వాటిని చేరుకున్న తర్వాత కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఈ లక్ష్యాలు గతం కంటే మరింత పెద్దవిగా ఉండాలి అన్నదే దీని ముఖ్యాంశం. దీన్ని అమల్లోకి తీసుకురావడం ఈ ఏడాదిలోనే ప్రారంభించాయి చాలా దేశాలు. 2025 కి కొన్ని, 2030 కి మరికొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. అందుకే భారత్ నెట్ జీరో గురించి మరో టార్గెట్ ని ఏర్పాటు చేయకుండా 2015 ప్యారిస్ అగ్రిమెంట్ లో భాగంగా నిర్ణయించినట్లుగా తమ లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగాలని భారత్ అన్ని దేశాలను కోరుతోంది. ప్యారిస్ అగ్రిమెంట్ తర్వాత మన దేశం ఏర్పాటు చేసుకున్న లక్ష్యాల్లో మూడింటిని చేరుకొని ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

ప్రపంచ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకు మించి పెరగకుండా ఉండేందుకు అన్ని దేశాలు చర్యలు చేపట్టాలని పారిస్ అగ్రిమెంట్ లో నిర్ణయించుకున్నారు. కానీ దీన్ని పాటిస్తున్న ఒకే ఒక G-20 దేశం భారత్ కావడం విశేషం. ఈ విషయంలో యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా తగిన రీతిలో చర్యలు చేపట్టడం లేదని చాలా అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అంటే పర్యావరణ మార్పులను అడ్డుకునేందుకు భారత్ మిగిలిన అన్ని దేశాల కంటే ముందుందనే చెప్పుకోవాలి. ఇవే కాదు.. చాలా అభివృద్ధి చెందిన దేశాలు తాము గతంలో చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవడం, లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నించడం వంటివి చేయలేదని భారత్ ఎత్తి చూపుతోంది. క్యోటో ప్రోటోకాల్ కింద కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఏర్పాటు చేసిన టార్గెట్లను ఏ పెద్ద దేశమూ చేరుకోలేదు. కొన్ని దేశాలు ప్రయత్నించకుండానే దాన్ని పక్కన పెట్టేశాయి. 2020 కల్లా చేరుకుంటామని నిర్ణయించుకున్న లక్ష్యాలను ఏ దేశమూ చేరుకోలేదు. పేద దేశాలకు డబ్బు, టెక్నాలజీ అందించి పర్యావరణ మార్పులను తట్టుకునేందుకు వాటిని సన్నద్ధం చేయడానికి నిర్ణయించిన లక్ష్యాలను అయితే దాదాపు అన్ని దేశాలు పక్కన పెట్టాయి.

2050 కార్బన్ న్యూట్రాలిటీ అనే లక్ష్యానికి కూడా అన్ని దేశాలు ఇలాగే గండి కొడతాయని భారత్ భావిస్తోంది. కొన్ని దేశాలు ఈ విషయంలో చట్టాలు చేస్తున్నా మిగిలిన దేశాలు దీన్ని అమలు చేస్తాయన్న నమ్మకం మాత్రం ఎవరికీ లేదు. అందుకే భారత్ ఆయా దేశాలను కార్బన్ న్యూట్రాలిటీ కోసం ప్రయత్నించే బదులు ఇంతకుముందు వారు పెట్టుకొని పక్కన పడేసిన లక్ష్యాలు పూర్తి చేయాలని దీనికోసం సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతోంది. 2050 లేదా 2060 కల్లా మన దేశం కార్బన్ న్యూట్రాలిటీ సాధించలేదని ప్రభుత్వం చెప్పట్లేదు కానీ దానికోసం అంతర్జాతీయంగా కమిట్ మెంట్ ఇచ్చి ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం కంటే లక్ష్యం పెట్టుకొని పనిచేసి చూపించడమే మంచి పని అని భారత్ భావిస్తోంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Air Pollution, America, India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు