హోమ్ /వార్తలు /Explained /

Explained: రాకెట్​ ఫోర్స్‌తోనే చైనాకు చెక్.. అసలేంటిది? యుద్ధాలకు ఎలా ఉపయోగపడుతుంది?

Explained: రాకెట్​ ఫోర్స్‌తోనే చైనాకు చెక్.. అసలేంటిది? యుద్ధాలకు ఎలా ఉపయోగపడుతుంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rocket Force: నూతన సాంకేతిక విధానంతో పోరాడాల్సిన అవసరాన్ని సీడీఎస్​ చీఫ్​ జనరల్​ బిపిన్​ రావత్​ గుర్తు చేశారు. రాకెట్​ ఫోర్స్​ విధానం ద్వారా శత్రువులపై వ్యూహాత్మకంగా దాడి చేయవచ్చని, దీని ద్వారా వారిపై వేగంగా విరుచుకుపడవచ్చని ఆయన చెబుతున్నారు.

ఇంకా చదవండి ...

పొరుగునే ఉన్న పాకిస్ఠాన్, చైనా దేశాలతో దాడులు జరిగే ముప్పు ఉన్న కారణంగా సైనిక వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా ఇండియన్​ ఆర్మీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ‘రాకెట్ ఫోర్స్‌’ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు డిఫెన్స్ స్టాఫ్​ చీఫ్ జనరల్​ బిపిన్ రావత్ తాజాగా వెల్లడించారు. సరిహద్దుల్లో పాకిస్థాన్, చైనాల నుంచి ఎదురవుతున్న జాతీయ భద్రతా సవాళ్లను అధిగమించేందుకు సాంకేతికత వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్​ ఇప్పటికే కశ్మీర్‌లో అలజడులు రేపుతోందని, పంజాబ్‌ సహా ఇతర ప్రాంతాల్లో సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని రావత్‌ ఆరోపించారు.

మరోవైపు, చైనా మన సరిహద్దులపై దాడులు చేసేందుకు తన భద్రతా బలగాలను పటిష్టం చేస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే చైనా తాజాగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ (PLARF) పేరుతో కొత్త సైనిక విభాగాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. అందువల్ల, రాబోయే కాలంలో చైనా నుంచి దాడులు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని, మనం కూడా రాకెట్​ ఫోర్స్​ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ప్రతిదాడులకు సిద్ధం కావాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.

బిపిన్​ రావత్ రాకెట్ ఫోర్స్‌కి సంబంధించి ఎలాంటి వివరాలకు వెల్లడించలేదు. దీంతో ఇప్పుడు ఈ రాకెట్​ ఫోర్స్​ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు రాకెట్​ ఫోర్స్​ అంటే ఏంటి? శత్రువులపై దాడులు చేయడంలో ఇది ఎలా ఉపయోగపడుతుంది? అనే విషయాలు తెలుసుకుందాం.

రాకెట్ ఫోర్స్ అంటే ఏమిటి?

ప్రస్తుతం ఆయుధాలు, యుద్ద ట్యాంకులు, యుద్ధ విమానాలతో భారత సైనికులు శత్రు బలగాలపై పోరాడుతున్నాయి. అయితే, దీని వల్ల పెద్ద ఎత్తున ఆస్తి నష్టంతో పాటు ఎంతో మంది జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే, నూతన సాంకేతిక విధానంతో పోరాడాల్సిన అవసరాన్ని సీడీఎస్​ చీఫ్​ జనరల్​ బిపిన్​ రావత్​ గుర్తు చేశారు. రాకెట్​ ఫోర్స్​ విధానం ద్వారా శత్రువులపై వ్యూహాత్మకంగా దాడి చేయవచ్చని, దీని ద్వారా వారిపై వేగంగా విరుచుకుపడవచ్చని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న క్షిపణులు, లాంగ్-రేంజ్​ల కంటే ఈ రాకెట్లు శత్రువులను ధీటుగా ఎదుర్కోగలవరని ఆయన వెల్లడించారు.

Explained: పంజాబ్ సీఎంగా చరణ్‌జీత్ సింగ్‌ను కాంగ్రెస్ ఎందుకు ఎంపిక చేసింది? 5 కారణాలివే ..ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం దాడులు, ప్రతిదాడులు ఎదురెదురుగా జరుగుతున్నాయి. అయితే, భవిష్యత్తులో ఈ పరిస్థితి ఉండకపోవచ్చు. రాబోయే యుద్ధాలు ఎక్కువగా కాంటాక్ట్‌లెస్‌గా ఉండే అవకాశం ఉంది. అందుకే మానవ రహిత యుద్దాలపై ఎక్కువ దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఆయుధాలతో దాడులు, సైబర్ దాడులు, హ్యాండ్- టు -హ్యాండ్ పోరాటాల కంటే రాకెట్​ ఫోర్స్​ శత్రువులను ధీటుగా ఎదుర్కోగలదు.” అని బిపిన్​ రావత్​ అభిప్రాయపడ్డారు.

అమెరికాను తలదన్నాలని చైనా ప్లాన్

అమెరికాను తలదన్ని అగ్రదేశంగా అవతరించాలని భావిస్తోన్న చైనా ఇప్పటికే తన సైనిక సామర్థ్యాలు పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టింది. అమెరికా, రష్యా దేశాలకు ధీటుగా చైనా తన ఆర్మీకి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. చైనా తాజాగా రాకెట్​ ఫోర్స్​ను ఏర్పాటు చేసింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ (PLARF) పేరుతో మిసైల్​ గేమ్​కు సిద్ధమవుతోంది.

చైనా పీఎల్​ఏఆర్​ఎఫ్​ సామర్థ్యాలు ఏమిటి?

చైనా రిటైర్డ్​ మేజర్ జనరల్ పికె మల్లిక్ PLA సెకండ్ ఆర్టిలరీ ఫోర్స్​పై మాట్లాడుతూ "ప్రపంచ దేశాలతో పోలిస్తే చైనా అణ్వాయుధాల్లో ముందంజలో ఉంది. కొత్తగా ప్రవేశపెట్టిన రాకెట్ ఫోర్స్ ద్వారా చైనా సైనిక విభాగం మరింత పటిష్టమవుతోంది. చైనా ఆర్మీ, ఎయిర్​ఫోర్స్​, నేవీలతో పాటు కొత్తగా రాకెట్​ ఫోర్స్​ కూడా చేరింది. ఇది చైనాకు నాల్గవ రక్షణ దళంలా మారింది.”అని అన్నారు. సంప్రదాయ అణు క్షిపణులను నిర్వహించడం ఈ పీఎల్​ఏఆర్​ఎఫ్ విభాగం​ బాధ్యతగా ఆయన తెలిపారు.

Explained:  దేశంలోని రైళ్లు ఆలస్యంగా ఎందుకు నడుస్తున్నాయి.. రైల్వేశాఖ ఏం చెబుతోంది ?కొత్తగా ఏర్పాటు చేసిన పీఎల్​ఏఆర్​ఎఫ్​ విభాగంపై చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ మాట్లాడుతూ ‘‘మన దేశ భద్రతకు రాకెట్​ ఫోర్స్​ గొప్ప ఆస్తిగా భావిస్తున్నాం. మన జాతీయ భద్రతను కాపాడడంలో ఇది ఒక ముఖ్యమైన మూలస్తంభం. చైనా రక్షణ వ్యవస్థకు దీన్ని గేమ్​ ఛేంజర్​గా భావిస్తున్నాం." అని పేర్కొన్నారు. PLARF లో దాదాపు 2,500 బాలిస్టిక్ క్షిపణుల ఉంటాయి. అవి క్రూయిజ్ క్షిపణులకు కాస్త భిన్నంగా ఉంటాయి. ఇవి ఎక్కువ దూరం ప్రయాణించి పెద్ద పేలోడ్‌లను కూడా ద్వంసం చేయగలవు.

యూఎస్​ ఆర్మీ నివేదిక ప్రకారం చైనా పీఎల్​ఏఆర్​ఎఫ్​ విభాగంలో 800 నుంచి -1,000 కిలో మీటర్లు ప్రయాణించగల DF 16 మిసైల్, DF-21 MRBM మిస్సైల్​, DF-21D యాంటీ షిప్​ బాలిస్టిక్ మిస్సైల్​, 1200 షాట్​ రేంజ్​ మిస్సైల్స్​, 1,500 కి.మీ. ప్రయాణించగల CJ-10 గ్రౌండ్-లాంచ్ క్రూయిజ్ మిస్సైల్స్​ అందుబాటులో ఉన్నాయి.

గేమ్ ఛేంజర్​గా పేర్కొంటున్న చైనా

PLARF గేమ్-ఛేంజర్​గా చైనా ప్రభుత్వం చెబుతోంది. చైనా వలే ఇప్పటికే అనేక దేశాలు ఈ రాకెట్ ఫోర్స్​పై దృష్టి సారించాయి. చైనా తన పీఎల్​ఏఆర్​ఎఫ్​ విభాగాన్ని ఖచ్చితంగా వ్యూహాత్మక దాడుల్లో ఉపయోగిస్తుంది. ఆయా దాడులను ఎదుర్కోవాలంటే మన దగ్గర కూడా రాకెట్​ ఫోర్స్​ ఉండాలని సీడీఎస్​ ఛీఫ్​ బిపిన్​ రావత్​ పేర్కొన్నారు. ఇవి డ్రోన్​ దాడులను సైతం సమర్థవంతంగా ఎదుర్కోగలవని ఆయన చెప్పుకొచ్చారు.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Defence Ministry, Indian Army, Indo China Tension

ఉత్తమ కథలు