Bitcoin city: బిట్ కాయిన్ సిటీ.. ఎక్కడ నిర్మిస్తున్నారు? దాని ప్రత్యేకతలేంటి?

ప్రతీకాత్మక చిత్రం

Bitcoin City: క్రిప్టో కరెన్సీని చట్టబద్ధంగా ఆమోదించిన చేసిన ఏకైక దేశంగా గుర్తింపు తెచ్చుకుంది ఎల్ సాల్వెడార్. కేవలం 70 లక్షల జనాభా ఉండే ఈ మధ్య అమెరికా దేశం తాజాగా మరో వినూత్న ప్రకటన చేసింది. బిట్ కాయిన్ నగరాన్ని నిర్మించనున్నట్లు ఆ దేశ అధ్యక్షులు నయీబ్ బుకెలే ప్రకటించారు.

  • Share this:
క్రిప్టో కరెన్సీ (Crypto Currency)ని చట్టబద్ధంగా ఆమోదించిన చేసిన ఏకైక దేశంగా గుర్తింపు తెచ్చుకుంది ఎల్ సాల్వెడార్ (El Salvador). కేవలం 70 లక్షల జనాభా ఉండే ఈ మధ్య అమెరికా దేశం తాజాగా మరో వినూత్న ప్రకటన చేసింది. బిట్ కాయిన్ నగరాన్ని (Bitcoin city) నిర్మించనున్నట్లు ఆ దేశ అధ్యక్షులు నయీబ్ బుకెలే ప్రకటించారు. బిట్ కాయిన్ పై మక్కువ పెంచుకున్న 40 ఏళ్ల నయీబ్.. కాల పరీక్షకు నిలబడే బిట్ కాయిన్ సిటీని నిర్మిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఈ నగరంలో ఎలాంటి పన్నులు ఉండబోవని, ఇది ప్రపంచంలోనే మొదటి అతిపెద్ద బిట్ కాయిన్ సిటీగా నిలుస్తుందని వెల్లడించారు. ఈ సిటీకి బిట్ కాయిన్ ద్వారా పాక్షికంగా నిధులు సమకూరుస్తామని వెల్లడించారు.

* బిట్ కాయిన్ సిటీని ఎక్కడ నిర్మిస్తారు?
ఎల్ సాల్వెడార్ ఆగ్నేయ భాగంలో ఉన్న లా యూనియన్ (La union) ప్రాంతంలో ఈ బిట్ కాయిన్ నగరాన్ని నిర్మించనున్నట్లు నయీబ్ తెలిపారు. ఇది కొంచాగ్వా అగ్ని పర్వతం సమీపంలోని గల్ఫ్ ఆఫ్ ఫోన్సెకా వద్ద ఉంటుంది. 60 రోజుల్లో నిధులు సమకూర్చి 2022లో ఈ నగర నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. ఈ నిధుల్లో కొంత మొత్తం ప్రభుత్వం నుంచి జారీ చేసిన ప్రత్యేక బాండ్ల నుంచి సేకరిస్తామని తెలిపారు. ఈ నగరంలో కమర్షియల్ ప్రాంతాలు, రెసిడెన్షియల్ ఏరియాలు, మ్యూజియాలు, వినోదం, బార్లు, రెస్టారెంట్లు, ఎయిర్ పోర్ట్, రైల్వే లాంటి అన్ని సదుపాయాలు ఉంటాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ సిటీ నాణెం ఆకృతిలో ఉంటుందని, పైనుంచి చూస్తే సెంట్రల్ ప్లాజా వద్ద బిట్ కాయిన్ సింబల్ మాదిరిగా కనిపిస్తుందని తెలిపారు.

Crypto values: బిట్‌కాయిన్ విలువ భారీగా పతనం.. క్రిప్టో బిల్లే కారణమా? పూర్తి వివరాలు

* నగరానికి నిధులు ఎలా సమకూరుతాయి?
ఈ బిట్ కాయిన్ సిటీలో ఉండే నివాసితులకు ఆదాయ పన్ను, ప్రాప్రర్టీ ట్యాక్స్, సిటీ ట్యాక్స్ లాంటివేమి ఉండవని, కేవలం వ్యాట్(Value Added Tax) మాత్రమే ఉంటుందని నయీబ్ స్పష్టం చేశారు. ఈ వ్యాట్ లో సగభాగం మున్సిపాలిటీకి చెల్లిస్తారని, మిగిలిన సగభాగాన్ని ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలు, నగర నిర్వహణకు వినియోగిస్తామని తెలిపారు. నివేదికల ప్రకారం ఈ నగర నిర్మాణానికి 3 లక్షల బిట్ కాయిన్లు ఖర్చు అవుతుందని సమాచారం. ప్రస్తుతం ఒక్కో బిట్ కాయిన్ విలువ 60 వేల అమెరికన్ డాలర్లు కాగా.. మొత్తం నగర నిర్మాణానికి 18 బిలియన్ డాలర్లు అవుతుందని అంచనా. ఆసక్తికరమైన విషయం ఏంటంటే నగరానికి అవసరమైన శక్తి(Energy) కోసం బిట్ కాయిన్ మైనింగ్ సపోర్ట్ తీసుకోనున్నారట.

Cryptocurrency: క్రిప్టో కరెన్సీపై నిషేధం లేదు... కేంద్రం తెస్తున్న చట్టం లక్ష్యమేంటి?

* ఎల్ సాల్వెడార్ బిట్ కాయిన్ బాండ్ ఏంటి?
ఒక బిలియన్ డాలర్ల నిధులను సేకరించడానికి ఎల్ సాల్వెడార్ బిట్ కాయిన్ బాండ్ ను జారీ చేస్తుంది. అందులో సగం బిట్ కాయిన్ సిటీ కోసం, బిట్ కాయిన్ మైనింగ్, శక్తి, మౌలిక సదుపాయాల కోసం ఉపయోగిస్తారు. మిగిలిన సగం మరిన్ని బిట్ కాయిన్లు కొనుగోలు చేయడానికి వినియోగిస్తారు. ఇందుకోసం నయీబ్ ప్రభుత్వం బిట్ కాయిన్ సర్వీస్ సంస్థ బ్లాక్ స్ట్రీమ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా ఎల్ సాల్వెడార్‌లో సెక్యూరిటీలను తీసుకురావడానికి, బాండ్ల జారీని సులభతరం చేయడానికి సెక్యూరిటీస్ చట్టాన్ని తీసుకురానుంది. ఈ డాలర్ బాండ్లు 10 ఏళ్ల కాలవ్యవధితో పాటు 5-సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ను కలిగి ఉంటాయి.

Crypto currencies: ఆ క్రిప్టో కరెన్సీలు మనుగడలో ఉండవా? రఘురామ్ రాజన్ ఏం చెబుతున్నారంటే..

బిట్ కాయిన్ ఆధారిత బాండ్ ప్రారంభంలో 6.5 శాతం డివిడెండ్ చెల్లిస్తుంది. అయితే బుకెలే బిట్ కాయిన్ సిటీ ప్రకటన చేసినప్పుడు అక్కడ ఉన్న బ్లాక్ స్ట్రీమ్ ఛీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సామ్సన్ మోవ్ మాట్లాడుతూ.. ఎల్ సాల్వెడార్ కొనుగోలు చేసిన బిట్ కాయిన్ లో కొంత భాగాన్ని అమ్ముతామని తెలిపారు. పెట్టుబడిదారులకు అదనపు డివిడెండ్ అందించడానికి ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందని స్పష్టం చేశారు. 2009లో ప్రారంభమైనప్పటి నుంచి బిట్ కాయిన్ విలువలో విపరీతమైన హెచ్చుతగ్గులు నమోదయ్యాయని, ఈ విలువ బ్లాక్ స్ట్రీమ్ అంచనాపై ఆధారపడి ఉందని సామ్సన్ తెలిపారు. 2022లో జారీ అయ్యే బిట్ కాయిన్ బాండ్లు 10 ఏళ్ల తర్వాత 150 శాతం పుంజుకుంటాయని, ఐదేళ్లలో ఒక బిట్ కాయిన్ విలువ 1 మిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.

* బిట్ కాయిన్ పై సాల్వెడార్ ప్రజలు ఏమనుకుంటున్నారు?
లాటిన్ అమెరికాలో పేద దేశాల్లో ఒకటైన ఎల్ సాల్వెడార్ కు అధిక పెట్టుబడులు తీసుకువచ్చేందుకు అధ్యక్షుడు నయీబ్ బుకెలే బిట్ కాయిన్ స్వీకరణను సమర్థించారని నివేదికలు చెబుతున్నాయి. సెప్టెంబరులో బిట్ కాయిన్‌ను లీగల్ టెండర్‌గా చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రాచుర్యం పొందారు. అయితే ఈ నిర్ణయంతో ఆయనకు వ్యతిరేకంగా ఎన్నో నిరసనలు జరిగాయి. ఇదిలా ఉంటే ఎల్ సాల్వెడార్ ప్రభుత్వం బిట్ కాయిన్ లావాదేవీల కోసం ఈ-వాలెట్ ను కూడా ప్రారంభించింది. స్థానిక భాషలో దీన్ని చీవో అంటారు. దీంతో లక్షల మంది సాల్వాడార్లు క్రిప్టోకరెన్సీతో కొనుగోళ్లు, విక్రయాలు చేయవచ్చని సదరు ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా విదేశాల్లో నివసిస్తున్న వారు కమీషన్లు చెల్లించకుండానే చెల్లింపులు పంపవచ్చని తెలిపింది.

Bitcoin City: ఆ సిటీలో టాక్స్ లు ఉండవు, బ్యాంకులతో పనిలేదు..వచ్చేస్తోంది Bitcoin

ఎల్ సాల్వెడార్ కు సొంత కరెన్సీ లేదు. అమెరికన్ డాలర్ ను ప్రధాన చట్టపరమైన టెండర్ గా ఉపయోగిస్తుంది. ఇది ఆర్థిక వృద్ధిని పెంచుతుందని, ఉద్యోగ సృష్టికి దారితీస్తుందని నయీబ్ అభిప్రాయపడ్డారు. చివరగా బుకెలే బిట్ కాయిన్ నగరం గురించి మాట్లాడుతూ.. "ఇక్కడ పెట్టుబడి పెట్టండి, కావాల్సినంత డబ్బు సంపాదించండి" అని ప్రజలను ఆహ్వానిస్తూ ముగించారు.
Published by:Shiva Kumar Addula
First published: