హోమ్ /వార్తలు /Explained /

Explained: రష్యా ఇంధనంపై నిషేధం విధిస్తే ఏమవుతుంది..? అమెరికా వ్యూహం ఫలిస్తుందా..?

Explained: రష్యా ఇంధనంపై నిషేధం విధిస్తే ఏమవుతుంది..? అమెరికా వ్యూహం ఫలిస్తుందా..?

అమెరికా అధ్యక్షుడు  బైడెన్(

అమెరికా అధ్యక్షుడు బైడెన్(

రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న మొత్తం ఇంధనంపై నిషేధం(Ban on Fuel) విధించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden) ఆలోచిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఉక్రెయిన్‌పై రష్యా(Russia) దండయాత్ర రోజురోజుకు మరింత తీవ్రతరమవుతోంది. ఈ దాడిలో సామాన్య పౌరులు సైతం మృత్యువాత పడుతుండటం వల్ల ఉక్రెయిన్‌లో(Ukraine) భారీగా శరణార్థుల సంక్షోభం(Refugee Crisis) తలెత్తుతోంది. ఇలాంటి తరుణంలో రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న మొత్తం ఇంధనంపై నిషేధం(Ban on Fuel) విధించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden) ఆలోచిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రష్యాకు చెక్ పెట్టాలంటే బహుశా ఇదొక్కటే మార్గమని, ఎలాగైనా మాస్కో వెనుకంజ వేసేలా చర్యలు తీసుకోవాలని విమర్శకులు సైతం భావిస్తున్నారు. అయితే మొత్తం ఇంధనంపై నిషేధం విధించాలంటే ఐరోపా మిత్రపక్షాలైన పశ్చిమ దేశాలపై పెద్ద ప్రభావమే చూపుతుంది. కాబట్టి ఐరోపా దేశాలన్నీ ఈ ప్రతిపాదనను సమర్థిస్తాయో లేదో స్పష్టత లేదు.

Application Invited: వాళ్లు ఏడాదికి రూ.60 వేలు పొందే అవకాశం.. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 15.. వివరాలివే..

ఎందుకంటే అమెరికా మాదిరిగా కాకుండా ఇంధన దిగుమతులపై ఐరోపా ఎక్కువగా రష్యాపైనే ఆధారపడుతుంది. కొద్ది మొత్తంలో అమెరికా ఆ స్థానాన్ని భర్తీ చేసినప్పటికీ ఆ లోటును పూడ్చలేదు. రష్యన్ చమురు ఎగుమతులపై అడ్డంకులు సృష్టిస్తేనే రెండు ఖండాల్లో గ్యాసోలిన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వినియోగదారుల, వ్యాపారాలు, ఆర్థిక మార్కెట్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింతగా కుదిపేస్తాయి.

రష్యా చమురుపై అమెరికా నిషేధం విధిస్తే ఏం జరుగుతుంది?

అమెరికాలో ఇంధన ధరలు 2008 తర్వాత మొదటి సారిగా గ్యాలన్‌కు 4 డాలర్లకు చేరుకుంది. రష్యా చమురు దిగుమతులపై నిషేధించడం సహా మరిన్ని ఆంక్షలు విధించడానికి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి ఈ అంశంపై అమెరికా, ఐరోపా దేశాల నిర్ణయం అస్పష్టంగా ఉంది. రష్యా నుంచి అధికంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్న జర్మనీ.. ఎలాంటి నిషేధం లేదని చెప్పకనే చెప్పింది. ఆంక్షలన్నింటిపై పూర్తిగా ఒకేలా ఉండలేమని జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ స్పష్టం చేశారు.

అమెరికా ఒంటరిగా పనిచేస్తే ఏమవుతుంది?

రష్యాకు చెందిన చమురు, శుద్ధి చేసిన ఉత్పత్తుల దిగుమతులను నిషేధించడంలో అమెరికా ఒంటరిగా వ్యవహరిస్తే.. మాస్కోపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఎందుకంటే రష్యా చమురు ఎగుమతుల్లో కొద్ది వాటాను మాత్రమే అమెరికా కలిగి ఉంది. అంతేకాకుండా మాస్కో నుంచి నేచురల్ గ్యాస్‌ను కూడా కొనుగోలు చేయట్లేదు. రిస్టాడ్ ఎనర్జీ ప్రకారం అమెరికా రష్యా నుంచి రోజుకు లక్ష బ్యారెల్స్ దిగుమతి చేసుకుంటుందని, ఇది రష్యా ఎగుమతుల్లో 5 శాతం మాత్రమేనని పేర్కొంది. గత ఏడాది రష్యా నుంచి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు యూఎస్ దిగుమతుల్లో 8 శాతం మాత్రమే వచ్చాయని స్పష్టం చేసింది.

ముడిచమురును యూఏఈ నుంచి దిగుమతి చేసుకుని ఆ లోటును అమెరికా భర్తీ చేయగలదని, అవసరమైతే ప్రత్యామ్నాయ కొనుగోలుదారులు వైపు కూడా వెళ్లవచ్చని అనుకుంటోంది. ఇలా చేస్తే ఇంధన ధరలు మరింత పెరుగుతాయని రిస్టార్డ్ ఎనర్జీ ఉపాధ్యక్షులు గ్లాడియో గాలింబార్టి అన్నారు.

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్​లో వాటికి దరఖాస్తుల ఆహ్వానం.. ఎంపికైతే ప్రతినెలా రూ. 60 వేల స్టైఫండ్

రష్యా చమురుపై నిషేధం విధిస్తే ధరలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

నెల క్రితం బ్యారెల్‌కు ఇంధనాన్ని సుమారు 90 డాలర్లకు విక్రయించేవారు. ఇప్పుడు కొనుగోలు దారులు రష్యన్ ముడిచమురును విస్మరించడంతో ఈ ధర 120 డాలర్లు దాటింది. భవిష్యత్తులోనూ మాస్కోపై మరిన్ని ఆంక్షలు ఉంటాయని సంకేతాలు వస్తుండటంతో రిఫైనర్లు భయపడుతున్నారు. చమురును మళ్లి విక్రయించలేమని ఆందోళన చెందుతున్నారు. పాశ్చాత్య దేశాలు చమురు ఆంక్షలు విధించినా, రష్యా ఇంధనానికి దూరంగా ఉన్నా ముడి చమురు బ్యారెల్ ధర రూ.160 డాలర్ల నుంచి 200 డాలర్ల వరకు పెరగవచ్చని ఇంధన విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చమురు ధరలు ఎక్కువగా ఉండటం వల్ల అమెరికాలో గ్యాలన్ ఇంధన ధర 5 డాలర్లు దాటవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి బైడెన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

రష్యన్ దిగుమతులు ఇప్పటికే దిగజారుతున్నాయా?

విదేశీ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని అమెరికా చమురు పరిశ్రమ చెబుతోంది. ఇందుకోసం బైడెన్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. ఆంక్షలు లేనప్పుడే కొంతమంది అమెరికా రిఫైనర్లు రష్యన్ కంపెనీలతో ఒప్పందాలను తెంచుకున్నారు. దీంతో రష్యా ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు పడిపోయాయి. యూఎస్ఏ ఇంధన విభాగం నుంచి ప్రాథమిక సమాచారం ప్రకారం ఫిబ్రవరి చివరిలో రష్యా క్రూడ్ ఆయిల్ దిగుమతులు సున్నాకి పడిపోయాయి.

ఐరోపా కూడా అమెరికా మార్గంలో వెళ్తుందా?

రష్యా ఇంధన ఎగుమతులపై నిషేధం విధిస్తే ఐరోపాపై అది పెను సంక్షోభాన్నే చూపుతుంది. ఐరోపాలో గృహాల్లో వాడే నేచురల్ గ్యాస్‍‌ 40 శాతం రష్యా నుంచి వస్తుంది. అంతేకాకుండా విద్యుత్, పరిశ్రమల అవసరాలకు ఐరోపా చమురులో 1/4వ వంతు వాటా మాస్కో నుంచే దిగుమతి అవుతుంది. ఈ విధంగా రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఐరోపా అధికారులు మార్గాలను వెతుకుతున్నారు. అయితే ఇందుకు చాలా సమయం పడుతుంది.

Success Story: పేపర్ బాయ్‌గా పనిచేస్తూ.. ఎలాంటి కోచింగ్ లేకుండా ఐఏఎస్ సాధించాడు.. అతడి సక్సెస్ స్టోరీ ఇదే..

జర్మనీ నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్‌ను నిలిపివేసినందుకు ప్రతీకారంగా నార్డ్ స్ట్రీమ్ 1 పైప్‌లైన్ ద్వారా ఐరోపాకు సహజ వాయువు రవాణాను నిలిపివేయడానికి రష్యాకు "ప్రతి హక్కు" ఉందని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ నొక్కి చెప్పారు. నేచురల్ గ్యాస్‌తో పోలిస్తే చమురును భర్తీ చేయడం చాలా సులభం. ఇతర దేశాల చమురు ఉత్పత్తిని పెంచి ఐరోపా రవాణా చేయవచ్చు. కానీ ఇందుకు చాలా చమురు కావాల్సి ఉంటుంది. ఫలితంగా ఇంధన ధరలను పెంచుతుంది. ఇదే సమయంలో ఐరోపాకు రష్యా అందించే నేచురల్ గ్యాస్‌ను భర్తీ చేయడం స్వల్ప కాలంలో అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ భాగం పైప్ లైన్ల ద్వారానే సహజ వాయువు రష్యా నుంచి ఐరోపా దేశాలకు వెళ్తుంది. కాబట్టి దాన్ని భర్తీ చేయడానికి యూరప్ ఎక్కువగా ఎల్ఎన్‌జీ అని పిలిచే నేచురల్ గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది. కానీ తీర ప్రాంతాల నుంచి ఖండంలోని సుదూర ప్రాంతాలకు గ్యాస్ పంపిణీ చేయడానికి తగినంత పైప్ లైన్ మార్గాలు లేవు.

అమెరికా చమురు, గ్యాస్ ఉత్పత్తిదారులు మరింత సహజ వాయువు కోసం అన్వేషిస్తున్నారు. ఆ దేశం నుంచి ఎగుమతి సౌకర్యాలు ఇప్పటికే అధిక సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఆ సౌకర్యాలను విస్తరించడానికి సంవత్సరాలు పట్టడమే కాకుండా బిలియన్ల డాలర్ల ఖర్చు అవుతుంది.

First published:

Tags: America, Russia, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు