హోమ్ /వార్తలు /Explained /

Explained: శ్రీలంకలో కొనసాగుతున్న ప్రజల నిరసనలు.. లంక ఆర్థికంగా పతనం కావడానికి కారణాలు ఏంటి?

Explained: శ్రీలంకలో కొనసాగుతున్న ప్రజల నిరసనలు.. లంక ఆర్థికంగా పతనం కావడానికి కారణాలు ఏంటి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దక్షిణాసియా దేశమైన శ్రీలంక(Sri Lanka) తీవ్రమైన ఆర్థిక పతనాన్ని (Economic Collapse) ఎదుర్కొంటోంది. ఇది ప్రభుత్వాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసింది. 22 మిలియన్ల ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు అవసరమైన వస్తువులను సైతం దిగుమతి చేసుకొనేందుకు శ్రీలంక కష్టపడుతోంది.

ఇంకా చదవండి ...

దక్షిణాసియా దేశమైన శ్రీలంక(Sri Lanka) తీవ్రమైన ఆర్థిక పతనాన్ని (Economic Collapse) ఎదుర్కొంటోంది. ఇది ప్రభుత్వాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసింది. 22 మిలియన్ల ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు అవసరమైన వస్తువులను సైతం దిగుమతి చేసుకొనేందుకు శ్రీలంక కష్టపడుతోంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం, రుణభారం పెరిగిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇటీవల కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలోనే శ్రీలంక ప్రధానమంత్రి రాజీనామా చేశారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నడిపించినందుకు అధ్యక్షుడు(President) గోటబయ రాజపక్స, అతని సోదరుడు, మాజీ ప్రధాని మహీంద రాజపక్సపై చాలా మంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Viral Letter : ఓ విద్యార్థి టీచర్ కు సమర్పించిన అపాలజీ లెటర్ చూస్తే ఎవరికైనా కళ్లల్లో నీళ్లు రావాల్సిందే

* నిరసనలకు దారితీసిన కారణాలు?

విదేశీ మారకద్రవ్య సంక్షోభం కారణంగా దిగుమతి చేసుకున్న ఆహారం, మందులు , ఇంధనం కొరత ఏర్పడింది. నెలరోజుల పాటు శ్రీలంక వాసులు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి వరుసలలో వేచి ఉండాల్సి వచ్చింది. ఇంధనాల కొరత విద్యుత్ కోతలకు దారితీసింది. కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ వివాదం పరిస్థితిని మరింత దిగజార్చాయి. అయితే ఆర్థిక విపత్తు గురించి హెచ్చరికలు చాలా కాలం ముందు ప్రారంభమయ్యాయి.

2019లో చర్చిలు, హోటళ్లలో ఈస్టర్ ఆత్మాహుతి బాంబు దాడులు 290 మందిని బలిగొన్న కొన్ని నెలల తర్వాత అధ్యక్షుడు రాజపక్స అధికారంలోకి వచ్చారు. ఈ దాడులు విదేశీ మారకద్రవ్యానికి కీలక వనరు అయిన పర్యాటకాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. శ్రీలంకను లోతైన ఆర్థిక మాంద్యం నుండి బయటపడేసి దానిని సురక్షితంగా ఉంచుతామని రాజపక్స హామీ ఇచ్చారు. ప్రభుత్వం తన ఆదాయాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం విదేశీ రుణాలు పెరిగాయి. కొన్ని చైనా రుణాల ద్వారా నిధులు పొందాయి, అయితే రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న కొద్ది రోజులకే, శ్రీలంక చరిత్రలో అతిపెద్ద పన్ను తగ్గింపులను ప్రవేశపెట్టారు.

ఈ చర్య ప్రపంచ మార్కెట్ ప్రభావాన్ని వెంటనే ఎదుర్కొంది. రుణదాతలు శ్రీలంక రేటింగ్‌లను తగ్గించారు. దాని విదేశీ నిల్వలు తగ్గిపోవడంతో ఎక్కువ డబ్బు తీసుకోకుండా నిరోధించారు. కరోనా మహమ్మారి తీవ్రతతో పర్యాటకం కుదేలైంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆహారం, చమురు ధరలను పెంచింది. దిగుమతులను మరింత భరించలేనిదిగా చేసింది. దేశ విదేశీ నిల్వలు 50 మిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయి. 51 బిలియన్‌ డాలర్లలో 2026 నాటికి దాదాపు 25 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉండగా, ఈ సంవత్సరం 7 బిలియన్‌ డాలర్లు విదేశీ రుణం చెల్లింపులు జరపాల్సి ఉంది.

* రాజపక్స సోదరులు ఎవరు?

రాజపక్స సోదరులను తొలగించాలని దేశవ్యాప్త నిరసనలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీలంక అత్యంత శక్తివంతమైన రాజకీయ రాజవంశానికి నాటకీయ పరిణామాలు ఎదురయ్యాయి. 2009లో తమిళ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా 30 ఏళ్ల అంతర్యుద్ధాన్ని ముగించినందుకు ద్వీపంలోని బౌద్ధ-సింహళీయుల మెజారిటీతో మహిందా, గోటబయ రాజపక్సను హీరోలుగా కీర్తించారు. యుద్ధ దురాగతాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నప్పటికీ, వారు గొప్ప ప్రజాదరణ పొందారు. ఆ సమయంలో అధ్యక్షుడిగా ఉన్న మహిందా పరిస్థితులను పర్యవేక్షించారు.

వీరిది శక్తివంతమైన భూస్వామ్య కుటుంబం. 2005లో మహీంద అధ్యక్షుడిగా ఎన్నికవడానికి ముందు స్థానిక ఎన్నికలలో సంవత్సరాలపాటు రాజపక్సలు ఆధిపత్యం చెలాయించారు. మహీంద 2015 వరకు అధికారంలో ఉన్నారు. మాజీ సహాయకుడి నేతృత్వంలోని ప్రతిపక్షం చేతిలో ఓడిపోయాడు.

2019 ఈస్టర్ బాంబు దాడుల తరువాత, హై-పిచ్ జాతీయవాద ప్రచారంలో అధ్యక్ష పదవికి పోటీ చేసిన గోటబయ ఆధ్వర్యంలో కుటుంబం తిరిగి అధికారంలోకి వచ్చింది.

CM KCR పుట్టుకతోనే భూస్వామి.. నిజాం నుంచి భారీ పరిహారం: KTR -అక్కడుండగాకేసీఆర్ ఫోన్‌కాల్..

రాజపక్సలు పాలసీని అమలు చేయడానికి సైన్యంపై ఎక్కువగా ఆధారపడుతున్నారని, స్వతంత్ర సంస్థలను బలహీనపరిచేందుకు చట్టాలను ఆమోదించారని, నిర్ణయం తీసుకోవడంలో దాదాపు గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్నారని విమర్శకులు ఆరోపించారు. మరో ముగ్గురు రాజపక్స కుటుంబ సభ్యులు ఏప్రిల్ ప్రారంభం వరకు క్యాబినెట్‌లో ఉన్నారు. నిరసనల కారణంగా పూర్తి క్యాబినెట్ రాజీనామా చేసింది. సోమవారం మహింద రాజీనామా ప్రదర్శనకారులకు పాక్షిక విజయం. ముఖ్యంగా అధ్యక్షుడి కార్యాలయం వెలుపల నిరసనలు కొనసాగుతుండటంతో, అధ్యక్షుడిపై కూడా నిష్క్రమించాలని ఒత్తిడి పెరిగింది.

* తర్వాత ఏం జరగనుంది?

ప్రెసిడెంట్ రాజపక్స.. ప్రధాన మంత్రి, మంత్రివర్గం లేకుండా ఉన్నారు. అతను ఇప్పుడు తదుపరి ప్రధానమంత్రి కావడానికి, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి పార్లమెంటు సభ్యుడిని ఎంపిక చేసుకోవచ్చు. ఆయన ఎంపికకు 225 మంది సభ్యులున్న శాసనసభలో మెజారిటీ మద్దతు అవసరం. తన అభ్యర్థిని ఆమోదించడానికి పార్లమెంటులో అతనికి ఇంకా తగినంత మద్దతు ఉందా అనేది అస్పష్టంగా ఉంది. అధ్యక్షుడు ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ ప్రతిపక్ష సభ్యులను చేరడానికి ఒప్పించడం కష్టం.

ప్రధానమంత్రి లేనప్పుడు రాష్ట్రపతి రాజీనామా చేస్తే, పార్లమెంటు స్పీకర్ ఒక నెలపాటు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉంటారు. ఆ సమయంలో ఎన్నికలు జరిగే వరకు అధ్యక్షుడిగా సభ్యుడిని ఎన్నుకోవాలి. రాజపక్సను అభిశంసించే తీర్మానం అంత సులభం కాదు. దీనికి పార్లమెంట్ స్పీకర్, సుప్రీంకోర్టు ఆమోదం, కనీసం 150 మంది శాసన సభ్యుల మద్దతు అవసరం. ప్రతిపక్షాలకు పార్లమెంట్ లో మెజారిటీ లేదు. దీంతో ఈ ప్రక్రియ మరింత కష్టతరం కానుంది.

శ్రీలంకలో ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సిస్టమ్ పాలించిన 45 సంవత్సరాలలో, అధ్యక్షుడిని తొలగించడానికి ఒక విఫల ప్రయత్నం జరిగింది. రాజ్యాంగం అధ్యక్షుడికి సాయుధ దళాల కమాండర్-ఇన్-చీఫ్, క్యాబినెట్ అధిపతి, ప్రధాన న్యాయమూర్తి, పోలీసు చీఫ్, ఇతరులను నియమించే అధికారాలను అందిస్తుంది. అధ్యక్షుడికి విస్తృతమైన అధికారాలు ఉన్నప్పటికీ, కార్యనిర్వాహక విధులను నిర్వహించడానికి ఇప్పటికీ ప్రధాన మంత్రి, క్యాబినెట్ అవసరం. అధ్యక్షుడి తదుపరి కదలికలపై కొనసాగుతున్న అనిశ్ఛితి, పరిపాలన శూన్యత సైనిక స్వాధీనానికి సంబంధించిన భయాలను పెంచాయి.

First published:

Tags: Explained, Financial crisis, Srilanka

ఉత్తమ కథలు