హోమ్ /వార్తలు /Explained /

Explained: యూట్యూబ్ షార్ట్స్‌ అంటే ఏంటి.. వీటిని ఎలా క్రియేట్ చేయాలి?

Explained: యూట్యూబ్ షార్ట్స్‌ అంటే ఏంటి.. వీటిని ఎలా క్రియేట్ చేయాలి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలామంది యూట్యూబ్ (YouTube) క్రియేటర్లకు షార్ట్స్‌ (Shorts) ప్లాట్‌ఫామ్ ఒక వరంగా మారిందని చెప్పవచ్చు. షార్ట్స్ ప్లాట్‌ఫామ్‌లో వీడియోలు క్రియేట్ చేయడం ద్వారా క్రియేటర్లు మరింత మందికి చేరువవుతున్నారు.

చాలామంది యూట్యూబ్ (YouTube) క్రియేటర్లకు షార్ట్స్‌ (Shorts) ప్లాట్‌ఫామ్ ఒక వరంగా మారిందని చెప్పవచ్చు. షార్ట్స్ ప్లాట్‌ఫామ్‌లో వీడియోలు క్రియేట్ చేయడం ద్వారా క్రియేటర్లు మరింత మందికి చేరువవుతున్నారు. దీనివల్ల వారి వీడియోలకు వ్యూయర్‌షిప్‌ (Viewership)తో పాటు ఎంగేజ్‌మెంట్ (Engagement) పెరుగుతోంది. షార్ట్స్‌ ద్వారా మనీ (Money) సంపాదించడం కూడా సాధ్యమవుతుంది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు పోటీగా సెప్టెంబర్ 2020లో షార్ట్స్‌ను యూట్యూబ్ పరిచయం చేసింది. ఈ షార్ట్-ఫామ్ (Short-form) వీడియో ఫార్మాట్ 15 సెకన్లు లేదా అంతకంటే తక్కువ నిడివి ఉన్న వీడియోలను క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది.

యూట్యూబ్ షార్ట్స్‌ ప్రత్యేకతలు

యూట్యూబ్ షార్ట్స్‌ను నేరుగా యూట్యూబ్ యాప్‌లోనే గూగుల్ అందించింది. ఈ షార్ట్స్‌తో స్మార్ట్‌ఫోన్ నుంచి నేరుగా వీడియోలను క్రియేట్ చేసి, అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌ని మరింత ఈజీగా మార్చేందుకు యూట్యూబ్ కృషి చేస్తోంది. యూట్యూబ్ యూజర్లందరికీ ఈ షార్ట్ వీడియోలు కనిపిస్తాయి. యూట్యూబ్ 15 లేదా 60 సెకన్ల వరకు వీడియో క్లిప్‌లను యాడ్ చేయడానికి మల్టీ-సెగ్‌మెంట్‌ కెమెరా వంటి ఫౌండేషన్ క్రియేటర్ టూల్స్ కూడా ఆఫర్ చేస్తోంది. సాంగ్స్ లైబ్రరీ నుంచి మ్యూజిక్‌ రికార్డ్, స్పీడ్ సెట్టింగ్స్‌ కంట్రోల్స్‌ వంటి మరెన్నో ఫీచర్లను కూడా ఇది ఆఫర్ చేస్తోంది.

షార్ట్స్‌ ప్లాట్‌ఫామ్ వీడియోలకు టెక్స్ట్, టైటిల్స్ యాడ్ చేసే ఆప్షన్స్ కూడా కల్పిస్తోంది. షార్ట్స్ ద్వారా 60 సెకన్ల వరకు వీడియో రికార్డ్ చేయవచ్చు లేదా ఇతర షార్ట్‌ల నుంచి శాంపిల్ ఆడియోను తీసుకుని ఓన్‌గా రీమిక్స్ క్రియేట్ చేయవచ్చు. యూట్యూబ్ లోని అన్ని వీడియోల నుంచి ఆడియోను రీమిక్స్ చేయొచ్చు. షార్ట్స్‌ను మరింత మెరుగైన ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దే ప్లాన్స్‌ను యూట్యూబ్ చేస్తోంది. మీరు షార్ట్స్‌లో పాట స్నిప్పెట్‌ని విన్నట్లయితే, యూట్యూబ్ లో పూర్తి పాటను సులభంగా కనుగొనవచ్చు, మ్యూజిక్ వీడియోను చూడవచ్చు లేదా ఆర్టిస్ట్ గురించి మరింత తెలుసుకోవచ్చు. షార్ట్ వీడియోల వ్యూ పేజీలోనే క్రియేట్ బటన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఆ ఆడియోతో వారి స్వంత షార్ట్‌లను తయారు చేసుకోవచ్చు.

యూట్యూబ్ షార్ట్స్‌ను ఎలా క్రియేట్ చేయాలి

యూట్యూబ్ షార్ట్-ఫామ్‌లోని వీడియో క్రియేషన్ టూల్స్‌తో మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్లిప్‌లను రికార్డ్ చేయవచ్చు. ఈ వీడియోల నిడివి 60 సెకన్ల వరకు ఉండొచ్చు. షార్ట్స్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నప్పుడు. రికార్డ్ చేసిన సెగ్‌మెంట్‌లను, ప్రతి సెగ్‌మెంట్‌ సమయాన్ని చూడటానికి మీ స్క్రీన్ పైభాగంలో ఉన్న ప్రోగ్రెస్ బార్‌పై ఒక లుక్కేస్తే సరిపోతుంది. షార్ట్‌ను 15 సెకన్లకు బదులుగా 60 సెకన్ల (60) వరకు రికార్డ్ చేయడానికి 15 అని కనిపించే బటన్‌పై క్లిక్ చేయాలి.

అయితే యూట్యూబ్ లైబ్రరీ నుంచి మ్యూజిక్ లేదా ఇతర వీడియోల నుంచి అసలైన ఆడియోతో చేసే రికార్డింగ్స్‌ 15 సెకన్లకు మాత్రమే పరిమితమవుతాయని గమనించాలి. రికార్డ్ చేసిన తర్వాత, మీ వీడియోకు వివరాలను యాడ్ చేయడానికి నెక్స్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఈ స్క్రీన్‌లో టైటిల్ (గరిష్టంగా 100 అక్షరాలు) యాడ్ చేసి వీడియో ప్రైవసీ వంటి సెట్టింగ్స్‌ సెలెక్ట్ చేసుకోండి. మీ వీడియో చూసే ప్రేక్షకులను కూడా ఎంచుకోవచ్చు. కిడ్స్ కోసం క్రియేట్ చేశారా లేదా అనే ఆప్షన్ సెలెక్ట్ చేయవచ్చు. ఆపై, మీ షార్ట్‌ను పబ్లిక్ చేయడానికి అప్‌లోడ్‌పై నొక్కితే సరిపోతుంది.

షార్ట్స్‌ క్రియేట్ చేయడానికి తప్పక ఫాలో అవ్వాల్సిన టిప్స్

- యాడ్ మ్యూజిక్/ఆధర్ ఆడియో

యూట్యూబ్ లైబ్రరీలో కనిపించే మ్యూజిక్, సౌండ్స్‌ను వ్యక్తిగత, వాణిజ్యేతర ఉపయోగం కోసం ఉచితంగా వాడుకోవచ్చు. తగిన లైసెన్స్‌లు ఉంటే వీటిని మీరు కమర్షియల్‌గా ఉపయోగించవచ్చు

- రికార్డింగ్ స్పీడ్‌ను అడ్జస్ట్ చేయడం

రికార్డింగ్‌ని స్పీడ్‌గా చేయడానికి లేదా స్పీడ్‌ను స్పీడ్ కంట్రోల్ ఆప్షన్ ఉపయోగపడుతోంది

- టైమర్‌తో రికార్డ్ చేయడం

హ్యాండ్స్-ఫ్రీగా రికార్డ్ చేయడానికి కౌంట్‌డౌన్‌ను సెట్ చేసుకోవచ్చు. రికార్డింగ్‌ని ఆటోమేటిక్‌గా ఎప్పుడు స్టాప్ చేయాలో మీరు టైమర్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

- ఫిల్టర్లను అప్లై చేయడం

ఫిల్టర్ల ఆప్షన్ నుంచి మీకు నచ్చిన ఫిల్టర్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు రికార్డ్ చేస్తున్నప్పుడు ప్రతి సెగ్‌మెంట్‌కు వేర్వేరు ఫిల్టర్లను జోడించవచ్చు. లేదా మీరు రికార్డ్ చేసిన తర్వాత వాటిని ఎడిటింగ్ స్క్రీన్‌లో అప్లై చేసుకోవచ్చు

- ఫ్రేమ్‌లను అలైన్ చేయడం

మీరు క్యాప్చర్ చేసిన చివరి ఫ్రేమ్‌ను ట్రాన్స్‌పరెంట్ ఓవర్లే ఉపయోగించి మీ నెక్స్ట్ క్లిప్‌ను వరుసలో ఉంచొచ్చు.

- యాడ్ టెక్స్ట్

మీ వీడియోపై వివిధ మెసేజెస్ ఉంచడానికి టెక్స్ట్ ఆప్షన్ యూజ్‌ అవుతుంది. స్క్రీన్‌పై టెక్స్ట్ కలర్, స్టైల్, అలైన్‌మెంట్ కూడా మార్చుకోవచ్చు.

అడ్జస్ట్ టైమ్‌లైన్‌

మీ షార్ట్‌లోని టెక్స్ట్‌కు టైమ్‌లైన్‌ని కూడా సెట్ చేసుకోవచ్చు. మీ షార్ట్‌లో టెక్స్ట్ ఎప్పుడు కనిపించాలో.. ఎప్పుడు కనిపించకుండా పోవాలో మీరు కంట్రోల్ చేయడానికి టెక్స్ట్ క్లిప్, స్టార్ట్.. స్టాప్ పాయింట్‌లను డ్రాగ్ చేస్తే సరిపోతుంది. మీ వీడియోలో వేర్వేరు సమయాల్లో వేర్వేరు మెసేజెస్ డిస్‌ప్లే చేయడానికి ఈ ఫీచర్‌ని ఉపయోగించొచ్చు. టెక్స్ట్ క్లిప్‌లను మళ్లీ ఆర్డర్‌లో పెట్టేందుకు, వాటిని హోల్డ్ చేసి పట్టుకోవాలి. తర్వాత షార్ట్ వీడియోలో మీకు నచ్చిన ప్లేస్‌లో వీటిని ఉంచవచ్చు.

- గ్రీన్ స్క్రీన్

షార్ట్స్‌ రీమిక్స్ చేయడానికి గ్రీన్ స్క్రీన్ బాగా ఉపయోగపడుతాయి. క్రియేటర్లు ఏదైనా వీడియో లేదా షార్ట్‌ను 60 సెకనుల వీడియో సెగ్‌మెంట్‌కు లేదా ఒరిజినల్ షార్ట్ వీడియోకి బ్యాక్‌గ్రౌండ్‌గా ఉపయోగించడానికి యూజ్ అవుతుంది.

First published:

Tags: Explained, Reel video, Video, Youtube

ఉత్తమ కథలు