Home /News /explained /

EXPLAINED WHAT ARE SUPPORT AND RESISTANCE LEVELS IN CRYPTO KNOW FULL DETAILS HERE GH VB

Explained: క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్స్‌లో సపోర్ట్‌, రెసిస్టెన్స్‌ లెవల్స్‌ అంటే ఏంటి..? అవి ఎలా ఉపయోగపడతాయి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గత కొంత కాలంగా క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్లు భారీగా పెరుగుతున్నాయి. క్రిప్టో ట్రేడర్స్‌ సపోర్ట్(Support), రెసిస్టెన్స్(Resistance) అనే పదాలను తరచుగా ఉపయోగిస్తుంటారు. అవి ప్రైస్‌ ట్రెండ్ గురించి తెలుసుకొనేందుకు ట్రేడర్స్‌కు ఉపయోగపడతాయి.

ఇంకా చదవండి ...
గత కొంత కాలంగా క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్లు(Investments) భారీగా పెరుగుతున్నాయి. క్రిప్టో ట్రేడర్స్‌ సపోర్ట్(Support), రెసిస్టెన్స్(Resistance) అనే పదాలను తరచుగా ఉపయోగిస్తుంటారు. అవి ప్రైస్‌ ట్రెండ్ గురించి తెలుసుకొనేందుకు ట్రేడర్స్‌కు ఉపయోగపడతాయి. ఈ (Trend)ప్రైమరీ ఇండెక్స్‌లు(Indexes) భవిష్యత్తులో ఎంతవరకు సంబంధిత అసెట్‌ ప్రైస్‌ చేరవచ్చనే అంచనా వేసేందుకు వీలు కల్పిస్తాయి. సాధారణంగా అనుభవం లేని పెట్టుబడిదారులకు సపోర్ట్‌(Support), రెసిస్టెన్స్‌పై అవగాహన ఉండదు. కొందరు ఈ రెండింటి గురించి కన్‌ఫ్యూజ్‌ అవుతారు. సపోర్ట్, రెసిస్టెన్స్ లెవెల్స్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం, మెరుగైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోవడంలో పెట్టుబడిదారులకు ఇవి ఎలా ఉపయోగపడతాయనే వివరాలు తెలుసుకోండి.

సపోర్ట్, రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే ఏంటి?ప్రైస్ చార్ట్‌ని చూస్తే.. ఓ పాయింట్‌ను దాటి వెళ్లడానికి టోకెన్‌ కష్టపడుతుండటం గమనించవచ్చు.  ఆ పాయింట్‌ను రెసిస్టెన్స్‌ లెవల్‌ అంటారు. ప్రైస్‌ చార్ట్‌లో ఆ పాయింట్‌ను దాటి టోకెన్‌ పైకి వెళ్లడం కష్టమని చెప్పవచ్చు. అదే విధంగా అంతకంటే కిందకు టోకెన్‌ పడిపోదని ఓ పాయింట్‌ సూచిస్తుంది, దాన్ని సపోర్ట్‌ అంటారు. మార్కెట్‌పై తీవ్రమైన ప్రతికూల ప్రభావం కనిపిస్తే తప్ప ప్రైస్‌ చార్ట్‌లో టోకెన్‌ సపోర్ట్‌ లెవల్‌ను దాటి కిందకు రాదు. ఉదాహరణకు సపోర్ట్‌, రెసిస్టెన్స్‌ను ఇంట్లో సీలింగ్‌, ఫ్లోర్‌తో పోల్చవచ్చు. సీలింగ్‌ను దాటి పైకి వెళ్లలేం కాబట్టి రెసిస్టెన్స్‌గా చెప్పవచ్చు. ఫ్లోర్‌ను దాటి కిందకు వెళ్లలేం కాబట్టి దాన్ని సపోర్ట్‌గా చెప్పుకోవచ్చు.

Explained: ఆర్టికల్ 142 ప్రత్యేక అధికారంతో పేరరివాలన్‌ విడుదల.. ఈ ఆర్టికల్ ప్రాధాన్యం ఏంటి..?


సపోర్ట్‌, రెసిస్టెన్స్‌ లెవల్స్‌ను ప్రైస్‌ చేరుకొన్నప్పుడు ఏం జరుగుతుంది?టోకెన్ ప్రైస్‌ పైకి మూవ్‌ అవుతున్నప్పుడు రెసిస్టెన్స్‌ లెవల్‌ వద్ద అడ్డంకిని ఎదుర్కొంటుంది. ఆ పాయింట్‌ వద్ద ఇన్వెస్టర్‌లు క్యాష్ అవుట్ చేసి ప్రాఫిట్స్‌ బుక్‌ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అందుకే రెసిస్టెన్స్‌ లెవల్‌ను దాటడానికి టోకెన్‌కు కష్టతరమవుతుంది. ఆ సమయంలో సెల్‌ ఆర్డర్స్‌ ఎక్కువ అవుతాయి.  దీని కారణంగా టోకెన్‌ల సప్లై పెరుగుతుంది. డిమాండ్‌కు మించి టోకెన్‌ల సప్లై ఉంటే.. ప్రైస్‌ రివర్స్‌ అవుతుంది. టోకెన్‌ ప్రైస్‌ రెసిస్టెన్స్‌ లెవల్‌ నుంచి కిందకు మూవ్‌ అవడం మొదలవుతుంది. అయితే ఇన్వెస్టర్‌లు తమ టోకెన్‌లను హోల్డ్‌ చేయాలని భావిస్తే.. ప్రైస్‌ అప్‌ట్రెండ్‌లో కొనసాగుతుంది.

ఇన్వెస్టర్‌లు టోకెన్‌లు హోల్డ్‌ చేయకపోతే టోకెన్ ప్రైస్‌ తగ్గడం ప్రారంభమవుతుంది. అది చివరికి సపోర్ట్‌ లెవల్‌ వద్దకు చేరుకొంటుంది. ఈ సమయంలో ఇన్వెస్టర్‌లు ఎక్కువగా టోకెన్‌లను కొనడానికి ప్రయత్నిస్తారు. చాలా తక్కువ ప్రైస్‌కు టోకెన్‌లు అందుబాటులో ఉండటంతో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపుతారు. మార్కెట్‌లో బయింగ్‌ ఆర్డర్‌లు సపోర్ట్‌ లెవల్‌ వద్ద ఒక్కసారిగా పెరుగుతాయి. ఇలా డిమాండ్‌ పెరగడంతో టోకెన్‌ ప్రైస్‌ పైకి మూవ్‌ అవుతుంది.

అయితే బయింగ్‌ ఆర్డర్‌లు రాకుండా.. భయం, అనిశ్చితి, సందేహాలతో సపోర్ట్‌ లెవల్‌ వద్ద కూడా ఇన్వెస్టర్‌లు టోకెన్‌లను అమ్మడానికే మొగ్గు చూపితే.. సపోర్ట్‌ లెవల్‌ను కూడా దాటి టోకెన్‌ ప్రైస్‌ పడిపోతుంది. సపోర్ట్‌ కానీ, రెసిస్టెన్స్‌ లెవల్‌ కానీ టోకెన్‌ ప్రైస్‌ దాటిన తర్వాత అదే దిశలో కొనసాగే అవకాశం ఉంది. సపోర్ట్‌ లెవల్‌ను దాటి టోకెన్‌ ప్రైస్‌ కిందకు వెళ్తే.. అలానే కొనసాగి లోయొస్ట్‌ లెవల్‌ను చేరుకొంటుంది. అదే విధంగా రెసిస్టెన్స్‌ లెవల్‌ను టోకెన్‌ ప్రైస్‌ దాటితో అదే దిశలో కొనసాగుతుంది. హైయస్ట్‌ టోకెన్‌ ప్రైస్‌ను చేరుకొంటుంది.

Explained: న్యూక్లియర్ రియాక్టర్లపై కొత్త పాడ్‌కాస్ట్‌ ఎపిసోడ్.. అందుబాటులో అణుశక్తిపై పూర్తి సమాచారం!


రెసిస్టెన్స్‌, సపోర్ట్‌ లెవల్స్‌ను ఎలా గుర్తిస్తారు?సపోర్ట్‌, రెసిస్టెన్స్‌ లెవల్స్‌ను గుర్తించడం సులువు. టోకెన్‌ ప్రైస్‌ చార్ట్‌ను ఓపన్‌ చేసి ఆ పీరియడ్‌లో టోకెన్‌ చేరిన హైయస్ట్‌, లోయస్ట్‌ లెవల్‌ను గుర్తించాలి. టోకెన్‌ అప్‌ట్రెండ్‌లో కొనసాగి ఓ పాయింట్‌ వద్ద ఆగితే దాన్ని రెసిస్టెన్స్‌గా గుర్తించవచ్చు. అదే విధంగా టోకెన్‌ ప్రైస్‌ మార్కెట్‌ కరెక్షన్‌ సమయంలో పడిపోతూ లోయస్ట్‌ పాయింట్‌కు చేరుకొంటే దాన్ని సపోర్ట్‌ లెవల్‌గా ఎంచుకోవచ్చు. టోకెన్‌ ప్రైస్‌ ఎక్కువసార్లు ఒక పాయింట్‌ను రీచ్‌ అయి తిరిగి పడిపోతుంటే దాన్ని స్ట్రాంగ్‌ రెసిస్టెన్స్‌గా చెప్పవచ్చు. మూవింగ్ యావరేజ్ ఇండికేటర్, ట్రెండ్‌లైన్ ఇండికేటర్ ద్వారా కూడా సపోర్ట్‌, రెసిస్టెన్స్‌ లెవల్స్‌ను గుర్తించవచ్చు.

ట్రేడ్‌లో సపోర్ట్‌, రెసిస్టెన్స్‌ లెవల్స్‌ను ఉపయోగించడం ద్వారా ప్రయోజనాలు, నష్టాలు ఇవే..
ప్రయోజనాలు: మార్కెట్‌ మూవ్‌మెంట్‌, ట్రెండ్‌ను సులువుగా అంచనా వేయవచ్చు. ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్‌లను ఎంచుకొనేందుకు ఉపయోగపడతాయి.
నష్టాలు: క్రిప్టో మార్కెట్ చాలా అస్థిరంగా ఉండటంతో తప్పుడు సూచనలు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్‌ తీవ్రమైక ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నప్పుడు ఇండికేటర్స్‌ను గుర్తించడం కష్టం.
Published by:Veera Babu
First published:

Tags: Crypto, Explained, Stock Market

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు