EXPLAINED WHAT ARE PRIVATE CRYPTOCURRENCIES HOW THEY ARE DIFFERENT FROM PUBLIC ONES GH VB
Explained: ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలు అంటే ఏంటి..? పబ్లిక్ క్రిప్టోల కంటే ఇవి ఎలా భిన్నంగా ఉంటాయి..?
ప్రతీకాత్మక చిత్రం
బిట్‌కాయిన్, ఈథర్, డాగ్‌కాయిన్, షిబా ఇను వంటి అత్యంత ప్రసిద్ది చెందిన క్రిప్టోకరెన్సీలు పబ్లిక్‌గా ఉంటాయి. ఎందుకంటే వాటి లావాదేవీలు పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి.
భారత్(Bharath)లో గత ఏడాదిన్నరగా క్రిప్టోకరెన్సీ ఇన్వెస్ట్మెంట్లు (Crypto Currency Investments) భారీగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారుల నిధులకు రక్షణ కల్పించేందుకు భారత్(Bharath) సిద్ధమైంది. దీనికి సంబంధించి ‘క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు- 2021’ బిల్లును ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశ పెట్టనుంది. భారతదేశంలోని అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను(Private Crypto Currency) నిషేధించాలని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా జారీ అయ్యే అధికారిక డిజిటల్ కరెన్సీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.
నవంబర్ 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు లోక్‌సభ(Loksabha) ముందుకు రానుంది. అయితే క్రిప్టోకరెన్సీ అంతర్లీన సాంకేతికతను, ఉపయోగాలను ప్రోత్సహించడానికి బిల్లులో కొన్ని మినహాయింపులు ఉంటాయని.. దీంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే అధికారిక డిజిటల్ కరెన్సీని రూపొందించడానికి సులభతరమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే మార్గదర్శకాలు ఉంటాయని లోక్‌సభ బులెటిన్‌లో పేర్కొంది.
అయితే ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల గురించి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. బిల్లులో పేర్కొన్న ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ నిర్వచనాన్ని సైతం ప్రభుత్వం వెల్లడించలేదు. ప్రస్తుతం ప్రజాదరణ పొందిన బిట్‌కాయిన్ (Bitcoin), ఈథర్ (Ether), పబ్లిక్ బ్లాక్‌చెయిన్ నెట్వర్క్ ఆధారంగా పనిచేసే అనేక ఇతర క్రిప్టో టోకెన్లు ఉపయోగంలో కొనసాగుతాయి. ఇదే సమయంలో వినియోగదారులకు గోప్యతను అందించడానికి లావాదేవీల సమాచారాన్ని క్లౌడ్ చేసే Monero, Dash, ఇతర క్రిప్టోకరెన్సీలను ప్రైవేట్ టోకెన్లుగా వర్గీకరించవచ్చు. అంటే ఇవి నిషేధానికి గురయ్యే అవకాశం ఉంది.
ప్రైవేట్, పబ్లిక్ క్రిప్టోకరెన్సీల మధ్య తేడాలేంటి..?
బిట్‌కాయిన్(Bit Coin), ఈథర్, డాగ్‌కాయిన్(Dot Coin), షిబా ఇను(Shiba Inu) వంటి అత్యంత ప్రసిద్ధి చెందిన క్రిప్టోకరెన్సీలు పబ్లిక్‌గా ఉంటాయి. ఎందుకంటే వాటి లావాదేవీలు పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి. వినియోగదారులు మారుపేర్లతో లావాదేవీలు నిర్వహించడానికి ఈ క్రిప్టోకరెన్సీలు అనుమతించి, గోప్యతను అందిస్తున్నాయి. అయినా కూడా బ్లాక్చెయిన్లోని వీరి అన్ని లావాదేవీలను బ్లాక్‌చెయిన్‌కు యాక్సెస్ ఉన్న ఏ వ్యక్తి అయినా వీక్షించవచ్చు. వీటి డిజైన్ ప్రకారం, ఈ క్రిప్టోకరెన్సీల లావాదేవీలను అనుసంధానించడంతో పాటు గుర్తించవచ్చు. అందువల్ల వాణిజ్య ఒప్పందాలు లేదా వ్యక్తుల వ్యక్తిగత సమాచారం వంటి సున్నితమైన సమాచారంతో వ్యవహరించే సంస్థలు ప్రైవేట్ బ్లాక్‌చెయిన్‌లో చేరడానికి ఇష్టపడతాయి.
ప్రైవేట్ బ్లాక్చెయిన్లలో మోనెరో, పార్టికల్, డాష్, ZCash వంటి క్రిప్టోలు ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫాంల ద్వారా డేటా పబ్లిక్‌గా ఉండకుండానే వినియోగదారులు లావాదేవీలు చేసుకోవచ్చు. ఈ ప్రైవేట్ బ్లాక్‌చెయిన్‌లు సైతం పబ్లిక్ ఓపెన్ లెడ్జర్లను కలిగి ఉంటాయి. అయితే అవి వినియోగదారులకు వివిధ స్థాయుల్లో అనుమతులు ఇస్తాయి. అంటే వీటిలో యాక్సెస్‌ను పరిమితం చేయవచ్చు. దీంతోపాటు వినియోగదారుల గోప్యతను కాపాడటానికి లావాదేవీల సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేయవచ్చు.
ఇతర డిజిటల్ కాయిన్స్‌తో పోలిస్తే ప్రభుత్వాల నియంత్రణలో ఉండే క్రిప్టోకరెన్సీ ఎలా భిన్నంగా ఉంటుంది..?
బిట్‌కాయిన్, ఎథెరియం వంటి సాంప్రదాయ క్రిప్టోకరెన్సీలను చైనా ఇప్పటికే నిషేధించింది. ఆ తర్వాత చైనా సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే ఆ దశ అధికారిక క్రిప్టోకరెన్సీగా ‘డిజిటల్ యువాన్’ను విడుదల చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, స్వీడన్ రిక్స్‌బ్యాంక్, ఉరుగ్వే సెంట్రల్ బ్యాంక్ కూడా త్వరలో పబ్లిక్ క్రిప్టోకరెన్సీలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. డిజిటల్ యువాన్, ఇతర పబ్లిక్ క్రిప్టోకరెన్సీల మాదిరిగా కాకుండా.. బిట్‌కాయిన్ వంటి చాలా క్రిప్టో టోకెన్లకు డీసెంట్రలైజేషన్ (వికేంద్రీకరణ) లక్షణం ఉంటుంది. దీంతో వీటిపై నియంత్రణాధికారాలు, బయటి పరిస్థితుల ప్రభావాలు తక్కువగా ఉంటాయి. బిట్‌కాయిన్, ఇతర డిజిటల్ కరెన్సీలను ఫియట్ కరెన్సీకి ప్రత్యామ్నాయంగా పరిగణిస్తున్నప్పటికీ, పబ్లిక్ క్రిప్టోకరెన్సీలు నగదుకు అనుబంధంగా ఉండవచ్చు.
ప్రస్తుతానికి భారత్‌లో ప్రభుత్వ నియంత్రణలో ఉండే క్రిప్టో కరెన్సీ, ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలపై ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. సంబంధిత బిల్లు ప్రవేశపెట్టిన తరువాతే వీటిపై మరింత స్పష్టత రానుంది. అయితే ప్రభుత్వాల నియంత్రణలోని క్రిప్టోకరెన్సీకి లీగల్ స్టేటస్ లభించే అవకాశం ఉంది. ఉదాహరణకు చైనాలో డిజిటల్ యువాన్‌ను ఒక చెల్లింపు విధానంగా (payment mechanism) ఉపయోగించవచ్చు. ఆ దేశంలో దీనికి లీగల్ టెండర్‌గా గుర్తింపు ఉంటుంది. ఇతర క్రిప్టోకరెన్సీలకు ఇలాంటి కేంద్రీకృత నిర్మాణం లేదు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.