EXPLAINED WHAT ARE CONTACTLESS CARDS HOW DO THESE WORK HOW SECURE ARE THESE KNOW FULL DETAILS HERE GH VB
Explained: కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లు అంటే ఏంటి..? ఇవి ఎలా పనిచేస్తాయి? ఇవి ఎంత సెక్యూర్..?
(ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్రెడిట్ (Credit), డెబిట్ (Debit) కార్డ్‌లతో చాలా రకాలుగా పేమెంట్స్ (Payments) జరపొచ్చు. అయితే ఇటీవల కాలంలో క్రెడిట్, డెబిట్ కార్డ్స్‌లో కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లు (Contactless Cards) బాగా ఫేమస్ అయ్యాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్రెడిట్ (Credit), డెబిట్ (Debit) కార్డ్‌లతో చాలా రకాలుగా పేమెంట్స్ (Payments) జరపొచ్చు. అయితే ఇటీవల కాలంలో క్రెడిట్, డెబిట్ కార్డ్స్‌లో కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లు (Contactless Cards) బాగా ఫేమస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కాంటాక్ట్‌లెస్ కార్డ్ అంటే ఏంటి? కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయా? వీటిని ఎక్కడ ఉపయోగించవచ్చు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
కాంటాక్ట్‌లెస్ కార్డ్ అంటే ఏంటి?
కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లు మొబైల్ వాలెట్ల వలె పని చేస్తాయి. ఈ కార్డ్‌ను సింపుల్ గా కాంటాక్ట్‌లెస్ ఎనేబుల్డ్ కార్డ్ రీడర్‌పై హోల్డ్ లేదా ట్యాప్ చేయడం ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇది కార్డు స్వైప్ చేయడం, ఇన్సర్ట్ చేయడం లేదా క్యాష్ ఉపయోగించడం కంటే 10 రెట్లు వేగంగా ఉంటుంది. అలానే ఇది మీ సమాచారాన్ని సెక్యూర్ గా ఉంచుతుంది. పశ్చిమ దేశాల్లో కాంటాక్ట్‌లెస్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు ఎప్పటి నుంచో వాడుకలో ఉన్నాయి.
* మీ కార్డ్ కాంటాక్ట్‌లెస్‌గా ఉందో లేదో ఎలా చెప్పాలి?
మీ కార్డ్ కాంటాక్ట్‌లెస్‌గా ఉందో లేదో చెక్ చేయడానికి, మీ కార్డ్ వెనుక భాగంలో కాంటాక్ట్‌లెస్ సింబల్ కోసం చూడండి. కాంటాక్ట్‌లెస్ సింబల్ అనేది ఎడమ నుంచి కుడికి పెద్దగా ఉండే నాలుగు వక్ర రేఖలు (Curved Lines). ఇది Wi-Fi ఐకాన్ ని పోలి ఉంటుంది.
* కాంటాక్ట్‌లెస్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు ఎలా పని చేస్తాయి?
కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లు రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీని ఉపయోగిస్తాయి. లావాదేవీ సమయంలో కార్డ్ రీడర్ దగ్గర.. కార్డ్ హోల్డ్ చేసినప్పుడు... రీడర్‌తో కార్డ్ కమ్యూనికేట్ చేయడానికి ఆర్ఎఫ్ఐడీ (RFID) టెక్నాలజీ అనుమతిస్తుంది. ఈ కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లు ఈఎంవీ (EMV) చిప్, క్రెడిట్/డెబిట్ కార్డ్ నంబర్, గడువు తేదీ, సెక్యూరిటీ కోడ్, మాగ్నెటిక్ స్ట్రిప్ కూడా కలిగి ఉంటాయి. దీనివల్ల పేమెంట్ చేసేటప్పుడు కార్డు హోల్డర్లు తమకు కావలసిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టోర్‌లో కాంటాక్ట్‌లెస్ రీడర్లు లేకుంటే, మీరు మీ కార్డ్‌ను స్వైప్ చేయవచ్చు లేదా చిప్ రీడర్ని ఉపయోగించవచ్చు.
కాంటాక్ట్‌లెస్ కార్డ్‌ను కాంటాక్ట్‌లెస్ రీడర్‌కి ఎదురుగా హోల్డ్ చేసినప్పుడు.. అది కార్డ్ సమాచారాన్ని సెక్యూర్ గా అథెంటికేట్ చేస్తుంది. ఆపై మర్చంట్ పాయింట్-ఆఫ్-సేల్ సిస్టమ్ కార్డ్ ఇష్యూయర్ కి లావాదేవీని పంపుతుంది. కార్డ్ ఇష్యూయర్ దానిని ఆమోదించే ముందు లావాదేవీని విశ్లేషిస్తారు. ఈ ప్రాసెస్ చాలా పెద్దగా అనిపించవచ్చు కానీ ఈ ట్యాప్-అండ్-గో ప్రాసెస్ కి సాధారణంగా ఒక సెకను కంటే తక్కువ సమయం పడుతుంది.
* కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ను ఎలా ఉపయోగించాలి?
1. కార్డ్ రీడర్లో కాంటాక్ట్‌లెస్ ఐకాన్ ఉందో లేదో చూడండి. మీ కార్డ్‌లో కనిపించే నాలుగు కర్వ్డ్ లైన్స్ కాంటాక్ట్‌లెస్-ఎనేబుల్డ్ కార్డ్ రీడర్లలో కూడా కనిపిస్తాయి.
2. ప్రాంప్ట్ కాగానే... కార్డ్‌ను కాంటాక్ట్‌లెస్ ఐకాన్ కి ఒకటి నుంచి రెండు అంగుళాల దూరంలో పట్టుకోండి.
3. మీ కొనుగోలు అప్రూవ్ అయినట్లయితే, మీరు కన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటారు. అంటే బీప్, గ్రీన్ లైట్ లేదా చెక్ మార్క్ మీరు చూస్తారు.
* కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ను ఎక్కడ యూజ్ చేయొచ్చు?
కాంటాక్ట్‌లెస్ కార్డ్‌ను కిరాణా దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ల నుంచి గ్యాస్ స్టేషన్ల వరకు ఏ చోట అయినా ఉపయోగించవచ్చు. ఇప్పుడు చాలామంది వ్యాపారులు కాంటాక్ట్‌లెస్ టెక్నాలజీని వాడుతున్నారు.
* కాంటాక్ట్‌లెస్ కార్డ్ సెక్యూరిటీ
కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లు చిప్-ఎనేబుల్డ్ రిజిస్టర్లో చిప్ కార్డ్‌ల వలె సెక్యూర్ గా ఉంటాయి. అవి మాగ్నెటిక్ స్ట్రిప్ పేమెంట్స్ కంటే మరింత సురక్షితమైనవి. ప్రతి కాంటాక్ట్‌లెస్ లావాదేవీ ప్రత్యేకమైన, వన్-టైమ్ కోడ్ లేదా పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేస్తుంది. కోడ్‌ని మళ్లీ ఎవరూ ఉపయోగించలేనందున ఇది సెక్యూరిటీ రిస్క్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని కార్డ్-ప్రాసెసింగ్ నెట్వర్క్ మాత్రమే రీడ్ చేయగలదు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.