EXPLAINED WHAT 46 KM FLIGHT IN GUJARAT COULD MEAN FOR FUTURE OF DRONE DELIVERY KNOW FULL DETAILS HERE GH VB
Explained: డ్రోన్ ద్వారా పోస్టల్ డెలివరీ సక్సెస్.. డ్రోన్ డెలివరీకి ఈ ట్రయల్ భవిష్యత్తు అని ఎలా చెప్పగలం..?
డ్రోన్ల ద్వారా పోస్టల్ డెలివరీ
ఇటీవల ఇండియా పోస్ట్ ఉపయోగించిన ఒక డ్రోన్ ఏకంగా 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ఒక పార్సిల్‌ను డెలివరీ చేసింది. డ్రోన్ల ద్వారా పోస్టల్ డెలివరీకి మార్గం సుగమం చేస్తూ గురుగ్రామ్ బేస్డ్ (Gurugram-based) డ్రోన్ స్టార్టప్ టెక్ ఈగల్ (TechEagle) ఈ పవర్ఫుల్ డ్రోన్‌ను రూపొందించింది.
భారతదేశంలో డ్రోన్ రంగం (Drone Sector) వేగంగా అభివృద్ధి చెందుతోంది. విత్తనాలు విత్తడం, పొలాల్లో పురుగుల మందు చల్లడం, భూమి రికార్డులు అంచనా వేయడం, పర్యవేక్షణ.. ఇలా అన్నిటా కీలక పాత్ర పోషిస్తూ డోన్ టెక్నాలజీ(Drone Technology) ఇండియాలో అంతకంతకూ వృద్ధి(Develop) చెందుతూనే ఉంది. అయితే తాజాగా ఈ రంగంలో మరో ముందడుగు పడింది. ఈసారి పోస్టల్ పార్సిల్‌కి(Postal Parcel) సంబంధించి దేశీయ డ్రోన్ టెక్నాలజీ(Drone Technology) తన సత్తా చాటింది. ఇటీవల ఇండియా పోస్ట్(India Post) ఉపయోగించిన ఒక డ్రోన్ ఏకంగా 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ఒక పార్సిల్‌ను డెలివరీ చేసింది. డ్రోన్ల ద్వారా పోస్టల్ డెలివరీకి మార్గం సుగమం చేస్తూ గురుగ్రామ్ బేస్డ్ (Gurugram-based) డ్రోన్ స్టార్టప్ టెక్ ఈగల్ (TechEagle) ఈ పవర్ఫుల్ డ్రోన్‌ను రూపొందించింది.
ఈ అంకుర సంస్థ ఈ వారం గుజరాత్లో ఇండియా పోస్ట్ (India Post) సహకారంతో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక పార్శిల్‌ను డెలివరీ చేసింది. ఈ సూపర్ ఫాస్ట్ డెలివరీ ఫ్యూచర్ డ్రోన్ డెలివరీలపై ఆశలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం రక్షణ రంగం, వ్యవసాయంలో ఎంతో ఉపయోగపడుతున్న ఈ డ్రోన్స్ పోస్టల్ డెలివరీ సర్వీస్ కూడా అందించే రోజులు మరెంతో దూరంలో లేవని తెలుస్తోంది.
డెలివరీ & ప్రయోజనం
ఈ డ్రోన్ ఫ్లైట్ గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో 30 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో 46 కి.మీ దూరం ప్రయాణించి పార్శిల్‌ను డెలివరీ చేసింది. ఇది ఉపరితల రవాణా వేగం కంటే ఐదు రెట్లు ఎక్కువ అని టెక్ ఈగిల్ ఒక ప్రకటనలో తెలిపింది. భుజ్ తాలుకాలోని హబాయ్ విలేజ్ నుంచి కచ్ జిల్లా బచావులోని నెర్ విలేజ్‌కు ఈ డ్రోన్ పార్సెల్‌ను రవాణా చేసింది. విశేషమేంటంటే, దేశంలో డ్రోన్ చేసిన అత్యంత దూరమైన సింగిల్ డెలివరీల్లో ఈ డ్రోన్ డెలివరీ కూడా ఒకటి. గంటకు 30 కి.మీ వరకు వేగంతో గాలులు వీచినా కూడా అది ప్రతికూల వాతావరణానికి ఎదురొడ్డి వేగంగా ప్రయాణించి ఆశ్చర్యపరిచింది.
— TechEagle Innovations (@TechEagle_IN) May 31, 2022
గత నెలలో టెక్ ఈగల్ కంపెనీ 3 కిలోల పేలోడ్ సామర్థ్యం, 100 కిమీల పరిధి, 120 కి.మీ గరిష్ఠ వేగంతో ‘VertiplaneX3’ అనే ఇండియాస్ మోస్ట్ ఫాస్టెస్ట్ హైబ్రిడ్-ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (VTOL) డ్రోన్‌ను విడుదల చేసింది. 5mx5m విస్తీర్ణంలో హెలికాప్టర్ లాగా టేకాఫ్, నిలువుగా ల్యాండ్ అవ్వగల సామర్థ్యం దీని సొంతం అని కంపెనీ తెలిపింది. ఇదే డ్రోన్ పార్సెల్‌ను మే 27న డెలివరీ చేసింది. టెక్ఈగల్ సహ వ్యవస్థాపకుడు-సీఓఓ అన్షు అభిషేక్ మాట్లాడుతూ... "ఈ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా వేగంగా డెలివరీలను ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకుంది. అది పట్టణ నగరాలు కావచ్చు లేదా గ్రామీణ ప్రాంతాలు అయినా కావచ్చు. ప్రాజెక్ట్ నుంచి నేర్చుకున్న అంశాలు దేశవ్యాప్తంగా మెయిల్ డ్రోన్ డెలివరీని పెంచడానికి.. వాణిజ్యీకరించడానికి (Commercialise) వాటాదారులకు సహాయపడతాయి" అని చెప్పారు.
ఇతర ట్రయల్స్
బెంగళూరుకు చెందిన లాజిస్టిక్స్, డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ గత నెలలో దాని కిరాణా సేవ ఇన్‌స్టామార్ట్ నుంచి డెలివరీలు చేయడానికి ట్రయల్ ప్రాతిపదికన డ్రోన్ల విస్తరణను ప్రారంభించింది. రెండు దశల్లో నిర్వహిస్తున్న ఈ ట్రయల్స్ కోసం, కంపెనీ నాలుగు 'డ్రోన్-యాజ్-ఎ-సర్వీస్ (Drone-as-a-service)' ఆపరేటర్లను నియమించింది. అందులో టెక్ ఈగిల్ కూడా ఒకటి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.