Home /News /explained /

EXPLAINED THESE ARE THE FIVE MOST SEARCHED TOPICS ON GOOGLE RELATED TO REAL ESTATE KNOW HERE GH VB

Explained: రియల్‌ ఎస్టేట్‌కు సంబంధించి ఆ పదాలు మీకు తెలుసా..? గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేసిన ఐదు అంశాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేటి రియల్ ఎస్టేట్(Real Estate) మార్కెట్ అన్ని రకాలుగా రికార్డులను నెలకొల్పుతోంది. పెట్టుబడులు అత్యంత తక్కువ స్థాయిలో ఉండటమే కాకుండా.. రెండేళ్ల తర్వాత రియల్‌ ఎస్టేట్‌ ధరలు పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు తమ నివాస స్థలాలను చూసే విధానాన్ని మార్చారు.

ఇంకా చదవండి ...
నేటి రియల్ ఎస్టేట్(Real Estate) మార్కెట్ అన్ని రకాలుగా రికార్డులను నెలకొల్పుతోంది. పెట్టుబడులు అత్యంత తక్కువ స్థాయిలో ఉండటమే కాకుండా.. రెండేళ్ల తర్వాత రియల్‌ ఎస్టేట్‌ ధరలు(Cost) పెరుగుతున్నాయి. కరోనా(Corona) మహమ్మారి తర్వాత ప్రజలు తమ నివాస స్థలాలను చూసే విధానాన్ని మార్చారు. ఈ ధరల పెరుగుదల ఇంటి కోసం ఎదురుచూస్తున్న వారికి బాధాకరమైన పరిణామం. Open-door సంస్థ ప్రకారం.. మొదటిసారిగా ఇల్లు(House) కొనాలనుకునే వారిలో 98 శాతం మంది వెనక్కి తగ్గారు.  ఈ విషయంపై ఓపెన్‌డోర్‌ బ్రోకర్‌(Broker), కన్సూమర్‌ ట్రెండ్స్(Consumer Trends) నిపుణుడు బీట్రైస్ డి జోంగ్  మాట్లాడుతూ.. ‘రియల్‌ ఎస్టేట్‌పై అవగాహన లేకపోవడం, తప్పుడు సమాచారం అనేది ప్రధాన అవరోధం. ఇంటిని కొనుగోలు చేసే కళ గురించి ఎవరూ తెలుసుకోరు. తాము కొనాలనుకొన్నప్పుడు, లేదా ఈ రంగంలో తెలిసిన వారు ఉన్నప్పుడు మాత్రమే ఆసక్తి చూపుతారు.’ అని చెప్పారు. ప్రస్తుత కాలంలో రియల్‌ ఎస్టేట్‌కు(Real Estate) సంబంధించి ఎక్కువ మంది గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్న పదాల గురించి ఓపెన్ డోర్ సంస్థ మరిన్ని వివరాలు వెల్లడించింది. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రివర్స్ మార్ట్‌గేజ్‌ (Reverse Mortgage) 
రివర్స్ మార్ట్‌గేజ్, క్లోజ్ ఆఫ్ ఎస్క్రో, కంటిన్‌జెన్సీ అనేవి ఇంటిని కొనుగోలు చేయాలనుకొంటున్నవారికి తెలియాల్సిన అంశాలు. రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌లు లేదా ఇష్టమైన రియల్ ఎస్టేట్ షోల నుంచి ఈ పదాలనే ఎక్కువగా వింటూ ఉంటారు. అందుకే రివర్స్ మార్ట్‌గేజ్‌ అనేది ఇంటిని కొనాలని భావిస్తున్న వారు వెతుకుతున్న అంశాల్లో టాప్‌లో ఉంది.  రివర్స్ మార్ట్‌గేజ్‌ అనేది 62 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు తమ ఇంటిలోని ఈక్విటీపై రుణాలు తీసుకొనేందుకు అవకాశం కల్పిస్తుంది. దీనిపై పన్నులు విధించే అవకాశం లేదు.

Explained: క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్స్‌లో సపోర్ట్‌, రెసిస్టెన్స్‌ లెవల్స్‌ అంటే ఏంటి..? అవి ఎలా ఉపయోగపడతాయి..?


క్యాష్‌ ఆఫర్ (Cash Offer)
గృహ కొనుగోలుదారు రివర్స్‌ మార్ట్‌గేజ్‌ లోన్‌, ఇతర ఫైనాన్సింగ్ లేకుండా మొత్తం డబ్బు చెల్లించి ఆస్తిని కొనుగోలు చేయాలనుకోవడాన్ని క్యాష్‌ ఆఫర్  అంటారు. ఈ ఆఫర్‌లు తరచుగా విక్రేతలకు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.  ఓపెన్‌డోర్-బ్యాక్డ్ ఆఫర్‌ల వంటి ప్రోగ్రామ్‌లను ఉపయోగించి చేయవచ్చు నేటి రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఎక్కువ మంది వ్యక్తులు ఇలాంటి ఆఫర్‌లతో పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నారు.

కంటిన్‌జెన్సీ (Contingency)
కొనుగోలుదారులు చాలా తరచుగా ఇంటిపై ఆఫర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కంటిన్‌జెన్సీ పదాన్ని వింటారు. కంటిన్‌జెన్సీ కిందకు ఆఫర్‌ ఆమోదించిన తర్వాత కూడా ఇంటిని అమ్ముతున్నవారు, కొనుగోలు చేస్తున్న వారి మధ్య ఉండే నిబంధనలు. ఇంటి తనిఖీల నుంచి రివర్స్‌ మార్టిగేజ్‌ వరకు ఉండవచ్చు.  ఉదాహరణకు కొనుగోలుదారు మార్టగేజ్‌ లోన్‌తో కూడిన ఆఫర్‌ను విక్రయిస్తున్న వారికి సమర్పించవచ్చు. ఏదైనా కారణం వల్ల కొనుగోలుదారు ఫైనాన్సింగ్ వీలుకాకపోతే.. ఎలాంటి ఆర్థిక చిక్కులు లేకుండా డీల్ నుంచి బయటపడతారు.

పెండింగ్‌ (Pending)
కొంతమంది ఇంటిని కొనుగోలు చేయాలని చూస్తున్నవారు లిస్ట్‌లలో "పెండింగ్‌" అనే పదం కనిపిస్తే తక్కువగా చూస్తారు. ఎందుకంటే వారు చూస్తున్న ఆస్తి గురించి అప్పటికే కొందరు మాట్లాడి ఉన్నారు. ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఇల్లు పెండింగ్‌లో ఉంటుంది.

Explained: ఆర్టికల్ 142 ప్రత్యేక అధికారంతో పేరరివాలన్‌ విడుదల.. ఈ ఆర్టికల్ ప్రాధాన్యం ఏంటి..?


క్లోజ్ ఆఫ్‌ ఎస్క్రో (Close of Escrow)
ఏదైనా రియల్ ఎస్టేట్ డీల్‌లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరి లక్ష్యం క్లోజ్ ఆఫ్ ఎస్క్రో. రియల్ ఎస్టేట్ లావాదేవీలో కొనుగోలుదారు, విక్రేత, అన్ని పాల్గొనే పార్టీలు ఒకరికొకరు తమ చట్టపరమైన బాధ్యతలను నెరవేర్చడాన్ని క్లోజ్ ఆఫ్ ఎస్క్రో అంటారు. కొనుగోలుదారు వారి తనఖా పత్రాలన్నింటిపై సంతకం చేశారు, రుణదాత విక్రేతకు డబ్బును అందించారు, ఇంటి తాళాలు కూడా అందజేయడం వంటివి అన్నీ పూర్తయినప్పుడు క్లోజ్‌ ఆఫ్‌ ఎస్క్రోగా పేర్కొంటారు.
Published by:Veera Babu
First published:

Tags: Buyers, Explained, Real estate, Sellers

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు