హోమ్ /వార్తలు /Explained /

Explained: Sharia law in Afghanistan: తాలిబన్ల షరియా చట్టం అంటే ఏంటి.. మహిళలు దీనిపై ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..? 

Explained: Sharia law in Afghanistan: తాలిబన్ల షరియా చట్టం అంటే ఏంటి.. మహిళలు దీనిపై ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..? 

 ఆఫ్గనిస్థాన్

ఆఫ్గనిస్థాన్

Explained: Sharia law in Afghanistan: అయితే ఒక్కో ప్రాంతానికి చెందిన మత పెద్దలు షరియా చట్టాన్ని ఒక్కో విధంగా అర్థం చేసుకుంటారు. వివిధ రకాలుగా షరియా చట్టానికి వివరణ ఇస్తూ దాని ప్రకారం నియమాలను అమలు చేస్తుంటారు. ఈ చట్టానికి తాలిబన్ వివరణ "హనోఫీ న్యాయశాస్త్ర దయోబంది స్ట్రాండ్" నుంచి వచ్చింది.

ఇంకా చదవండి ...

అఫ్గానిస్థాన్‌(Afghanistan)కు ఆక్రమించుకున్న తరువాత.. ఇస్లామిక్ చట్టం ప్రకారం మహిళల హక్కులకు ప్రాధాన్యత ఇస్తామని తాలిబన్లు(Talibans) హామీ ఇచ్చారు. కానీ వారి ప్రకారం ఆ హక్కులు ఏంటనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. సీనియర్ తాలిబన్ కమాండర్ వహీదుల్లా హషిమి (Taliban commander Waheedullah Hashimi) అఫ్గానిస్థాన్‌ పాలన ఎలా ఉండబోతుందో వివరించారు. గతంలో లాగా మహిళల హక్కులను కాలరాయమని అన్నారు. షరియా చట్టాని (Sharia law)కి లోబడి మహిళల హక్కులకు గౌరవం ఇస్తామన్నారు. మతపరమైన పండితులు న్యాయవ్యవస్థ, పాలనా వ్యవస్థల అమలును త్వరలోనే సమీక్షిస్తారని పేర్కొన్నారు.

* షరియా అంటే ఏంటి?

షరియా చట్టాన్ని (Sharia law) ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌లోని అంశాలు, మత పెద్దలు చేసిన ఫత్వాలు, ప్రవక్త ముహమ్మద్ సూక్తులు, అభ్యాసాల ఆధారంగా రూపొందించారు. ప్రతి రోజూ ఆచరించే పనులను ఈ చట్టంలోని నియమాలను అనుసరించే చేయాలి. అయితే ఒక్కో ప్రాంతానికి చెందిన మత పెద్దలు షరియా చట్టాన్ని ఒక్కో విధంగా అర్థం చేసుకుంటారు. వివిధ రకాలుగా షరియా చట్టానికి వివరణ ఇస్తూ దాని ప్రకారం నియమాలను అమలు చేస్తుంటారు. ఈ చట్టానికి తాలిబన్ వివరణ "హనోఫీ న్యాయశాస్త్ర దయోబంది స్ట్రాండ్" నుంచి వచ్చింది.

* 90లలో తాలిబన్లు ఎలాంటి షరియా నియమాలు అమలు చేశారు?

తాలిబన్ల షరియా చట్టం వివరణ ప్రకారం.. పురుషులు, స్త్రీలు అందరూ తాలిబన్లు సూచించిన దుస్తులనే ధరించాలి. 1996లో అధికారంలోకి వచ్చిన సమయంలో వారు కఠినమైన నియమాలనే అమలు చేశారు. వారి ప్రకారం మహిళలు చదువుకున్నా తప్పే.. ఉద్యోగం చేసినా తప్పే! వారు ఒంటరిగా ఇంటి బయట అడుగు పెట్ట కూడదు. శరీరం ఏమాత్రం కనిపించకుండా పూర్తిగా బుర్కా ధరించాలి. ఎలాంటి ఉద్యమాలు చేయరాదు. తాలిబన్లు అమలుచేసే నియమాలను ఉల్లంఘిస్తే, మహిళలను బహిరంగంగా అవమానిస్తారు. అలాగే ఇష్టారాజ్యంగా దెబ్బలు కొడతారు.

తాలిబన్లు షరియా చట్టంలోని కఠినమైన శిక్షాస్మృతి అయిన హుదూద్ లోని నేర శిక్షలు అమలు చేశారు. వ్యభిచారానికి పాల్పడిన వ్యక్తులను, హంతకులను అత్యంత కిరాతకంగా బహిరంగంగా ఉరితీయడం, దొంగతనానికి పాల్పడిన వారి కాళ్లు చేతులు నరకడం వంటివి చేశారు. టెలివిజన్, సంగీతం, సినిమాలను కూడా నిషేధించారు. అయితే అప్పటి ఆరాచకాలు గుర్తు తెచ్చుకొని ప్రస్తుతం అఫ్గాన్‌ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాలిబన్ల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు కాబూల్ విమానాశ్రయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొందరు మహిళలు, మహిళా హక్కుల సంఘాలు అఫ్గాన్‌ లో మహిళల భవిష్యత్తు ఏంటని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : రషీద్ ఖాన్ సూపర్ హెలికాఫ్టర్ సిక్స్.. ఈ షాట్ కి ధోనీ అయినా ఫిదా అవ్వాల్సిందే..

* ప్రస్తుతం ఎలాంటి మార్పులు వచ్చాయి?

గత పాలనలో తప్పులు చేశామని ఒప్పుకున్న తాలిబన్లు ఈసారి దిద్దుబాటు చర్యలు చేపడతామని చెబుతున్నారు. కానీ చాలామంది మహిళల నుంచి పూర్తి విరుద్ధమైన మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా తాలిబన్లు ఆడవారు ఆఫీసులకు వెళ్తుంటే వారికి అడ్డం తిరిగి ఇంటికి పంపించడం వంటివి చేస్తున్నారట. దీంతో వారి హామీలు నీటి మీద రాతలే అని తేలిపోతోంది.

First published:

Tags: Afghanistan, International news, Taliban, Women

ఉత్తమ కథలు