హోమ్ /వార్తలు /Explained /

Explained: క్రెడిట్ కార్డులు UPIతో లింక్.. దీని ఉపయోగాలు, ప్రాసెస్‌కు అడ్డంకులు తదితర వివరాలు తెలుసుకోండి..

Explained: క్రెడిట్ కార్డులు UPIతో లింక్.. దీని ఉపయోగాలు, ప్రాసెస్‌కు అడ్డంకులు తదితర వివరాలు తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI)తో క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయడానికి అనుమతించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించింది. బుధవారం మానిటరీ పాలసీ ప్రసంగంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయం గురించి మాట్లాడారు.

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI)తో క్రెడిట్ కార్డ్‌లను(Credit Card) లింక్(Link) చేయడానికి అనుమతించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్(Reserve Bank Of India) ప్రతిపాదించింది. బుధవారం మానిటరీ పాలసీ(Monitory Policy) ప్రసంగంలో ఆర్‌బీఐ గవర్నర్(RBI Governor) శక్తికాంత దాస్(Shakthi kantha Das) ఈ విషయం గురించి మాట్లాడారు. స్వదేశీ రూపే క్రెడిట్ కార్డ్‌లతో ఇంటిగ్రేషన్(Integration) మొదట ప్రారంభమవుతుందని చెప్పారు. రూపే నెట్‌వర్క్(Rupay Network), UPIని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) నిర్వహిస్తోంది.

 క్రెడిట్‌ కార్డుల వినియోగం పెరిగే అవకాశం

యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్లకు ఆదరణ పెరిగింది. UPI, క్రెడిట్ కార్డ్‌ల అనుసంధానంతో భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగం పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. భారతదేశంలో క్రెడిట్ కార్డ్‌ల ద్వారా UPIపై క్రెడిట్‌ను నిర్మించడానికి ఇంటిగ్రేషన్ మార్గాలను కూడా అందిస్తుంది. గత కొన్ని సంవత్సరాలలో స్లైస్, యూని, వన్ మొదలైన అనేక స్టార్టప్‌లు వచ్చాయి. UPI వంటి ఆదరణ పొందిన వ్యవస్థపై బ్యాంకింగ్ చేయడం ద్వారా వినియోగం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు UPIని డెబిట్ కార్డ్‌లు, బ్యాంక్ ఖాతాలకు మాత్రమే లింక్ చేసే అవకాశం ఉంది. ఇది వినియోగదారులకు అదనపు సౌకర్యాన్ని అందిస్తుందని, డిజిటల్ చెల్లింపుల పరిధిని మెరుగుపరుస్తుందని దాస్ చెప్పారు.

అడ్డంకులు ఏంటి?

ఈ అనుసంధానం జరగడానికి ముందు పరిష్కరించాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు క్రెడిట్ కార్డ్‌ల ద్వారా జరిగే UPI లావాదేవీలకు మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) ఎలా వర్తింపజేస్తారనే అంశంపై స్పష్టత లేదు. MDR అనేది క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల ద్వారా వారి కస్టమర్‌ల నుంచి చెల్లింపులను అంగీకరించినందుకు వ్యాపారి నుంచి బ్యాంకు వసూలు చేసే రుసుము. 2020 జనవరి నుంచి అమలులో ఉన్న నిబంధన ప్రకారం.. UPI, RuPay కార్డుల చెల్లింపులపై MDRను వసూలు చేయరు. ఈ లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు వర్తించవు, వినియోగదారులు, వ్యాపారులు UPIని ఎక్కువగా ఆధరించడానికి ఇది ఒక ముఖ్య కారణం.

Explained: రాజ్యసభ ఎన్నికలు ఎలా జరుగుతాయి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..


అయితే ఈ నిబంధన పేమెంట్స్‌ ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంది. ఇది అగ్రిగేటర్ల సామర్థ్యాన్ని పరిమితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. UPIలో జీరో MDR వర్తింపు వీసా, మాస్టర్ కార్డ్ వంటి ఇతర కార్డ్ నెట్‌వర్క్‌లు ఇంకా అనుసంధానం కాకపోవడానికి కారణం కావచ్చు.

ఆర్‌బీఐ గవర్నర్‌ దాస్ మాట్లాడుతూ..‘భారతదేశంలో 26 కోట్ల మంది ప్రత్యేక వినియోగదారులు, ప్లాట్‌ఫారమ్‌లో ఐదు కోట్ల మంది వ్యాపారులతో UPI పేమెంట్‌ మోడ్‌గా మారింది. ఇటీవల కాలంలో యూపీఐ వినియోగం చాలా పెరిగింది. అనేక ఇతర దేశాలు తమ దేశాల్లో ఇలాంటి పద్ధతులను అవలంబించడంలో మాతో కలిసి పని చేస్తున్నాయి’ అని చెప్పారు.

Ukraine-Russia: ఉక్రెయిన్‌ యుద్ధంలో పుతిన్ తన లక్ష్యాలను సాధిస్తున్నారా..?యుద్ధం ముగినట్లేనా..?


మే నెలలో UPI రూ.10 ట్రిలియన్లకు పైగా విలువైన 5.95 బిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేసింది. 2016లో ప్రారంభించినప్పటి నుంచి రికార్డు స్థాయిలో ట్రాన్సాక్షన్‌లు జరిగాయి. NPCI త్వరలో రోజుకు ఒక బిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేయాలని చూస్తోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి సెంట్రల్ బ్యాంక్ బెంచ్‌మార్క్ రేట్లను పెంచినప్పటికీ, దేశంలో క్రెడిట్-ఆధారిత వినియోగాన్ని పెంచే లక్ష్యం కనిపిస్తోంది.

First published:

Tags: BHIM UPI, Credit cards, Explained, UPI

ఉత్తమ కథలు