Home /News /explained /

EXPLAINED PRAMOD SAWANT TALKS ABOUT GOA CIVIL CODE MODEL FOR UNIFORM CIVIL CODE THINGS TO KNOW ABOUT IT GH VB

Explained: గోవా మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో కూడా యూనిఫాం సివిల్ కోడ్ అమలు..? పూర్తి వివరాలు తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గోవా సివిల్ కోడ్‌ను ఇతర రాష్ట్రాలు అనుసరించగల నమూనాగా పేర్కొన్నారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. ఈ కోడ్ 1867 నాటి పోర్చుగీస్ సివిల్ కోడ్ నుండి ఉద్భవించిందని తెలిపారు.

మతంతో సంబంధం లేని పౌరసత్వ చట్టంగా పేర్కొనే యూనిఫాం సివిల్ కోడ్ (UCC- Uniform Civil Code) అమలు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించాలని 2022 మార్చిలో సుప్రీంకోర్టు(Supreme Court) కేంద్ర ప్రభుత్వానికి(Central Government) తెలిపింది. UCC దేశంలోని పౌరులందరికీ తప్పనిసరిగా వివాహం, విడాకులు, వారసత్వం వంటి వ్యక్తిగత విషయాలను నియంత్రించే సాధారణ చట్టాలను సూచిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44.. విధాన నిర్దేశక సూత్రాలలో ఒకటి. యూనిఫాం సివిల్‌ కోడ్‌ను  కూడా సమర్ధిస్తుంది. తమ రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. కొత్త సివిల్ కోడ్‌ను రూపొందించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత చెప్పారు.

అప్పటి నుండి అనేక భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యూనిఫాం సివిల్ కోడ్‌ను సమర్థించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఇటీవల యూనిఫాం సివిల్ కోడ్ ముస్లిం మహిళలకు న్యాయం, ఉపశమనాన్ని అందిస్తుందన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సొంత యూనిఫాం సివిల్ కోడ్ ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ప్రకటించారు. ఈ ఆదివారం నాడు గోవా సివిల్ కోడ్‌ను ఇతర రాష్ట్రాలు అనుసరించగల నమూనాగా పేర్కొన్నారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. ఈ కోడ్ 1867 నాటి పోర్చుగీస్ సివిల్ కోడ్ నుండి ఉద్భవించిందని తెలిపారు. వాస్తవానికి పోర్చుగల్ దాని 1867 చట్టానికి 1966లో ఆధునిక సంస్కరణలు జోడించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Motorola Offer: ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... బ్యాంక్ ఆఫర్ కూడా

గోవా చట్టం
1867లో పోర్చుగల్ పోర్చుగీస్ సివిల్ కోడ్‌ను అమలులోకి తెచ్చింది. 1869లో అది పోర్చుగల్‌లోని విదేశీ ప్రావిన్సులకు(గోవాతో సహా) విస్తరించింది. సివిల్‌ అథారిటీ ముందు వివాహాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని చట్టం చెబుతుంది. భార్య సమాన వారసురాలు అని, విడాకుల విషయంలో ఆమె భర్త ద్వారా సంక్రమించిన వాటితో సహా సాధారణ ఆస్తులలో సగానికి హక్కు ఉంటుందని పేర్కొంటుంది. ప్రినప్షియల్ ఒప్పందం లేకపోతే తల్లిదండ్రులు తప్పనిసరిగా కనీసం సగం ఆస్తిని కుమార్తెలతో సహా వారి పిల్లలతో తప్పనిసరిగా పంచుకోవాలి.

గోవాలోని పోర్చుగీస్ సివిల్ కోడ్ గోవా, డామన్ అండ్‌ డయ్యూ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్, 1962లోని సెక్షన్ 5(1) ప్రకారం భారతదేశంలో కొనసాగింది. గోవా డిసెంబరు 19, 1961న విముక్తి పొందింది. గోవా, డామన్ అండ్‌ డయ్యూ లేదా దానిలోని ఏదైనా భాగం సమర్థ శాసనసభ లేదా ఇతర సమర్థ అధికారం ద్వారా సవరించే వరకు లేదా రద్దు చేసే వరకు అక్కడ అమలులో ఉంటుంది. పోర్చుగీస్ సివిల్ కోడ్ మరింత ఆధునిక పోర్చుగీస్ సివిల్ కోడ్ 1966తో పోర్చుగల్‌లో భర్తీ అయినా గోవాలో పాతదే అమలులో ఉంది.

ఏకరూప నిబంధనలు
వివాహాల విషయానికి వస్తే, మొదటి, రెండవ సంతకం అని రెండు-దశల ప్రక్రియ ఉండాలని చట్టం ఆదేశించింది. మొదటిది ఉద్దేశాల ప్రకటన (అభ్యంతరాల కోసం పిలుపు), రెండవ సంతకం అధికారిక వివాహం. ఆస్తిలో సగం కుమార్తెకు ఇవ్వాలి. వీలునామాకు భార్యాభర్తలిద్దరి సమ్మతి ఉండాలి వంటి అనేక ఏకరీతిగా వర్తించే నిబంధనలు చట్టంలో ఉన్నాయి.

ఒక పెద్ద మినహాయింపు
చట్టం ముస్లింలతో సహా ద్విభార్యత్వం లేదా బహుభార్యత్వాన్ని కూడా గుర్తించదు. హిందూ పురుషుడు తన భార్య 21 ఏళ్లలోపు బిడ్డను లేదా 30 ఏళ్లలోపు మగ బిడ్డను కనకపోతే మరోసారి వివాహం చేసుకోవడానికి మినహాయింపు ఇస్తుంది. హిందూ పురుషులకు ఈ నిబంధన మినహాయింపు నిస్తుందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల ఎత్తిచూపారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాత్రం ఈ చట్టాన్ని సమర్థిస్తూ, ఈ నిబంధన కాగితాలపైనే ఉందని, అయితే ఎప్పటికీ అమలు చేయలేదన్నారు. 1880లో జెంటిల్ హిందువుల యూసేజెస్ డిక్రీ అని పిలువబడే సవరణ ద్వారా తీసుకొచ్చిన నిబంధన, పోర్చుగీస్ ప్రభుత్వం వారి ఆస్తులు, ఆస్తులకు పురుష వంశాన్ని నిర్ధారించాలనుకునే హిందూ వ్యాపారవేత్తలను శాంతింపజేయాలని కోరుకుంది.

Vivo Discount Offer: మూడు పాపులర్ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన వివో

లా కమీషన్ ఏం చెబుతోంది?
లౌకిక దేశానికి లింగ న్యాయమైన లౌకిక చట్టాలు ఉండాలని రెండు అభిప్రాయాలు లేవు. భారతదేశంలో యూనిఫాం సివిల్‌ కోడ్‌ను రూపొందించే బాధ్యతలు లా కమీషన్‌కు ఉంటాయి. మతం, సంస్కృతి విషయంలో ఇటువంటి విభిన్న కోణాలను కలిగి ఉన్న దేశానికి చట్టాల ఏకరూపత అవసరం లేదని లా కమీషన్ గతంలో అభిప్రాయపడింది.
Published by:Veera Babu
First published:

Tags: Central Government, Explained, Goa, Marriages, Uniform civil code

తదుపరి వార్తలు