హోమ్ /వార్తలు /Explained /

Explained: ఉత్తర కొరియా మిసైల్స్ వెనుక మాస్టర్ మైండ్స్.. అక్కడ సీక్రెట్ వెపన్స్ తయారు చేసేది ఎవరు..? వివరాలిలా..

Explained: ఉత్తర కొరియా మిసైల్స్ వెనుక మాస్టర్ మైండ్స్.. అక్కడ సీక్రెట్ వెపన్స్ తయారు చేసేది ఎవరు..? వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉత్తర కొరియా ఆగడాలు అగ్రరాజ్యం సహా పలు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) ఇప్పటికే పలు అణు పరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచానికి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఉత్తర కొరియా ఆగడాలు అగ్రరాజ్యం సహా పలు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) ఇప్పటికే పలు అణు పరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచానికి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వరుసపెట్టి మిస్సైల్ టెస్టులు జరుపుతూ హైపర్‌సోనిక్ ఆయుధాలను (Hypersonic weapons) రూపొందిస్తున్నారు. ఇందుకోసం తన ప్రభుత్వంలో హై ప్రొఫైల్ మిసైల్ ఇంజనీర్లు (Missile Engineers), శాస్త్రవేత్తలకు ప్రాధాన్యమిస్తున్నారు. అయితే బయట వ్యక్తులకు మాత్రం అక్కడ జరిగే విషయాలు ఏమాత్రం తెలియవు. కిమ్ మిసైల్ శక్తులను సంస్థాగతం చేస్తున్నారని, మిలిటరీ వ్యూహాల్లో(Military Plans) క్షిపణులను దీర్ఘకాలంపాటు భాగం చేయాలనే ఆలోచనలో ఉన్నారని ప్రపంచ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కిమ్‌కు అధునాతన ఆయుధాలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల గురించి తెలుసుకుందాం.

North Korea: ఉత్తర కొరియా మరో క్రూయిజ్ క్షిపణి పరీక్ష.. ఈ సంవత్సరంలో ఇది ఐదోది.. టార్గెట్ ఆ దేశమేనా..?


కిమ్ సైంటిస్టులు..

ఉత్తరకొరియాలో పనిచేస్తున్న సైంటిస్టుల గురించి ప్రపంచానికి తెలిసిన సమాచారం చాలా తక్కువ. ముఖ్యంగా వారి పేర్లు, అధికార స్థాయిలపై స్పష్టత లేదు. మిసైల్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌లో పనిచేస్తున్న మిడ్ లెవల్, వర్క్ లెవల్ సైంటిస్టులు, సాంకేతిక నిపుణుల గురించి కూడా సమాచారం తక్కువగానే ఉంది. అయితే వీరికి వ్యక్తిగత ఉద్యోగ భద్రతతో పాటు వారి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వారికి తగిన శిక్షణ ఇచ్చి రాజకీయ, సామాజిక సమస్యలు లేని విదేశీ ప్రయోజనాలను వారికి దరి చేరని విధంగా ప్రత్యేక జిల్లాల్లో నియమిస్తారని పేర్కొన్నారు.

అక్కడ పనిచేసే చాలా మంది పరిశోధకులు కిమ్ జోంగ్ ఉన్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ నుంచే పట్టభధ్రులవుతున్నారని, వారికి తగిన శిక్షణ ఇస్తారని విశ్లేషకులు చెప్పారు. కళాశాల స్థాయి నుంచే ఉత్తర కొరియా డిఫెన్స్‌కు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలోని హైపర్‌సోనికి మిసైల్ విభాగంపై దృష్టి పెట్టేలా ట్రైన్ చేస్తారని స్పష్టం చేశారు. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను వివిధ బృందాలుగా విభజించి బహుళ మార్గాల్లో ఒకే రకమైన ఆయుధాలను తయారు చేసే విధంగా ప్రోత్సహిస్తారని తెలిపారు.

2018లో ఓ అధ్యయనం ప్రకారం ఉత్తర కొరియా శాస్త్రవేత్తలు ఇతర దేశాల పరిశోధకులు కలిసి డ్యూయల్ యూజ్ టెక్నాలజీ, విధ్వంసం సృష్టించే ఆయుధాల తయారీ, ఇతర మిలిటరీ వ్యూహాల గురించి 100 వరకు వ్యాసాలు రాశారని పేర్కొంది. అవి వివిధ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయని స్పష్టం చేసింది.

అధికారులు..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మిసైల్ ప్రోగ్రాం గురించి ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న టాప్-3 అధికారులతో మాత్రమే చర్చిస్తారని, ఈ విషయంలో అత్యంత రహస్యంగా వ్యవహరిస్తారని విశ్లేషకులు అంటున్నారు. వీరిలో ఆ దేశ మాజీ ఎయిర్ ఫోర్స్ జనరల్ రీ ప్యాంగ్ చోల్, రాకెట్ సైంటిస్ట్ కిమ్ జోంక్ సిక్, వెపన్స్ డెవలప్మెంట్ సెంటర్ అధినేత జాంగ్ చాంగ్ హా ఉన్నారు. జనరల్ స్టాప్ ఛీఫ్ పాక్ జాంగ్ చాన్ నాలుగో ఉన్నతాధికారి. ఈయన వ్యూహాత్మక ఆయుధాల తయారీకి బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కిమ్ లేకుండానే అనేక మిసైల్ లాంచ్‌లకు, డిఫెన్స్ కార్యకలాపాలకు పాక్ జాంగ్ నాయకత్వం వహించారని, జనవరిలో జరిగిన హైపర్‌సోనిక్ మిసైల్స్ లాంచ్ కూడా ఈయన ఆధ్వర్యంలోనే జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

OMG: కుక్కల పురుషాంగాలకు అక్కడ భలే డిమాండ్.. నూనెలో ఫ్రై చేసుకొని లాగిస్తారు..

సంస్థలు..

నార్త్ కొరియా క్షిపణి అభివృద్ధిలో పలు డిఫెన్స్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ది అకాడమీ ఆఫ్ డిఫెన్స్ సైన్స్(NADS) ముఖ్యమైంది. దీన్నే సెకండ్ అకాడమీ ఆఫ్ నేచురల్ సెన్సెస్(SANS) అని పిలుస్తున్నారు. ఈ సంస్థే మిసైల్ లాంచ్ ఈవెంట్లకు ఎవరు హాజరు కావాలి, ఎవరికి నివేదించాలనే విషయాలను చూసుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. తయారైన వెపర్‌ను NADSకి చెందిన వ్యక్తి ఒకరు మాత్రమే పర్యవేక్షిస్తారని, తుదకు జనరల్ స్టాఫ్ డిపార్ట్మెంట్(GSD)కి చెందిన అధికారి టెస్ట్‌కు హాజరై మిసైల్ సిద్ధమైందా లేదా అని పరిశీలించి ప్రక్రియ పూర్తి చేస్తారని స్పష్టం చేశారు.

విదేశీ సాయం

ఉత్తర కొరియా మిసైల్ ప్రోగ్రాంకు సహాయం చేసేందుకు బీజాలు వేసింది అప్పటి సోవియట్ యూనియనే(రష్యా) అని విశ్లేషకులు చెబుతున్నారు. కిమ్ రూపొందిస్తున్న క్షిపణులు, హైపర్ సోనిక్ ఆయుధాలు సోవియట్ డిజైన్స్ పోలి ఉన్నాయని వాదన 90వ దశకం నుంచి నడుస్తోందని వారు స్పష్టం చేశారు. అయితే తాజాగా NADSకి చైనా, రష్యా ఉమ్మడిగా సహాయం చేస్తున్నాయని అమెరికా తాజాగా వాదిస్తోంది. ఆయుధాల తయారీకి కావాల్సిన సాంకేతికత, ముడిసరుకులు ఈ రెండు దేశాల నుంచి వెళ్తోందని నివేదికలు చెబుతున్నాయి.

ఉత్తర కొరియా దిగ్విజయంగా క్షిపణులు పరీక్షించడానికి కారణం బయట నుంచి మద్దతు లభించడమేనని ఐరోపాకు చెందిన మిసైల్ నిపుణులు మార్కస్ షిల్లర్ నొక్కి చెబుతున్నారు. గతంలో కిమ్ పాలనలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మిసైల్స్ తరచూ విఫలమవుతూ వచ్చేవని తెలిపారు.

First published:

Tags: Kim jong un, Missile

ఉత్తమ కథలు