Home /News /explained /

EXPLAINED NEW VARIANT OR LAB ERROR WHAT YOU NEED TO KNOW ABOUT DELTACRON GH VB

Explained: సైప్రస్​లో బయటపడ్డ డెల్టాక్రాన్ వేరియంట్​ ప్రమాదకరమా..? దీన్ని ల్యాబ్​లోనే సృష్టించారా..? నిపుణుల సమాధానమిదే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మానవాళిపై వైరస్​ల దాడి కొనసాగుతూనే ఉంది. ఒక వేరియంట్​ తగ్గిపోతుందని సంతోషించే లోపే కొత్త వేరియంట్​ పుట్టుకొస్తుంది. ఇలా ప్రపంచదేశాల్లో వైరస్​లు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఇది ఎప్పుటికి అంతం అవుతుందో తెలియక అంతా తలపట్టుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్​ కొత్త వేరియంట్​ విజృంభిస్తున్న తరుణంలో మరో వేరియంట్​ బయపటడింది.

ఇంకా చదవండి ...
మానవాళిపై వైరస్​ల(Virus) దాడి కొనసాగుతూనే ఉంది. ఒక వేరియంట్​(Varient) తగ్గిపోతుందని సంతోషించే లోపే కొత్త వేరియంట్​ పుట్టుకొస్తుంది. ఇలా ప్రపంచదేశాల్లో వైరస్​లు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఇది ఎప్పుటికి అంతం అవుతుందో తెలియక అంతా తలపట్టుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్(Omicron)​ కొత్త వేరియంట్​ విజృంభిస్తున్న తరుణంలో మరో వేరియంట్​ బయపటడింది. యూరప్​లోని చిన్న మధ్యధరా ద్వీప దేశమైన సైప్రస్‌లో(Cyprus) ఓ కొత్త వేరియంట్​ బయటపడింది. దాన్ని డెల్టాక్రాన్​గా (Deltacron) శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. సైప్రస్​లో 25 మంది కోవిడ్-19(Covid 19) రోగుల్లో డెల్టాక్రాన్(Deltracorn)​ లక్షణాలు బయటపడ్డాయి. వారికి డెల్టా(Delta), ఓమిక్రాన్(Omicron) వేరియంట్ల లక్షణాలను మిళితం చేసే ఓ కొత్త వేరియంట్​(New Varient) సోకినట్లు నిర్థారణ అయ్యింది. దీనిలో డెల్టా, ఒమిక్రాన్​ రెండు లక్షణాలు ఉండటంతో రెండింటిలోని మొదటి, చివరి అక్షరాలను కలిపి డెల్టాక్రాన్​గా పేరు పెట్టారు.

Explained: టీవీలలో సరికొత్త డిస్‌ప్లే టెక్నాలజీ QD OLED.. అసలేంటీ టెక్నాలజీ..? దీని ప్రయోజనాలేంటి..?


అయితే కొత్త రకం వేరియంట్​ డెల్టాక్రాన్​ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం, డెల్టాక్రాన్​ ప్రభావం ఎంతలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని, మరికొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. సైప్రస్​లో కోవిడ్​–19 రోగుల నుంచి సేకరించిన నమూనాల్లో ఒమిక్రాన్​, డెల్టా వేరియంట్లకు సంబంధించిన 10 మ్యూటేషన్లను గుర్తించినట్లు తెలిపారు. కరోనా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన బాధితుల నుంచి కొన్ని నమూనాలు, సాధారణ జనం నుంచి కొన్ని నమూనాలు సేకరించి ఈ కొత్త వేరియంట్​ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

సైప్రస్‌లో 25 మందిలో డెల్టాక్రాన్​ లక్షణాలు..
డెల్టాక్రాన్​ తొలి కేసు సైప్రస్​లో నమోదైంది. డెల్టాక్రాన్​ స్పెయిన్​ను సైప్రస్​ విశ్వవిద్యాలయంలోని బయోలాజికల్ సైన్సెస్ ప్రొఫెసర్ లియోండియోస్ కోస్ట్రికిస్, బయోటెక్నాలజీ అండ్​ మాలిక్యులర్ వైరాలజీ ల్యాబరేటరీ అధిపతి బ్లూమ్‌బెర్గ్ ఇద్దరూ తమ పరిశోధనలో గుర్తించారు. 25 మందికి డెల్టా కో–ఇన్ఫెక్షన్​ సోకినట్లు నిర్థారించారు. డెల్టా, ఒమిక్రాన్​ కాండినేషన్లు ఇందులో కనిపించాయని స్పష్టం చేశారు. "ప్రస్తుతం 25 మందిలో ఓమిక్రాన్, డెల్టా కో-ఇన్‌ఫెక్షన్‌లు గుర్తించాం. ఈ రెండింటి కలయికతో మేము ఓ కొత్త వేరియంట్​ను కనుగొన్నాము. దానికి ప్రాధమికంగా డెల్టాక్రాన్​ అనే పేరు పెట్టాం." అని కోస్ట్రికిస్ ఒక టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, డబ్ల్యూహెచ్​ఓ దీన్ని ఇంకా నిర్థారించలేదు. కో-ఇన్‌ఫెక్షన్ అనేది ఒక వ్యక్తి ఒకేసారి రెండు వేర్వేరు వ్యాధులను సంక్రమించే లక్షణం. ఒక వ్యక్తికి నవల కరోనావైరస్ రెండు రకాలు సోకడం కూడా సాధ్యమేనని నిపుణులు అంటున్నారు.

ఆసుపత్రిలో చేరిన రోగుల నుంచి తీసుకున్న 11 నమూనాల్లో 25 వేరియంట్ కేసులను కనుగొన్నట్లు కోస్ట్రికిస్ చెప్పారు. మిగిలిన 14 మందికి రోగుల నుంచిల నుంచి సోకిందని గుర్తించారు. జనవరి 7న తొలి కేసు బయటపడిందని తెలిపారు. అయితే, భవిష్యత్తులో డెల్టాక్రాన్​ కేసులు పెరిగే అవకాశం ఉందా? ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది? డెల్టా, ఒమిక్రాన్​తో పోలిస్తే ఇది మరింత ప్రమాదకరమా? వ్యాప్తి వేగం ఎంత వరకు ఉంటుంది? అనే దాన్ని ఇప్పటికిప్పుడు ఊహించడం కష్టమేనని ఆయన చెప్పారు. "కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం. దీనిపై మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉంది." అని కోస్ట్రికిస్ పేర్కొన్నారు. ఇక, డెల్టాక్రాన్​ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇంకా గుర్తించలేదు.

నిపుణులు ఏం చెబుతున్నారు..?
డెల్టాక్రాన్​ కొత్త వేరియంట్​పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. దీని ఆవిర్భావం గురించి నివేదికలు వైరల్ కావడంతో, అనేక మంది శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్‌లేషనల్ ఇన్‌స్టిట్యూట్ స్థాపకుడు డాక్టర్ ఎరిక్ టోపోల్ ట్వీట్​ చేస్తూ ‘‘డెల్టాక్రాన్ భయంకరమైనది” అని పేర్కొన్నారు. డాక్టర్ బొఘుమా కబిసెన్ టైటాంజీ మాట్లాడుతూ “కొత్త వేరియంట్​ 10 మ్యూటేషన్లు చెందుతుందని అధ్యయనాల్లో తేలింది. ఇది ఆందోళనకరమైనది. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉంది. అప్పుడే పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది." అని అన్నారు.

SSD Storage: మీ ల్యాప్‌టాప్‌ స్లో అవుతోందా..? బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించే ఈ SSD స్టోరేజ్​ ప్రొడక్ట్స్‌ను ప్రయత్నించండి..


ల్యాబ్​లో పొరపాటే కారణమా..?
ఒక వ్యక్తిలో డెల్టాక్రాన్​ను నిర్ధారించడానికి ఎక్కువ సమాచారం అవసరం అవుతుంది. ఇది రెండు వేర్వేరు వేరియంట్ల నుంచి పుట్టుకొచ్చిన కొత్త వైరస్. అందుకే, సార్స్-CoV-2 'రీకాంబినేషన్'గా పిలిచే ఒక సూపర్ పవర్​గా దీన్ని వర్ణిస్తున్నారు. ఇది డెల్టా, ఒమిక్రాన్​ రెండు వేరియంట్​ లక్షణాలకు చాలా దగ్గరి సంబంధం ఉన్న వైరస్‌. ఈ రెండింటి జన్యువులను కలపడానికి, సరిపోల్చడానికి డెల్టాక్రాన్​ అనుమతిస్తుంది. కాగా, మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి శాస్త్రవేత్తలు రీకాంబినెంట్‌ల ఆవిర్భావంపై ఒక కన్నేసి ఉంచారు. రీకాంబినేషన్​ అనేది వైరస్ పూర్తిగా ఊహించని విధంగా ప్రవర్తించడానికి దారితీస్తుంది.

కాగా, డెల్టాక్రాన్​ కొత్త స్ట్రెయిన్​తో ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సైప్రస్​ ఆరోగ్య శాఖ మంత్రి మిచాలిస్​ హడ్జిపాండేలాస్​ అన్నారు. కాగా, డెల్టాక్రాన్​ వేరియంట్​ను ల్యాబ్​లో సృష్టించినట్లు పులువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ అనుమానం నిజం కాదని, నిజంగానే తాము కొత్త వేరియంట్​ను గుర్తించామని సైప్రస్​ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) మాత్రం ఇప్పటివరకు డెల్టాక్రాన్​పై స్పందించలేదు.
Published by:Veera Babu
First published:

Tags: Omicron, Omicron corona variant

తదుపరి వార్తలు