Home /News /explained /

EXPLAINED NEW PODCAST EPISODE ON NUCLEAR REACTORS COMPLETE INFORMATION ON NUCLEAR POWER AVAILABLE GH VB

Explained: న్యూక్లియర్ రియాక్టర్లపై కొత్త పాడ్‌కాస్ట్‌ ఎపిసోడ్.. అందుబాటులో అణుశక్తిపై పూర్తి సమాచారం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గత సంవత్సరం చివరిలో నిర్వహించిన న్యూక్లియర్ ఎక్స్‌ప్లెయిన్డ్ - IAEA పాడ్‌కాస్ట్‌ తాజా ఎపిసోడ్‌లో.. అణు రియాక్టర్లు, అణుశక్తి గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి చర్చించారు. Apple, Google, Spotifyలో ఇది అందుబాటులో ఉంది.

అణు రియాక్టర్‌ల(Nuclear Reactors)ను దశాబ్దాలుగా వినియోగిస్తున్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్తును(Current) అందిస్తున్నాయి. గత సంవత్సరం(Year) చివరిలో నిర్వహించిన న్యూక్లియర్ ఎక్స్‌ప్లెయిన్డ్ - IAEA పాడ్‌కాస్ట్‌ తాజా ఎపిసోడ్‌లో.. అణు రియాక్టర్లు, అణుశక్తి గతం, వర్తమానం(Future), భవిష్యత్తు గురించి చర్చించారు. ఆపిల్ (Apple), గూగుల్ (Google) , Spotifyలో ఇది అందుబాటులో ఉంది. అణు ప్రపంచాన్ని, అణు సాంకేతికతలు మన దైనందిన జీవితంలో ఎలా ప్రయోజనాలను అందిస్తాయో ఈ పాడ్‌కాస్ట్‌(Podcost) వివరిస్తుంది. ఈ ఎపిసోడ్‌లో(Episode) ముగ్గురు నిపుణులు అణు రియాక్టర్ల(Nuclear Reactors) చరిత్ర(History), అవి విద్యుత్తును ఉత్పత్తి(Current Produce) చేసే విధానం, అవి అందించే ప్రయోజనాలు(Uses), అలాగే వారు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చర్చిస్తారు.

Explained: గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారత్.. ప్రస్తుతం ఎగుమతులను ఎందుకు నిషేధించింది..?


పాడ్‌కాస్ట్‌(Podcost)లో వియన్నాలోని టెక్నికల్ యూనివర్సిటీ (Technical University) రిటైర్డ్ ప్రొఫెసర్(Professor) హెల్ముత్ బోక్ మాట్లాడుతూ..‘ఒక అణు విద్యుత్ ప్లాంట్ బొగ్గు(Coal) ఆధారిత ప్లాంట్ లేదా గ్యాస్(Gas) ఆధారిత ప్లాంట్‌తో సమానంగా ఉంటుంది. ఇక్కడ నీటిని మరిగించి, ఆవిరిని ఉత్పత్తి చేస్తారు. దానిని టర్బైన్ జనరేటర్‌కు(Generator) బదిలీ చేస్తారు. అణు రియాక్టర్‌లో వేడికి మూలం విచ్ఛిత్తి ప్రక్రియ(Nuclear Fission)’ అని చెప్పారు.

Explained: భారీగా క్షీణిస్తున్న రూపాయి విలువ.. ఇది ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? తెలుసుకోండి..


ఈ ఎపిసోడ్‌లో బోయెక్‌తో పాటు ఆస్ట్రేలియాలోని ఫ్రేజర్ నాష్ కన్సల్టెన్సీ సీనియర్ కన్సల్టెంట్ బెన్ హర్డ్, IAEA వద్ద ఉన్న అణుశక్తి విభాగం డైరెక్టర్ అలైన్ డెస్ క్లోయిజక్స్‌తో ఇంటర్వ్యూలు ఉన్నాయి. పాడ్‌కాస్ట్‌‌లో హియర్డ్ మాట్లాడుతూ.. ‘ప్రపంచవ్యాప్తంగా అణు రియాక్టర్ల విస్తరణ విషయానికి వస్తే ఇది ఒకే చిత్రంలా ఉండదు, మిశ్రమంగా ఉంటుంది’ అని చెప్పారు. క్లీన్ ఎనర్జీ ప్రభావవంతమైన వనరుగా న్యూక్లియర్ దాని ప్రయోజనాలను కలిగి ఉంది. మరోవైపు అణు రియాక్టర్లను అమర్చడానికి సమయం, నైపుణ్యం, ముందస్తు పెట్టుబడి వంటి సవాళ్లు కూడా ఉన్నాయి.

Explained: ఫిన్‌లాండ్‌ NATOలో ఎందుకు చేరాలనుకుంటోంది..? ఈ ప్రతిపాదనకు పుతిన్ ఎందుకు వ్యతిరేకం..?


IAEA దేశాలకు సురక్షితంగా, ప్రభావవంతంగా అణుశక్తిని పరిచయం చేయడానికి, ఉపయోగించడాన్ని కొనసాగించడానికి సహాయాన్ని అందిస్తుంది. దీని గురించి డెస్ క్లోయిజక్స్ మాట్లాడుతూ..‘మేము ఒక ప్రత్యేక విధానాన్ని అభివృద్ధి చేశాం. దీనిని మైల్‌స్టోన్స్ అప్రోచ్ అని పిలుస్తాము. కొన్ని దశల ప్రకారం సంసిద్ధత స్థాయిని అంచనా వేయడంలో IAEA సహాయాన్ని అభ్యర్థించే దేశాలకు మేము మద్దతు ఇస్తాం’ అని వివరించారు.

Explained: ప్రధానమంత్రి ఆవాస్ యోజన- అర్భన్ పథకం అంటే ఏంటి..? ఈ స్కీమ్‌ లబ్ధిదారులు ఎవరు..?


IAEA న్యూక్లియర్ ఎక్స్‌ప్లెయిన్డ్ పాడ్‌కాస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్ర నిపుణులతో ఇంటర్వ్యూలను అప్‌లోడ్‌ చేసింది. రాబోయే ఎపిసోడ్‌లు అణు విద్యుత్ ప్లాంట్ల భద్రత, స్వచ్ఛమైన ఇంధన పరివర్తన, ఆహార భద్రత, ఇలాంటి మరిన్ని అంశాలను కవర్ చేయనుంది. న్యూక్లియర్ ఎక్స్‌ప్లెయిన్డ్ అణు సాంకేతికతల ప్రయోజనాలు, ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు దోహదపడే విధానంపై iaea.orgలో వివరణాత్మక కథనాలను పొందుపరుస్తుంది. ఇది Apple, Google, Spotifyలో అందుబాటులో ఉంది. nuclearexplained@iaea.org కి ప్రశ్నలు, అభిప్రాయాలను పంపవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Explained, Nuclear

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు