Home /News /explained /

EXPLAINED MUMBAI COURT REJECTED THE DEMAND BY THE NCB FOR FURTHER CUSTODY OF SHAH RUKH KHANS SON ARYAN KHAN WHAT IS THE DIFFERENCE BETWEEN JUDICIAL POLICE CUSTODY GH SRD

Explained: ఆర్యన్ ఖాన్‌ను NCB కస్టడీ నుంచి జ్యుడిషియల్ కస్టడీకి పంపిన కోర్టు.. ఈ రెండింటికీ మధ్య తేడాలేంటి?

Aryan Khan Photo : Instagram

Aryan Khan Photo : Instagram

Aryan Khan - Mumbai Durg Case Update | గోవా వెళ్తున్న క్రూయిజ్‌ షిప్‌లో పట్టుబడిన ఆర్యన్‌ ఖాన్‌తో పాటు ఏడుగురిని ఎన్‌సీబీ అక్టోబర్‌ 3న అరెస్టు చేసింది. నిర్దేశిత 24 గంటల్లోపు దర్యాప్తును ఎన్‌సీబీ పూర్తి చేయలేకపోవడంతో, వారి కస్టడీకి కోర్టు నుంచి అనుమతి పొందింది.

ఇంకా చదవండి ...
మాదకద్రవ్యాల కేసులో (Mumbai Cruise Drug Case) అరెస్టైన బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌  (Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌, (Aryan Khan) ఇతర అనుమానితుల కస్టడీని పొడిగిచేందుకు ముంబై కోర్టు తిరస్కరించింది. గతంలో అనుమతించిన కస్టడీ గడువు అక్టోబర్ 7నే ముగిసింది. దీంతో ఈ గడువును పొడిగించాలని కోరుతూ ఎన్‌సీబీ కోర్టును ఆశ్రయించింది. అయితే ఇందుకు కోర్టు నిరాకరించింది. అనుమానితులను జ్యుడిషియల్‌ కస్టడీకి పంపించింది. ఈ నేపథ్యంలో పోలీస్ కస్టడీ (Police Custody) , జ్యుడిషియల్ కస్టడీకి  (Judicial custody) మధ్య తేడాలను తెలుసుకుందాం.

ఇంతకీ పోలీసు కస్టడీ అంటే ఏంటి?
పోలీసులు లేదా డ్రగ్స్‌ కేసులను దర్యాప్తు చేసే ఎన్‌సీబీ (నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో) వంటి దర్యాప్తు సంస్థల అధీనంలో అనుమానితులు ఉంటే.. ఆ వ్యక్తి పోలీసు కస్టడీలో ఉన్నట్టు గుర్తిస్తారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌-1973 నిబంధనల ప్రకారం ఏదైనా నేరానికి సంబంధించి ఏ వ్యక్తినైనా పోలీసులు అరెస్టు చేస్తే.. వారిని 24 గంటల్లోపు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచాలి.

Aryan Khan Drugs Case: డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు షాక్.. 14 రోజుల కస్టడీ..



సీఆర్పీసీ సెక్షన్ 57 ఏం చెబుతోంది?

సీఆర్‌పీసీ సెక్షన్‌- 57 ప్రకారం.. వారెంట్‌ లేకుండా అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోపు మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచకుండా పోలీసులు తమ కస్టడీలో ఉంచుకోవడానికి వీల్లేదు. సీఆర్‌పీసీ సెక్షన్‌- 167 ప్రకారం.. సదరు అనుమానితుడిని పోలీసు కస్టడీకి అప్పగించాలా లేదా అన్నది మేజిస్ట్రేట్‌ నిర్ణయిస్తారు. ఒకవేళ పోలీసు కస్టడీకి అప్పగించినా అది మొత్తంగా 15 రోజులు మించకూడదు. సీఆర్‌పీసీ సెక్షన్‌- 167 ప్రకారం.. సెక్షన్‌ 57 నిర్దేశించిన రీతిలో ఇరవై నాలుగు గంటల్లోపు దర్యాప్తు పూర్తి చేయడం కుదరదని భావించిన పక్షంలో పోలీసు కస్టడీని మేజిస్ట్రేట్‌ పొడిగించవచ్చు.

Bollywood drugs case: బాలీవుడ్ హీరో కుమారుడికి బిగుస్తున్న ఉచ్చు..వాట్సప్‌లో సంచలన నిజాలు



ప్రాధమిక హక్కుల ఉల్లంఘనగా భావించిన కోర్టు

గోవా వెళ్తున్న క్రూయిజ్‌ షిప్‌లో పట్టుబడిన ఆర్యన్‌ ఖాన్‌తో పాటు ఏడుగురిని ఎన్‌సీబీ అక్టోబర్‌ 3న అరెస్టు చేసింది. నిర్దేశిత 24 గంటల్లోపు దర్యాప్తును ఎన్‌సీబీ పూర్తి చేయలేకపోవడంతో, వారి కస్టడీకి కోర్టు నుంచి అనుమతి పొందింది. అయితే ఆ కస్టడీ గడువు అక్టోబర్‌ 7తో ముగిసింది. దర్యాప్తు కోసం మరింత సమయం కస్టడీకి అప్పగించాలని కోరుతూ వారిని ఎన్‌సీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టింది. కానీ ఆ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. ఊరికే పోలీసు కస్టడీకి అప్పగించడమన్నది నిందితులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని భావించిన కోర్టు.. వారిని 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి ఆదేశించింది.

జ్యుడిషియల్‌ కస్టడీ అంటే ఏంటి?
సీఆర్‌పీసీ సెక్షన్‌ 167 ప్రకారం ఒక వ్యక్తికి పదిహేను రోజుల పోలీసు కస్టడీ గడువు ముగిసిన తర్వాత డిటెన్షన్‌ కోసం జూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ అనుమతించవచ్చు. కానీ అలా చేసేందుకు తగిన పరిస్థితి ఉందని మేజిస్ట్రేట్‌ సంతృప్తి చెందాలి. అయితే దర్యాప్తు జరుగుతున్న నేరానికి మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష లేదా 10 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధించే నేరమైనప్పటికీ.. అలాంటి జ్యుడిషియల్‌ కస్టడీని 90 రోజులకు మించి మేజిస్ట్రేట్‌ అనుమతించలేరు. మిగిలిన నేరాలకు జ్యుడిషయల్‌ కస్టడీ అన్నది 69 మించి పొడిగించడం కుదరదు.

Chiranjeevi - Salman Khan: చిరంజీవి ‘గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ రోల్ పై క్లారిటీ..



బెయిల్ విషయంలో నిబంధనలు ఎలా ఉన్నాయి?
అలా 60 లేదా 90 రోజుల గడువు ముగిసిన తర్వాత నిందితుడు తగిన బెయిల్‌ సమర్పించగలిగితే వారిని బెయిల్‌పై విడుదల చేయవచ్చు. సదరు నేరాలకు సంబంధించి నిర్దేశించిన ఈ గడువు లోపు విచారణ పూర్తి చేసి, ఛార్జ్‌షీట్‌ ఫైల్‌ చేయాలన్నది దీని వెనుక ఉన్న ఉద్దేశం. ఒకవేళ పోలీసులు నిర్దేశించిన సమయంలోపు రిపోర్టు దాఖలు చేస్తే.. డీఫాల్ట్‌గా నిందితుడికి బెయిల్‌ లభించదు. వారు జ్యుడిషియల్‌ కస్టడీలోనే ఉంటారు. ఎందుకంటే దర్యాప్తు తర్వాత విచారణ ప్రారంభమవుతుంది.

సీఆర్‌పీసీ సెక్షన్‌ 436A ఏం చెబుతోందంటే.. జ్యుడిషయల్‌ కస్టడీలో నిందితుడు అండర్‌ ట్రయల్‌గా ఉండి, గరిష్ఠంగా విధించే శిక్షలో సగం పూర్తి చేస్తే.. వారిని డీఫాల్ట్‌గా బెయిల్‌పై విడుదల చేయవచ్చు. అంటే ఏదైనా నేరానికి సంబంధించి విధించే శిక్ష సగం పూర్తి చేసేంత కాలం సదరు వ్యక్తిని జ్యుడిషియల్‌ కస్టడీలో ఉంచవచ్చు.

Priyanka - Shraddha- Deepika : ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న టాప్ 15 బాలీవుడ్ హీరోయిన్స్..




జ్యుడిషియల్‌ కస్టడీ, పోలీసు కస్టడీకి తేడా ఏంటి?
పోలీసు కస్టడీ అంటే నిందితులు పోలీసు స్టేషన్‌ లేదా దర్యాప్తు సంస్థ నియంత్రణలో ఉండే ప్రదేశంలో ఉండటం. పోలీసు కస్టడీలో ఉన్న నిందితులను దర్యాప్తు అధికారులు ప్రశ్నించేందుకు పూర్తి వెసులుబాటు ఉంటుంది. జ్యుడిషియల్‌ కస్టడీ అంటే.. నిందితులను జైలుకు తరలిస్తారు. పోలీసు లాకప్‌ లేదా వారిని తొలుత ఉంచిన ప్రదేశాల్లో ఉండనివ్వరు. జ్యుడిషియల్‌ కస్టడీలో నిందితులు ఉన్నప్పుడు, వారిని ప్రశ్నించే వెసులుబాటు దర్యాప్తు సంస్థల అధికారులకు ఉండదు. దాని కోసం వారు కోర్టు నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Bollywood news, Drugs case, Mumbai Police, Shah Rukh Khan

తదుపరి వార్తలు