Home /News /explained /

EXPLAINED MULTIPLE ROUNDS OF DISCUSSION HAVE TAKEN PLACE BETWEEN THE GOVERNMENT ANDS PFIZER MODERNA OVER INDEMNITY GH SK

Explained: టీకా వికటిస్తే ఏం చేయాలి? ఔషధ కంపెనీలతో కేంద్రం చర్చలు విజయంతమవుతాయా?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

పైజర్, మోడెర్నా టీకాల వల్ల దుష్ప్రభావాలు కలిగితే నష్టపరిహారం చెల్లింపు బాధ్యత నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఈ రెండు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. దీనర్థం టీకా తీసుకున్న వారికి దుష్ఫలితాలు కలిగితే.. ఈ కంపెనీలపై ఆయా దేశాలు లేదా పౌరులు ఎలాంటి వ్యాజ్యాలు వేసే అవకాశముండదు.

ఇంకా చదవండి ...
కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ మన దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరాయంగా సాగుతోంది. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు భారత్ లో వేస్తున్నారు. స్పుత్నిక్ కూడా అందుబాటులోకి వచ్చింది.  జనాభా ఎక్కువగా ఉన్న మన దేశంలో ఫైజర్, మోడెర్నా లాంటి ప్రపంచ స్థాయి వ్యాక్సిన్ల సరఫరా కోసం భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ మేరకు ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడెర్నా సంస్థలతో పలు రౌండ్ల సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం వివాదాస్పదాంశమైన నష్టపరిహారం గురించి చర్చలు చివరి దశలో ఉన్నాయి.

పైజర్, మోడెర్నా టీకాల వల్ల దుష్ప్రభావాలు కలిగితే నష్టపరిహారం చెల్లింపు బాధ్యత నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఈ రెండు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. దీనర్థం టీకా తీసుకున్న వారికి దుష్ఫలితాలు కలిగితే.. ఈ కంపెనీలపై ఆయా దేశాలు లేదా పౌరులు ఎలాంటి వ్యాజ్యాలు వేసే అవకాశముండదు. ప్రస్తుతం ఈ అంశంపై భారత ప్రభుత్వం కంపెనీలతో చర్చలు కొనసాగిస్తోంది. నష్టపరిహారం విషయంలో వ్యాక్సిన్ తయారీ సంస్థలకు మినహాయింపు ఇవ్వడమంటే.. టీకా వల్ల దుష్ర్పభావాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నవారు పరిహారం కోరలేరని అర్థం కాదు. కానీ ఈ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇతర దేశాల్లో నష్టపరిహారం ఎలా ఉంది? భారత ప్రభుత్వంతో కంపెనీలకు ఎలాంటి సమస్య ఉంది? వంటి విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.

* ప్రభుత్వం, ఫైజర్ కంపెనీ మధ్య ఎలాంటి చర్చలు కొనసాగుతున్నాయి?
ప్రస్తుతం ప్రభుత్వం, ఫైజర్ సంస్థ మధ్య ఎలాంటి చర్చలు కొనసాగాయనే వివరాలు బహిర్గతం కాలేదు. ఫైజర్, ఇతర టీకా తయారీదారులు.. దేశాలతో వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసేటప్పుడు గోప్యత నిబంధనలను అమలు చేస్తారు. సున్నితమైన చర్చలతో పాటు వ్యాపార సంబంధిత సమాచార భద్రత కోసం ఇలా చేస్తారు. భారత్ లో కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధినేత వికే పాల్ మాట్లాడుతూ కొంత మొత్తంలో ఫైజర్ టీకా లభ్యత ఉంటుందని, జులై నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. అయితే వ్యాక్సిన్ దుష్ప్రభావాల నష్టపరిహారం విషయంలో చట్టపరమైన మినహాయింపు ఇవ్వాలనే ఫైజర్ అభ్యర్థనను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

* భారత చట్టాల ప్రకారం కంపెనీలు నష్టపరిహారం ఇవ్వలేవా?
కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పూత్నిక్-5 టీకాల దుష్ప్రభావాల విషయంలో.. భారత ఔషధ నియంత్రణ మండలి నష్టపరిహార వ్యాజ్యాలకు చట్టపరమైన మినహాయింపు ఇవ్వలేదు. ఈ సంస్థలకు అత్యవసర వినియోగ అధికారాన్ని మాత్రమే ఇచ్చింది. క్లినికల్ ట్రయల్స్ కోసం భారత చట్టం ప్రకారం గాయం లేదా మరణం విషయంలో మంజూరు చేయడానికి ఫార్ములాను రూపొందించింది. వాణిజ్య ఉపయోగం కోసం టీకా ఆమోదించినప్పుడు డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ యాక్ట్ కింద నిర్దిష్ట నిబంధన లేదు. ఏదేమైనా పరిహారం కోరుతున్న లబ్దిదారులు వినియోగాదారుల కోర్టులు(Consumer Courts) లేదా హైకోర్టు లాంటి చట్టపరమైన ఫోరమ్‌ల ముందు పిటీషన్లు దాఖలు చేయవచ్చు. అలాగే టీకాల దిగుమతి కోసం ఏదైన నిబంధనను ఉల్లంఘిస్తే భారత ఔషధ నియంత్రక మండలి చట్టప్రకారం చర్య తీసుకునే అవకాశముంది.

* టీకా తయారీదారులకు ఏ దేశాలు నష్టపరిహారం మంజూరు చేశాయి?
డిసెంబరులో తమ ప్రజలకు టీకాలు వేయడం ప్రారంభించిన అమెరికా.. కోవిడ్ వ్యాక్సిన్ తయారీదారుకు ఇలాంటి చట్టపరమైన రక్షణ కల్పించిన మొదటి దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. వ్యాక్సిన్ తయారీదారులకు యూకే కూడా నష్టపరిహారానికి చట్టపరమైన మినహాయింపు మంజూరు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తన కోవాక్స్ ఫెసిలిటీలో ఉన్న తక్కువ ఆదాయ దేశాలకు ప్రత్యేక పరిహార కార్యక్రమాన్ని కలిగి ఉంది.

* చట్టపరమైన రక్షణకు సంబంధించిన నిబంధనలేంటి?
టీకాలు, ఇతర వైద్య సదుపాయాల విషయంలో చట్టపరమైన బాధ్యతను పరిమితం చేయడానికి పబ్లిక్ రెడినెస్ అండ్ ఎమర్జెన్సీ ప్రీపరెడ్నెస్ యాక్ట్(PREP), యూఎస్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ కు అధికారం ఇస్తుంది. 2020 ఫిబ్రవరి 4న HHS కార్యదర్శి పీఆర్‌ఈపీ చట్టాన్ని ప్రారంభించి కరోనాను ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించారు. పీఆర్‌ఈపీ చట్టం కింద నష్టానికి సంబంధించి మరణం, మానసిక గాయం, అనారోగ్యం, వైకల్యం లేదా వైద్య పర్యవేక్షణ ఖర్చులు, వ్యాపార నష్టాలు, ఆస్తి నష్టం లాంటి అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు.

* అమెరికాలో పరిహారానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి?
యూఎస్ కౌంటర్ మెజర్స్ ఇంజూరీ కాంపన్సెషన్(CICP) కింద నష్టపరిహారం ఇస్తారు. కోవిడ్ టీకా ప్రతికూల ప్రభావం వల్ల తీవ్రమైన గాయమైన వ్యక్తులకు సీఐసీపీ బెనిఫిట్లు అందుకుంటారు. అయితే సీఐసీపీ పరిహారం మొత్తం కూడా చాలా ఎక్కువ. అంతేకాకుండా చాలా అరుదుగా ఉంటుంది. 2010 నుంచి సీఐసీపీకి 1360 క్లెయిమ్ ఫైలింగ్స్ వచ్చాయి. వాటిలో 29 క్లెయిమ్‌లకు మాత్రమే పరిహారం ఇచ్చారు. ఈ మొత్తం 6 మిలియన్ డాలర్లు కేటాయించింది. అంతేకాకుండా ఈ టీకాలు యూఎస్ నేషనల్ వ్యాక్సిన్ కాంపన్సేషన్ ప్రోగ్రాం(వీఐసీపీ) పరిధిలోకి రావు. పరిహారం కోసం వీఐసీపీ కింద లబ్దిదారుడు యూఎస్ కోర్ట్ ఆఫ్ పెడరల్ క్లెయిమ్‌ల కోసం పిటీషన్ దాఖలు చేయవచ్చు. ఇది ప్రభుత్వం సమీక్ష, సమర్పణల ఆధారంగా నిర్ణయిస్తుంది. వీఐసీపీ 16 వ్యాక్సిన్లను కవర్ చేస్తోంది. ఇందులో సీజనల్ ఇన్ ఫ్లూయెంజా వ్యాక్సిన్ కూడా ఉంది.

* యూకేలో పరిహారం ఎలా ఉంది?
యూకేలో వ్యాక్సిన్ డ్యామేజ్ చెల్లింపు విధానం అమల్లో ఉంది. ఇది పరిహార పథకం కాదు. కొన్ని వ్యాధులకు టీకాలు వేయడం వల్ల తీవ్రంగా ప్రభావం పడితే వ్యాక్సిన్ డ్యామేజ్ చెల్లింపు కింద 120,000 డాలర్ల పన్ను రహిత చెల్లింపును పొందవచ్చు. కోవిడ్ టీకాలతో సహా 19 రకాల వ్యాక్సిన్లను ఈ ప్రొగ్రాం కవర్ చేస్తుంది. ప్రస్తుతం ఈ చెల్లింపునకు అర్హత సాధించాలంటే వ్యాక్సిన్ వల్ల దుష్ఫలితాలు కలిగినట్లు క్లెయిమ్ చేసిన వైకల్యం కనీసం 60 శాతం ఉండాలని యూకే ఆరోగ్య, సామాజిక సంరక్షణ విభాగం పేర్కొంది.

* WHO ప్రత్యేక పరిహార కార్యక్రమం ఎలా పనిచేస్తుంది?
ఫిబ్రవరిలో 92 తక్కువ, మధ్య-ఆదాయ దేశాలకు కోవిడ్ టీకాల కోసం నో ఫాల్ట్ పరిహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు ప్రపంచంలో ఉన్న గాయానికిచ్చే పరిహారం ఇది. ప్రతి డోసుకు లెవీ ద్వారా నిధులు సమకూరుతాయి. ఈ కార్యక్రమం జూన్ 2022 వరకు కోవాక్స్ పంపిణీ టీకాలతో సంబంధం ఉన్న అరుదైన, తీవ్రమైన ప్రతికూల సంఘటనలకు ఈ కార్యక్రమం అందుబాటులో ఉంటుంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Corona Vaccine, Covid vaccine, Covid-19, Sanjeevani

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు