Home /News /explained /

EXPLAINED MONKEYPOX SYMPTOMS USUALLY OCCUR IN THESE 4 STAGES KNOW FULL DETAILS HERE GH VB

Explained: ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్‌.. నాలుగు దశల్లో బయటపడే వ్యాధి లక్షణాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న వైరల్ వ్యాధి మంకీపాక్స్‌ (Monkeypox) అనేక దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. ఫ్లూ లాంటి లక్షణాలు, దద్దుర్లు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ఈ జబ్బు బారిన పడిన వారిలో ఎవరూ ఇప్పటివరకు మరణించలేదు. 

యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న వైరల్ వ్యాధి మంకీపాక్స్‌ (Monkeypox) అనేక దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. తాజాగా అర్జెంటీనా, ఐర్లాండ్(Ireland), మెక్సికో(Mexico) దేశాల్లోనూ తొలి మంకీపాక్స్ కేసులు (First Monkeypox Cases) నమోదయ్యాయి. న్యూయార్క్‌కు(New York) చెందిన 50 ఏళ్ల వ్యక్తి శనివారం నాడు మెక్సికోలో మంకీపాక్స్‌(Monkey Pox) బారినపడినట్టు గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ ఒక్క నెలలోనే 300 కంటే ఎక్కువ అనుమానిత, నిర్ధారించిన మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి (Disease) అనేది రోగులతో అత్యంత సన్నిహితంగా వెళ్లడం ద్వారా వ్యాపిస్తుంది. ఫ్లూ లాంటి లక్షణాలు, దద్దుర్లు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ఈ జబ్బు బారిన పడిన వారిలో ఎవరూ ఇప్పటివరకు మరణించలేదు.

Explained: ప్రభుత్వానికి RBI ట్రాన్స్‌ఫర్ చేసే డివిడెండ్‌లో భారీ తగ్గుదల.. ఈ డివిడెండ్ ఎందుకు తగ్గుతోంది..?


20కి పైగా దేశాలకు విస్తరించిన మంకీపాక్స్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచ ఆరోగ్య అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని నిపుణులు ఒత్తిడి చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కోవిడ్ 19 సమయంలో చేసినట్టు ముందస్తు తప్పులను ఇప్పుడు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్‌ను గుర్తించే విషయంలో ఆలస్యం చేస్తే అది మరింత మందికి వ్యాపించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు వైద్య నిపుణులు మంకీపాక్స్ లక్షణాలు నాలుగు దశల్లో (Four Stages) రోగులను వేధిస్తాయని తెలిపారు. అవేవో ఇప్పుడు తెలుసుకుందాం.

Ukraine-Russia: ఉక్రెయిన్‌ యుద్ధంలో పుతిన్ తన లక్ష్యాలను సాధిస్తున్నారా..?యుద్ధం ముగినట్లేనా..?


* 4 స్టేజ్‌ల్లో మంకీపాక్స్ లక్షణాలు

స్టేజ్ 1
మంకీపాక్స్ ప్రారంభ లక్షణాలు సాధారణంగా రోగికి సోకిన తర్వాత కనిపిస్తాయి. ఈ లక్షణాలు పైభాగాన ఉన్న శ్వాసకోశ వ్యవస్థతో ముడిపడి ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే, ఈ లక్షణాలు ఫ్లూతో సమానంగా ఉంటాయి. స్టేజ్‌ 1లో జ్వరం, శరీర నొప్పులు, తలనొప్పి, అలసట లక్షణాలు కనిపిస్తాయి.

Explained: QUAD అంటే ఏంటి..? చైనా దూకుడును అడ్డుకోవడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యమా..? 


స్టేజ్ 2
శరీరం ఈ ఫ్లూ లాంటి లక్షణాలతో పోరాడుతున్నప్పుడు, అనేక శోషరస గ్రంథులు బాగా వాచిపోతాయి. శరీరంలో ఇవి గడ్డల్లాగా పెద్దగా కనిపిస్తాయి.

స్టేజ్ 3
ఇలా ఏర్పడిన గడ్డలు కొంత సమయం తర్వాత చేతులు, పాదాలు, ముఖం, నోరు లేదా జననేంద్రియాలపై దద్దుర్లుగా మారతాయి.

స్టేజ్ 4
చివరి దశలో ఈ దద్దుర్లు సాధారణంగా పెరిగిన గడ్డలుగా లేదా నొప్పిపుట్టించే ఎర్రటి బుడిపెల్లాగా మారుతాయి. ఈ బుడిపెలు చీముతో నిండి ఉంటాయి.

Home Loan: హోమ్ లోన్ కావాలా? 7 శాతం లోపు వడ్డీకే రుణాలు ఇస్తున్న బ్యాంకులు ఇవే

మంకీపాక్స్ ఎంతకాలం ఉంటుంది?
డబ్ల్యూహెచ్‌వో (WHO) ప్రకారం, మంకీపాక్స్ సాధారణంగా 2 నుంచి 4 వారాల వరకు ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారు సాధారణంగా స్వల్ప లక్షణాలతో వారాల వ్యవధిలోనే కోలుకుంటారు. అయితే పిల్లలు, గర్భిణీ స్త్రీలు లేదా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తులలో ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉండొచ్చు. ఈ వ్యాధి శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు సమయం పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల వరకు సమయం కూడా పట్టొచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Explained, Monkeypox, Symptoms, Viral

తదుపరి వార్తలు