హోమ్ /వార్తలు /Explained /

Explained: స్వీడిష్ వైద్యుడికి ఇరాన్‌లో మరణశిక్ష.. అసలు ఎవరీయన? ఎందుకు అంతపెద్ద శిక్ష విధించారు?

Explained: స్వీడిష్ వైద్యుడికి ఇరాన్‌లో మరణశిక్ష.. అసలు ఎవరీయన? ఎందుకు అంతపెద్ద శిక్ష విధించారు?

Swedish-Iranian researcher Ahmad Reza Jalali (Image AP file)

Swedish-Iranian researcher Ahmad Reza Jalali (Image AP file)

Explained: స్వీడిష్ పౌరసత్వం అతన్ని కాపాడుతుందని భార్య ఆశిస్తోంది కానీ జలాలీకి స్వీడన్‌తో ఉన్న సంబంధాలే అతన్ని ఇరాన్ జైలులో పడేసినట్లు తెలుస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో ఇరాన్ కనీసం డజను మంది ద్వంద్వ జాతీయులను గూఢచర్యం ఆరోపణలపై నిర్బంధించింది.

ఇంకా చదవండి ...

ఇజ్రాయెల్‌, (Israel), ఇరాన్​ (Iran)ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం కొనసాగుతోంది. ఈ దేశాలు ఒకదానిపై ఒకటి భయంకరమైన దాడులు కూడా చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే 50 ఏళ్ల అహ్మద్ రెజా జలాలీ, (Ahmad Reza Jalali) ఇజ్రాయెల్‌కు గూఢచారిగా పనిచేస్తూ ఇరాన్ అధికారులకు అడ్డంగా దొరికాడు. ఇరాన్ ప్రభుత్వం అతడికి మే 21 నాటికి మరణ శిక్ష విధించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తన భర్త ప్రాణాలను కాపాడేందుకు విదా మెహ్రానియా శతవిధాలా ప్రయత్నిస్తోంది. అహ్మద్ రెజా ఇరాన్‌కు చెడు చేసే గూఢచారి కానీ సహోద్యోగులకు అతనొక గొప్ప డాక్టర్. ఇరానియన్-స్వీడిష్ డిజాస్టర్ మెడిసిన్ డాక్టర్, లెక్చరర్, పరిశోధకుడిగా అహ్మద్ మంచి పేరును తెచ్చుకున్నాడు. ఇలాంటి వ్యక్తికి వారం రోజుల్లో మరణశిక్ష పడుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అహ్మద్ రెజాకి 10 ఏళ్ల కొడుకు, 19 ఏళ్ల కుమార్తె ఉంది. జలాలీ స్వీడిష్ పౌరసత్వం, జలాలీ విడుదల కోసం స్టాక్‌హోమ్ చేస్తున్న ప్రయత్నాలు తన భర్త ప్రాణాలను కాపాడుతాయని మెహ్రానియా ఆశ పడుతోంది. స్వీడిష్ విదేశాంగ మంత్రి గత వారం తన ఇరాన్ కౌంటర్‌కు ఫోన్ చేసి మరణశిక్షపై వ్యతిరేకతను వ్యక్తం చేసి, జలాలీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

యూరోపియన్ యూనియన్‌ కూడా మరణ శిక్ష విధించకుండా జైలు నుంచి విడుదల చేయాలని కోరింది. ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా అనే దానిపై క్లారిటీ లేదు. స్వీడిష్ పౌరసత్వం అతన్ని కాపాడుతుందని భార్య ఆశిస్తోంది కానీ జలాలీకి స్వీడన్‌తో ఉన్న సంబంధాలే అతన్ని ఇరాన్ జైలులో పడేసినట్లు తెలుస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో ఇరాన్ కనీసం డజను మంది ద్వంద్వ జాతీయులను గూఢచర్యం ఆరోపణలపై నిర్బంధించింది.

జలాలీ కేసులో ఏం జరుగుతుంది, ఇది ఎలా ప్రారంభమైంది?

జలాలీ ఇరాన్ వాయువ్య పట్టణం తబ్రిజ్‌లో జన్మించాడు. అతను ఇటలీ, స్వీడన్‌లలో సక్సెస్‌ఫుల్‌ కెరీర్ ఏర్పరుచుకున్నాడు. మెడికల్ జర్నల్స్‌లో 40 కంటే ఎక్కువ కథనాల (Articles)ను ప్రచురించాడు. ఇటలీ, స్వీడన్‌లలో వైద్య విద్యను బోధించాడు. ఏప్రిల్ 2016లో ఒక ఇరాన్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు అతను ఆ యూనివర్సిటీలోని వర్క్‌షాప్‌కు హాజరయ్యాడు. అలా హాజరైన జలాలీ తన కుటుంబాన్ని మళ్లీ చూడలేదు.

ఇరాన్ లో అలా ల్యాండ్ అవ్వగానే అతన్ని ఇరానియన్ ఇంటెలిజెన్స్ & భద్రతా మంత్రిత్వ శాఖ ఆదేశం మేరకు సరైన వారెంట్ లేదా అరెస్టుకు కారణం లేకుండా అధికారులు అరెస్టు చేశారు. మొస్సాద్ చంపేసిన ఇరాన్ అణు శాస్త్రవేత్తల గురించిన వివరాలను జలాలీ లీక్ చేశాడని ఇరాన్ అధికారులు ఆరోపించారు. అతన్ని ఇరాన్ లోని ఎవిన్ జైలుకు తరలించారు. అక్కడ 2017 అక్టోబర్ 21న జలాలీకి మరణశిక్ష విధించడం జరిగింది.

ఇరాన్, స్వీడన్ మధ్య ఏమి జరుగుతోంది?

మొట్టమొదటిసారిగా, ఇరాన్-ఇరాక్ యుద్ధం ముగింపులో సామూహిక మరణశిక్షలను తప్పించుకున్న అనేక మంది ఇరానియన్లు స్వీడిష్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ వివాదాస్పద విచారణకు, జలాలీ మరణశిక్షకు మధ్య ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ పేర్కొంది. జలాలీ తీర్పు అంతిమం అని ఇరాన్ న్యాయశాఖ ప్రతినిధి మంగళవారం ప్రకటించారు. అతని కుటుంబీకులు కూడా కేసులతో ముడిపడి ఉన్నారని నమ్ముతారు.

ఇరాన్ విదేశీయులను ఎందుకు అదుపులోకి తీసుకుంటుంది?

నాలుగు దశాబ్దాల క్రితం, యువ ఇరాన్ విప్లవకారులు యూఎస్ ఎంబసీపై దాడి చేసి 52 మంది అమెరికన్లను 444 రోజుల పాటు బందీలుగా పట్టుకున్నారు. 1981లో వారిని విడుదల చేశారు. అయితే ఇరాన్ బందీల విధానం (Hostage-taking Policy) ఇప్పటికీ ముగిసిపోలేదని విశ్లేషకులు అంటున్నారు. విదేశాల నుంచి పరపతి లేదా మరేదైనా పొందాలనే లక్ష్యంతో విదేశీ పౌరులను ఇరాన్ నిర్బంధిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచ శక్తులతో టెహ్రాన్ అణు ఒప్పందం 2016లో అమలులోకి వచ్చినప్పుడు, నలుగురు అమెరికన్ బందీలను ఇరాన్ విడిచిపెట్టింది.

అదే రోజు, ఒబామా పరిపాలన ఇరాన్‌కు 400 మిలియన్ డాలర్ల నగదును ఒక విమానంలో పంపించారు. ఇరాన్‌కు దశాబ్దాల నాటి అప్పును యూకే తీర్చిన తర్వాతనే తమ దేశంలో బందీలుగా ఉన్న ఇద్దరు బ్రిటిష్ పౌరులను ఇరాన్ అధికారులు తిరిగి యూకేకి పంపించారు. ఈ బ్రిటిష్ పౌరులు ఇరాన్‌లో ఐదేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారు. నేడు ఇరాన్‌లో కనీసం నలుగురు అమెరికన్లు, ఇద్దరు జర్మన్లు, ఇద్దరు ఆస్ట్రియన్లు, ఇద్దరు ఫ్రెంచ్ పౌరులు నిర్బంధంలో మగ్గిపోతున్నారు.

ఖైదీలను ఉరితీసిన ఇరాన్ చరిత్ర ఏంటి?

ఇరాన్ ఉరితీతలు లేదా మరణ శిక్షలు విధించడంలో మిగతా దేశాల కంటే ముందు ఉంటుంది. గతేడాది ఇరాన్ మరణశిక్షల సంఖ్య 280కి పెరిగింది. ఇందులో కనీసం ముగ్గురు మైనర్‌లు ఉండటం గమనార్హం. అయితే విదేశీయులను ఉరితీయడం చాలా అరుదు. బయట ప్రపంచానికి తెలిసినంతవరకు గత రెండు దశాబ్దాలలో ఇరాన్ ఏ విదేశీయుడిని ఉరి తీయలేదు.

First published:

Tags: Explained, Iran, Sweden

ఉత్తమ కథలు