Home /News /explained /

EXPLAINED INTERVIEW IS ALSO CRUCIAL IN ACHIEVING A DREAM JOB HERE ARE THE TIPS FOR A BETTER PERFORMANCE IN THE INTERVIEW GH VB

Explained: గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు ప్రైవేట్ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూ కీలకం.. దీనిని ఎలా ఎదుర్కోవాలంటే..

ప్రైవేట్‌ ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్‌ రంగంలో అవకాశాలు ఇంటర్వ్యూలో చూపే ప్రతిభపై ఆధారపడి ఉంటాయి. ఇంటర్వ్యూలను సక్రమంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సలహాలు ఇవే..

ప్రైవేట్‌ ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్‌ రంగంలో అవకాశాలు ఇంటర్వ్యూలో చూపే ప్రతిభపై ఆధారపడి ఉంటాయి. ఇంటర్వ్యూలను సక్రమంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సలహాలు ఇవే..

ప్రైవేట్‌ ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్‌ రంగంలో అవకాశాలు ఇంటర్వ్యూలో చూపే ప్రతిభపై ఆధారపడి ఉంటాయి. ఇంటర్వ్యూలను సక్రమంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సలహాలు ఇవే..

డ్రీమ్‌ జాబ్‌(Dream Job) అందుకొనే క్రమంలో ఇంటర్వ్యూ(Interview)లో మెరుగైన ప్రదర్శన చేయలేక ఒక్క అడుగు దూరంలో చాలా మంది నిలిచిపోతుంటారు. ఒక ఉద్యోగానికి నలుగురు ఇంటర్వ్యూ రౌండ్‌లో పోటీ పడే అవకాశం ఉంది. ప్రైవేట్‌, ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్‌ రంగంలో అవకాశాలు కూడా ఇంటర్వ్యూలో చూపే ప్రతిభపై ఆధారపడి ఉంటాయి. ఇంటర్వ్యూలను సక్రమంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సలహాలు ఇవే..

కంపెనీ (Compeny) గురించి తెలుసుకోవాలి
ఏ కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి హాజరవుతున్నారో.. ఆ కంపెనీ గురించి ప్రాథమిక సమాచారం తెలుసుకోవడం చాలా అవసరం. ఒక అధ్యయనంలో.. 47 శాతం మంది ఇంటర్వ్యూయర్లు తమ కంపెనీ గురించి తక్కువగా తెలుసుకొని వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వరని తెలిపారు. ఒక వేళ ప్రభుత్వ ఉద్యోగానికి చెందిన ఇంటర్వ్యూ అయితే పోస్ట్ ప్రయారిటీని బట్టి ప్రతీ దానిలో అవగాహన పెంచుకోవాలి.

Explained: కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లు అంటే ఏంటి..? ఇవి ఎలా పనిచేస్తాయి? ఇవి ఎంత సెక్యూర్..?


ఉద్యోగం (Job) గురించి తెలుసుకోవాలి
దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి సంబంధించిన కీలకమైన సమాచారం తెలుసుకోవడం మేలు. ఉద్యోగ బాధ్యతలను తెలుసుకొని, విధులను ఎలా సమర్థంగా నెరవేర్చగలరో చెప్పేందుకు కొన్ని పాయింట్లు సిద్ధం చేసుకోవాలి. ఈ ఉద్యోగంలో గత అనుభవం ఉన్నట్లయితే.. క్లిష్ట సమయాల్లో మీ సేవలు ఆ సంస్థకు ఎలా ఉపయోగపడ్డాయో వివరించాలి.

బేసిక్స్‌ రివిజన్‌ చేసుకోవాలి
ఆకట్టుకునే వ్యక్తిత్వంతో పాటు, అద్భుతమైన విషయ పరిజ్ఞానం కూడా అవసరం. ఫ్రెషర్ అయినా లేదా ప్రొఫెషనల్ అయినా.. ఇంటర్వ్యూలో కొన్ని కఠినమైన ప్రశ్నలను అడిగే ఆస్కారం ఉంది. ఫ్రెషర్ అయితే సంబంధిత సబ్జెక్ట్‌లలో ఫండమెంటల్స్‌పై అవగాహన అవసరం. అనుభవం ఉన్నట్లయితే చేసిన పని, సాధించిన విజయాల గురించి తెలియజేయాలి.

పరీక్షలను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి
జాబ్ పోస్టింగ్‌లో పేర్కొన్న రాత పరీక్షలు, ప్రెజెంటేషన్‌లకు సిద్ధమవ్వాలి. ఇంటర్వ్యూలో అలాంటి పరీక్షలు నిర్వహించినా తడబడకుండా ఎదుర్కోవచ్చు.

పొటెన్షియల్‌ ఇంటర్వ్యూ ప్రశ్నలకు ప్రిపేర్‌ అవ్వాలి
చాలా ఇంటర్వ్యూలలో చాలా సాధారణ ప్రశ్నలు అడుగుతారు. వాటికి ఇచ్చే సమాధానాలపై అవకాశాలు ఆధారపడి ఉంటాయి. మీ గురించి చెప్పండి, మీరెవరో వివరించండి, నేను మిమ్మల్ని ఎందుకు నియమించుకోవాలి, మీకు ఈ ఉద్యోగం ఎందుకు కావాలి, ఐదేళ్లలో మిమ్మల్ని మీరు ఎక్కడ చూస్తారు?తదితర ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. జాబ్‌ ప్రొఫైల్, నేపథ్యం, కంపెనీ ఆధారంగా అలాంటి ప్రశ్నలకు సమాధానాలు ముందే ప్రిపేర్‌ చేసుకోవాలి.

సమయపాలన పాటించండి
ప్రొఫెషనల్‌గా కనిపించడానికి ఇంటర్వ్యూ సమయానికి ముందుగానే కంపెనీకి చేరుకోవాలి. ఆలస్యంగా వచ్చిన వ్యక్తులను ఇంటర్వ్యూకు హాజరుకాకముందే తిరస్కరిస్తారు. మీ ప్రయాణాన్ని ముందే ప్లాన్‌ చేసుకొంటే మంచిది. ట్రాఫిక్, ఇతర కారణాలతో ఇబ్బంది కాకుండా చూసుకోవాలి.

Sri Lanka : హింసాత్మకంగా ఆందోళనలు..శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించిన అధ్యక్షుడు

శ్రద్ధగా ఉండండి
కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్వ్యూయర్‌ను ఆకట్టుకోవడంలో చాలా వరకు ఉపయోగపడతాయి. ఇంటర్వ్యూయర్ చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినాలి. పరధ్యానంగా ఉండటానికి అది సమయం కాదు.

స్పష్టంగా మాట్లాడండి
కమ్యూనికేట్ చేసేటప్పుడు ప్రశాంతంగా, స్పష్టంగా మాట్లాడండి. అన్ని సమాధానాలు చెప్పాలనేలా తొందరపాటు సరికాదు. గొణుగుడు మానుకోవాలి.. ఎందుకంటే ఇది భయాందోళనకు గురిచేస్తుంది. సమాధానం తెలియకపోతే, దాని గురించి నిజాయితీగా చెప్పాలి.

మంచి బాడీ లాంగ్వేజ్ అవసరం
కమ్యునికేషన్‌ చాలా వరకు నాన్ వెర్బల్‌. వాస్తవానికి 33 శాతం ఇంటర్వ్యూయర్లు మొదటి 90 సెకన్లలో అభ్యర్థిని నియమించుకోవాలో? లేదో? నిర్ణయిస్తారు. సీటులో కూర్చోవడం, ప్రవర్తనను నిశితంగా గమనిస్తారు.

కళ్లలోకి చూసి మాట్లాడాలి
ఇంటర్వ్యూయర్‌తో మాట్లాడినప్పుడు వారిని తప్పకుండా చూడాలి. కిందికి, గోడ, గడియారం వైపు చూడవద్దు. ఆత్మవిశ్వాసం లోపించినట్లు కనిపిస్తుంది. ఇంటర్వ్యూయర్‌ కళ్లలోకి చూస్తూ మాట్లాడేందుకు ప్రయత్నించాలి.

రెజ్యూమ్‌లోని అంశాలను వివరించడం ప్రాక్టీస్‌ చేయాలి
ఇంటర్వ్యూయర్ రెజ్యూమ్‌ గురించి వివరించమని అడిగే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో తప్పులకు తావివ్వకుండా రెజ్యూమ్‌లోని కీలక అంశాలను వివరించాలి. ముందుగానే ప్రాక్టీస్‌ చేయడం మేలు.

Explained: శ్రీలంకలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది.. వాళ్ల దగ్గర డబ్బులు లేకపోవడానికి కారణం ఏంటి..?


ఎప్పుడు, ఏమి మాట్లాడాలో తెలుసుకోండి
ఇంటర్వ్యూయర్ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ జాగ్రత్తగా మాట్లాడాలి. సాధారణ యాస, పరిభాషను ఉపయోగించవద్దు. అదనంగా జాతి, మతం, రాజకీయాలకు సంబంధించిన భావాలను ప్రస్తావించకపోవడం ఉత్తమం. మర్యాదపూర్వకంగా, అధికారిక పద్ధతిలో స్పందించాలి.

సరైన ప్రశ్నలను అడగండి
ఇంటర్వ్యూలో ఏవైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే అడగమని ఇంటర్వ్యూయర్ కోరవచ్చు. సంబంధిత ప్రశ్నలను మాత్రమే అడిగేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగ బాధ్యతలు, కంపెనీ గురించి మాత్రమే అయి ఉండాలి. అనవసరమైన ప్రశ్నలు అడగకూడదు.
Published by:Veera Babu
First published:

Tags: Central Government Jobs, Explained, Interview, Private Jobs, Tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు