ఉక్రెయిన్‌పై(Ukraine) యుద్ధానికి దిగిన రష్యాపై(Russia) అమెరికా సహా పలు యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పశ్చిమ దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా వాటికి ప్రత్యామ్మాయాలు చూసుకొని ఉక్రెయిన్ను లొంగదీసుకొనే పనిలోనే రష్యా ఉంది. అతిపెద్ద ఆర్థిక బ్రహ్మాస్త్రంగా భావించే ‘స్విఫ్ట్ బ్యాన్’ను కూడా పశ్చిమ దేశాలు ప్రయోగించాయి. ఈ ఆర్థిక యుద్ధంలో ఓటమే రష్యాకు ఎక్కువ నష్టం కలగజేస్తుంది. రష్యాపై దాదాపు 5,532 ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఇందులో భాగంగానే అమెరికన్ కార్డ్ నెట్వర్క్ ఆపరేటర్స్(Operators) Visa, Mastercard, American Express తమ సేవలను రష్యాలో నిలిపివేశాయి. వీటికి ప్రత్యామ్నాయాల కోసం రష్యా పూర్తిగా చైనాపై ఆధారపడే పరిస్థితి నెలకొంది.
వీసా, మాస్టర్కార్డులను రష్యాలో వినియోగించవచ్చా?
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులు ఈ కార్డు నెట్‌వర్క్‌లపై రష్యన్ ప్రజలకు అందించిన కార్డులు రష్యాలోని పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్, ఏటీఎం కేంద్రాలలో పని చేయవు. అదే విధంగా రష్యన్ బ్యాంకుల ద్వారా ఈ నెట్‌వర్క్‌లపై మంజూరు అయిన కార్డులు ప్రపంచంలో మరెక్కడా పని చేయవు.
వీసా, మాస్టర్‌కార్డులకు రష్యాలో ప్రత్యామ్నాయాలు ఉన్నాయా?
2014లోనూ రష్యాపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ సమయంలో కూడా వీసా, మాస్టర్‌కార్డు సేవలను కంపెనీలు రష్యా బ్యాంకులకు ఆపేశాయి. అప్పుడు మాస్కో కొత్త పేమెంట్ సిస్టమ్ మిర్‌ను అభివృద్ధి చేసింది. 2015లో ఈ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే చైనాకు చెందిన యూనియన్‌పే(UnionPay) పేమెంట్ సిస్టమ్ కూడా రష్యాలో వినియోగంలో ఉంది. ఇప్పటికే చైనా పేమెంట్ సిస్టమ్ 180కి పైగా దేశాల్లో అందుబాటులో ఉంది.
స్విఫ్ట్‌కు ప్రత్యామ్నాయంగా SPFS
2014లో క్రిమియాను రష్యా ఆక్రమించిన తర్వాత పశ్చిమ దేశాలు స్విఫ్ట్ నుంచి బ్యాన్ విధిస్తామని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ అంశం రష్యాను ఆలోచనలో పడేసింది. అప్పటి నుంచి సొంతంగా ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది. దీనిని SPFS (సిస్టమ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫైనాన్షియల్ మెసేజెస్)గా వ్యవహరిస్తోంది. గతేడాది రష్యా సెంట్రల్ బ్యాంక్ దీనిపై స్పందిస్తూ.. అంతర్ బ్యాంకింగ్ మెసేజ్‌లను ఇది అత్యంత తేలిగ్గా బదిలీ చేస్తోందని పేర్కొంది.
అంతర్జాతీయ అనుసంధానత తక్కువ..
SPFS వ్యవస్థకు అంతర్జాతీయ అనుసంధానత తక్కువగా ఉంది. సుమారు 400 బ్యాంకులు మాత్రమే దీనికి అనుసంధానమై ఉన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. ప్రస్తుతం ఆర్మేనియా, టర్కీ, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్ వంటి దేశాలు మాత్రమే ఉన్నాయి.
ALSO READ Russsia enemy countries : రష్యా శత్రుదేశాలు ఇవే..లిస్ట్ విడుదల చేసిన పుతిన్
ఈ ఆంక్షలతో ప్రభావం ఎంత?
ఇప్పటి వరకు ఆంక్షల ప్రభావం తమపై పెద్దగా లేదనే తీరునే రష్యా ప్రదర్శిస్తోంది. షాపర్స్ తమ వీసా, మాస్టర్ కార్డులను రష్యాలో ఆ కార్డులు ఎక్స్పైరీ అయ్యే వరకు వినియోగించవచ్చని చెబుతోంది. అయితే ఇతర దేశాలు మంజూరు చేసిన కార్డులు రష్యాలో పని చేయవని అమెరికా నెట్వర్క్ సంస్థలు ప్రకటించాయి. చైనా నెట్వర్క్ సంస్థలను పక్కనపెడితే వీసా, మాస్టర్‌కార్డులే ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న డెబిట్, క్రెడిట్ కార్డులలో 90 శాతం ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia, Russia-Ukraine War, Visa