ZyCoV-D Vaccine: కరోనా థర్డ్ వేవ్ త్వరలో రాబోతోందనే ఊహాగానాల మధ్య.. కోవిడ్ వ్యాక్సిన్లను విస్తృతంగా ప్రజలకు అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా భారత ఫార్మా కంపెనీ జైడస్ కాడిలా అభివృద్ధి చేసిన ZyCoV-D వ్యాక్సిన్ వినియోగానికి కేంద్రం అత్యవసర అనుమతులు ఇచ్చింది. DNA ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసిన మొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ టీకాను 12 ఏళ్లు నిండిన వారందరికీ అందించవచ్చు. ఈ వ్యాక్సిన్‌కు మరో ప్రత్యేకత ఉంది. మిగతా టీకాలలా దీన్ని సూది ద్వారా శరీరంలోకి ఇంజెక్ట్ చేయరు. సూది గుచ్చకుండానే చర్మం లోపలి పొరల్లోకి మందు పంపిస్తారు. ఈ ఇంట్రాడెర్మల్ వ్యాక్సిన్‌తో ఎక్కువ మందికి తక్కువ సమయంలో టీకాలు అందించవచ్చని జైడస్ సంస్థ తెలిపింది.
* ఎలా పనిచేస్తుంది?
జైకోవ్-డీ వ్యాక్సిన్‌ను సూది అవసరం లేకుండానే ప్రజలకు అందించవచ్చు. ఈ విధానం కోసం జైడస్ సంస్థ కొలరాడోకు చెందిన ఫార్మా జెట్ కంపెనీ తయారు చేసిన సూది రహిత వ్యవస్థను (needle-free system) ఉపయోగిస్తుంది. ఈ విధానానికి 2017లోనే ఐరోపాలో ఆమోదం లభించింది. ఇందులో భాగంగా 'ట్రోపిస్' అనే నిర్దిష్ట మోడల్‌ను ఉపయోగిస్తారు.
.@DBTIndia supported #ZyCoV-D developed by @ZydusUniverse Receives Emergency Use Authorization from #DCGI.
The World’s First #COVID19 DNA vaccine developed in partnership with @BIRAC_2012 under #MissionCOVIDSuraksha.
?? https://t.co/SdhHuDEMrp #AtmanirbharBharat #ZyCoVD pic.twitter.com/UNychHxX2V
— PIB In Bihar ?? Mask yourself ? (@PIB_Patna) August 20, 2021
* ట్రోపిస్ నీడిల్-ఫ్రీ సిస్టం అంటే ఏంటి?
ట్రోపిస్ మోడల్.. టీకాలను ఇంట్రాడెర్మరీ విధానంలో అందిస్తుంది. ఈ పద్ధతిలో సూదులను ఉపయోగించకుండా వ్యాక్సిన్లను అధిక పీడనం దగ్గర చర్మం లోపలి పొరల్లోకి పంపిస్తారు. ఇందులో ఇంజెక్టర్, సూది లేని సిరంజి, ఫిల్లింగ్ అడాప్టర్ వంటి మూడు భాగాలు ఉన్నాయి. వీటి ద్వారా వ్యాక్సిన్‌ను నాలుగు దశల్లో అందిస్తారు. ముందు ఇంజెక్టర్‌ను సిద్ధం చేసి, సిరంజీలో మందు నింపుతారు. ఇంజెక్టర్‌ను లోడ్ చేసి, నిర్ధిష్ట డెల్టాయిడ్ ప్రాంతంలో (కండరాలకు) సూది లేకుండానే ఇంజెక్షన్ ఇస్తారు.
* నీడిల్-ఫ్రీ ఇంజెక్టర్ లాభాలేంటి?
ఈ విధానంలో సిబ్బందికి తక్కువ శిక్షణ అవసరమవుతుంది. దీంతోపాటు తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వ్యాక్సిన్లకు సంబంధించిన భయాందోళనలు తగ్గిస్తుంది. ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి నీడిల్స్ ద్వారా ఎదురయ్యే గాయాల ప్రమాదం ఉండదు. ఈ నీడిల్-ఫ్రీ సిరంజీ ఆటో డిసేబుల్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఒకసారి ఉపయోగించిన తరువాత, మళ్లీ వీటిని ఉపయోగించే అవకాశం లేదు.
ఇది కూడా చదవండి: Video: ఒక్క ఆలూ చిప్స్ ముక్కకు రూ.14 లక్షలు ఇచ్చిన కంపెనీ.. ఎందుకంటే.!
ఈ టెక్నాలజీ కారణంగా డిస్పోజబుల్ సిరంజిలను ప్రమాదవశాత్తు లేదా ఉద్దేశపూర్వకంగా తిరిగి ఉపయోగించే ప్రమాదం తప్పుతుంది. సూదులకు భయపడి వ్యాక్సిన్ తీసుకోని వారికి ఈ టీకా ఉపశమనం కల్పిస్తుంది. దీంతోపాటు ఇంజెక్షన్ల వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలు ఈ విధానంలో ఎదురుకావు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid vaccine, Covid-19