Home /News /explained /

EXPLAINED HOW WEBB TELESCOPE SEEKS TO UNLOCK UNIVERSE SECRETS GH VB

Explained: జేమ్స్ వెబ్ టెలిస్కోప్.. విశ్వ రహస్యాలను ఎలా అన్వేషిస్తుంది..? ఇందులో ఉన్న సీక్రెట్ ఏంటి..?

telescope

telescope

శక్తిమంతమైన జేడబ్ల్యూఎస్టీ, హబుల్ టెలిస్కోపులను శాస్త్రవేత్తలు టైమ్ మెషిన్ తో పోలుస్తుంటారు. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ.. సుదూరంగా ఉన్న విశ్వంలోని అనేక ప్రాంతాల నుంచి కాంతి భూమిని చేరడానికి కొన్ని కోట్ల సంవత్సరాల పడుతుంది. ఆ పురాతన కాంతిని ఒడిసిపట్టడం ద్వారా మునుపటి పరిస్థితులను తెలుసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
అంతరిక్షంలో మానవుని అన్వేషణకు మరో ముందడుగు పడింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన టెలిస్కోపును నాసా శాస్త్రవేత్తలు విశ్వంలో ప్రయోగించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్(జేడబ్ల్యూఎస్టీ)ని దక్షిణాఅమెరికా ఫ్రెంచ్ గయానా కౌరు వేదికగా ఏరియానా-5 రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు. ఖగోళ రహస్యాలు, విశ్వ ఆవిర్భావం నాటి గుట్టును తెలుసుకోవడానికి ఈ టెలిస్కోపు కీలక పాత్ర పోషించనుంది. వీటితో పాటు బిగ్ బ్యాంగ్ తర్వాత నక్షత్రాలు, గెలాక్సీ పుట్టుకకు సంబంధించిన రహస్యాలను ఆవిష్కరించనుంది. ఇందుకోసం ఈ టెలిస్కోపులో ఎన్నో కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను పొందుపరిచారు.

New Year Mobile Phones: జనవరిలో కొత్త స్మార్ట్ ఫోన్ల పండుగ.. ఫీచర్లు అదిరిపోయాయిగా.. ఆ వివరాలివే..


స్పేస్ లో టైమ్ మెషిన్..
శక్తిమంతమైన జేడబ్ల్యూఎస్టీ, హబుల్ టెలిస్కోపులను శాస్త్రవేత్తలు టైమ్ మెషిన్ తో పోలుస్తుంటారు. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ.. సుదూరంగా ఉన్న విశ్వంలోని అనేక ప్రాంతాల నుంచి కాంతి భూమిని చేరడానికి కొన్ని కోట్ల సంవత్సరాల పడుతుంది. ఆ పురాతన కాంతిని ఒడిసిపట్టడం ద్వారా మునుపటి పరిస్థితులను తెలుసుకోవచ్చు.

PPF Account: పోస్టాఫీసులో పీపీఎఫ్​ అకౌంట్ ఓపెన్​ చేయాలా.. అయితే ఆన్​లైన్​లో ఈ స్టెప్స్​ ఫాలో అవ్వండి..


ముఖ్యంగా కాంతిలో ఉండే రసాయన చర్యలను, తరంగదైర్ఘ్యాలను పరిశీలించడం ద్వారా విశ్వ ఆవిర్భావాన్ని వెలుగులోకి తీసుకురావచ్చు. 1380 కోట్ల ఏళ్ల క్రితం బిగ్ బ్యాంగ్ విస్ఫోటనంతో విశ్వం ఏర్పడిందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఆ సిద్ధాంతాన్ని ఈ టెలిస్కోపు పరిశీలిస్తుంది. నక్షత్రాలు, గ్రహాల తీరుతెన్నులను చూపుతుంది.

జేమ్స్ వెబ్ టెలిస్కోపు నక్షత్రాలు, ఖగోళ వస్తువులు, గెలాక్సీలను క్యాప్చర్ చేసి విశ్వ ప్రారంభ విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించనుంది. 1990 నుంచి పనిచేస్తున్న హబుల్ టెలిస్కోపు గ్రహాలు, నక్షత్రాల, గెలాక్సీల నిర్మాణం, విధ్వంసం లాంటి విషయాలను బహిర్గతపరిచింది. ఖగోళంలో ముఖ్యమైన ఫోటోలను తీసింది. దీనికంటే భారీగా, శక్తిమంతంగా జేబ్స్ వెబ్ టెలిస్కోపును శాస్త్రవేత్తలు తయారు చేశారు.

Home Loan: హోంలోన్ త్వరగా రావాలంటే.. ఈ విషయాలపై దృష్టి పెట్టండి..


జేడబ్ల్యూఎస్టీ ఇన్ ఫ్రారెడ్ నేత్రంతో విశ్వంలోని విషయాలను క్యాప్చర్ చేసి భూమిపైకి పంపుతుంది. సూర్యకాంతిలో మండిపోకుండా మైనస్ 200 నుంచి 230 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లగా ఉంచేందుకు సిలికాన్, అల్యూమినియంతో చేసిన సౌర కవచాన్ని దీనికి పొందుపరిచారు. ఇందులో ఐదు పొరలు ఉంటాయి. 22 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది. అంటే టెన్నిస్ కోర్టు పరిమాణంలో ఉంటుంది.

ప్రత్యేకమైన స్థావరంలో..
భూమి నుంచి మైళ్ల దూరంలో ఉన్న అంతరిక్షంలోని ఎల్2(లాంగ్ రేంజ్ పాయింట్) అని పిలిచే ప్రత్యేక ప్రదేశంలో దీన్ని ఉంచుతారు. భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తులు సాపేక్షంగా స్థిరంగా ఉన్న ప్రదేశంలో టెలిస్కోప్‌ను ప్రవేశపెట్టారు. ఇది భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అత్యంత శీతల ప్రదేశంలోనూ మెరుగైన పనితీరును కనబర్చేలా దీన్ని డిజైన్ చేశారు. ఎల్2 ప్రదేశాన్ని చేరడానికి జేడబ్ల్యూఎస్టీకి రెండు వారాల సమయం పడుతుంది. అక్కడ భూమి పక్కనే ఉంటూ 365 రోజులకోసారి సూర్యుడిని చుట్టి వస్తుంది.

Results: త్వరలోనే 10, 12వ తరగతి టర్మ్‌-1 రిజల్ట్స్.. ఫలితాలు ఎప్పుడు, ఎక్కడ రిలీజ్ అవుతాయంటే..


జేమ్స్ వెబ్ టెలిస్కోపు టూల్స్..
ఇందులో ఇన్ ఫ్రారెడ్ కెమెరా ఉంది. ఇది ఖగోళ వస్తువుల ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. అంతేకాకుండా స్పెక్ట్రోమీటర్ ఇన్ ఫ్రారెడ్ లైట్ ను విశ్లేషణ చేసి వివిధ రంగుల్లోకి విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో పాటు మిడ్ ఇన్ ఫ్రారెడ్ ఇమేజర్ సహాయంతో కొత్తగా పుట్టుకొస్తున్న నక్షత్రాల గురించి తెలుసుకోవచ్చు. నక్షత్రాలకు సమీపంలో ఉండే గ్రహ వ్యవస్థల అధ్యయనం కోసం నియర్ ఇన్ ఫ్రారెడ్ ఇమేజింగ్ స్లిట్ లెస్ స్పెక్టోగ్రాఫ్ ఉపయోగించారు.
Published by:Veera Babu
First published:

Tags: NASA, Science, Telescope

తదుపరి వార్తలు