హోమ్ /వార్తలు /Explained /

Quad Summit: క్వాడ్ కూటమి ఎలా ఏర్పడింది...ఈ కూటమి లక్ష్యాలేంటి..పూర్తి విశ్లేషణ..

Quad Summit: క్వాడ్ కూటమి ఎలా ఏర్పడింది...ఈ కూటమి లక్ష్యాలేంటి..పూర్తి విశ్లేషణ..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

2004లో హిందూమహా సముద్రంలో సునామీ ఉదంతం అనంతరం భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు విపత్తు సహాయక చర్యల నిర్వహణలో భాగంగా ఈ కూటమిని ఏర్పాటుకు తొలి అడుగు వేశాయి.

ప్రతిష్టాత్మక క్వాడ్ సదస్సు (Quad Summit) సెప్టెంబరు 24న జరగనుంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి అమెరికా  (United States) ప్రెసిడెంట్ జో బైడెన్ (Joe Biden) ఆతిథ్యం ఇవ్వనున్నట్లు శ్వేతసౌధం సోమవారం ప్రకటించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi),  ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ (Scott Morrison) , జపాన్ ప్రధాని యోషిహిదే (Yoshihide Suga) దీనికి హాజరుకానున్నారు. కోవిడ్-19 సంక్షోభాన్ని (Covid 19 Pandemic) ఎదుర్కోవడం, వాతావరణ మార్పులు, ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో సైబర్ స్పేస్, సెక్యూరిటీ లాంటి అంశాలను ఈ సమావేశంలో క్వాడ్ నాయకులు చర్చించనున్నారని వైట్ హౌస్ ప్రకటన పేర్కొంది. మార్చిలో క్వాడ్ నాయకులు వర్చువల్ ఫార్మాట్‌లో ఈ శిఖరాగ్ర సదస్సును నిర్వహించారు. నాలుగు దేశాలు భాగస్వాములైన ఈ కూటమి ఎప్పుడు, ఎలా ఏర్పడింది, లక్ష్యాలేంటి లాంటి విషయాలు తెలుసుకుందాం.

క్వాడ్ ఏర్పాటుకు దారితీసిన అంశాలు ?

2004లో హిందూమహా సముద్రంలో సునామీ ఉదంతం అనంతరం భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు విపత్తు సహాయక చర్యల నిర్వహణలో భాగంగా ఈ కూటమిని ఏర్పాటుకు తొలి అడుగు వేశాయి. 2007లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ లేదా క్వాడ్‌గా ఈ కూటమి పేరును నిర్వచించారు. క్వాడ్.. ఏషియన్ ఆర్క్ ఆఫ్ డెమోక్రసీని స్థాపించాల్సి ఉంది. అయితే సభ్యుల మధ్య సమన్వయం లేకపోవడం, చైనాకు వ్యతిరేక కూటమి అనే ఆరోపణలు లాంటి కారణాల వల్ల ఆ చర్య ముందుకు వెళ్లలేదు. మొదట్లో సముద్ర భద్రతపైనే ఈ కూటమి దృష్టి పెట్టింది. అనంతరం కనుమరుగైంది.

చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలనే తలంపుతో 2017లో తిరిగి ఈ నాలుగు దేశాలు క్వాడ్‌ను పునరుద్ధరించాయి. అంతర్జాతీయ నియమాలకు అనుగుణంగా ఓ యంత్రాంగాన్ని సృష్టించాయి. అయితే క్వాడ్ మల్టీ లేటరల్ ఆర్గనైజేషన్ మాదిరిగా అభివృద్ధి కాలేదు. ఈ కూటమికి సచివాలయం లేదు, శాశ్వత నిర్ణయం తీసుకునే అధికారం లేదు. యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్యసమితి తరహాలో క్వాడ్ దేశాల సభ్యుల మధ్య ఒప్పందాలను విస్తరించడం, వారి భాగస్వామ్యాలను మెరుగుపరచడం లాంటి అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంది.

నాటో మాదిరిగా క్వాడ్ కూటమికి సమిష్టి రక్షణ నియామవళి లేదు. కానీ ఐక్యత, దౌత్య సంబంధాల కోసం ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంది. 2020లో భారత్, అమెరికా, జపాన్ దేశాలు త్రైపాక్షిక నావికా విన్యాసాలను నిర్వహించాయి. 2017లో తిరిగి ఏర్పాటైన తర్వాత సైనిక విన్యాసాలు నిర్వహించడం ఇదే తొలిసారి.

AUKUS Alliance: చైనాకు కౌంటర్‌గా అకూస్ కూటమి.. అగ్రరాజ్యంతో కలిసి ఆ రెండు దేశాలు..క్వాడ్ లక్ష్యాలు ఏవి ?

మార్చిలో 'ద స్పిరిట్ ఆఫ్ ద క్వాడ్' అనే థీమ్‌తో కూటమిలోని నాలుగు దేశాలు సమావేశమయ్యాయి. ఇందులో కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవడం, ప్రత్యేకించి వ్యాక్సిన్ డిప్లమసీని మెరుగుపరచడం, వాతావరణ మార్పులు, పర్యావరణ హితం కోసం పెట్టుబడులు పెట్టడం, సాంకేతిక ఆవిష్కరణలను పెంచడం లాంటి అంశాలను చర్చించారు. దీంతోపాటు దక్షిణ కొరియా, న్యూజిలాండ్, వియాత్నాంలను క్వాడ్ ప్లస్ గా విస్తరించడానికి సుముఖత వ్యక్తం చేశారు.

ధనిక దేశమైన బ్రిటన్‌లో ఆహార పదార్థాల కొరత.. సమస్యకు కారణాలు ఏంటి ?


అయితే విస్తృత సమస్యలకు క్వాడ్ కట్టుబడి ఉన్నప్పటికీ.. ఈ కూటమి ప్రధాన లక్ష్యం చైనాకు అడ్డుకట్ట వేయడమే. ఈ కూటమిలో ప్రతి దేశానికి చైనాతో విభేదాలకు వేర్వేరు కారణాలు ఉండటంతో డ్రాగన్ దేశాన్ని ముప్పుగా పరిగణిస్తున్నారు. అంతేకాకుండా బీజింగ్ పురోగతులను అరికట్టడానికి కూటమి దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

క్వాడ్‌ కూటమిపై చైనా వైఖరి ఎలా ఉంది ?

క్వాడ్ ఏర్పాటును చైనా మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. 13 ఏళ్లుగా ఈ కూటమి ఆంతర్యాన్ని ప్రశ్నిస్తోంది. 2018లో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ క్వాడ్ ను 'గ్రాబింగ్ ఐడియా' గా అభివర్ణించింది. ఆసియాలోని ప్రాంతీయ శక్తుల మధ్య విభేదాలను ఈ కూటమి ప్రేరేపిస్తుందని ఈ సంవత్సరం ప్రారంభంలో ఆరోపించింది. క్వాడ్ కూటమికి సహకరించకుండా బంగ్లాదేశ్ లాంటి దేశాలపై ఒత్తిడి చేసింది.

దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ చర్యలు, వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టు లాంటి కార్యక్రమాల గురించి ఇతర దేశాలను క్వాడ్ సభ్య దేశాలు హెచ్చరిస్తున్నాయి. అంతర్జాతీయంగా చైనాతో పోటీ విషయంలో అమెరికా చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తుంది. దక్షిణ, తూర్పు చైనా సముద్రంలో డ్రాగన్ ఆగడాలు జపాన్, ఆస్ట్రేలియా దేశాలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. 2018లో ఆస్ట్రేలియా వాణిజ్యాన్ని కాన్ బెర్రాకు మాత్రమే పరిమితం చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా తగ్గాయి.

చైనాతో భూసరిహద్దును పంచుకుంటున్న ఏకైక క్వాడ్ దేశం భారత్ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగడాన్ని మన దేశం సహించడం లేదు. అయితే క్వాడ్ చైనాకు వ్యతిరేక కూటమి అనుకున్నప్పటికీ, దీనికి తగ్గట్లు ఈ దేశాలు ప్రత్యక్షంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ పరోక్షంగా టీకా అభివృద్ధి, క్లిష్టమైన సాంకేతికతలపై వర్కింగ్ గ్రూపులను క్వాడ్ ఏర్పాటు చేయడం లాంటి అంశాలు చైనాను నిరోధించే ప్రయత్నాలేనని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Published by:Krishna Adithya
First published:

Tags: Australia, China, India, Japan, Joe Biden, Pm modi, United states

ఉత్తమ కథలు