Home /News /explained /

EXPLAINED HOW TO LINK YOUR PASSPORT WITH YOUR COVID 19 VACCINE CERTIFICATE MK GH

Vaccine Certificate: పాస్‌పోర్ట్‌కు వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను ఎలా లింక్ చేయాలి? తెలుసుకోండి...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను పాస్‌పోర్ట్‌తో లింక్ చేసుకుంటే.. ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు ఇబ్బందులు ఎదురుకావు. ఈ నేపథ్యంలో పాస్‌పోర్ట్‌తో వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను ఎలా లింక్ చేయాలో చూద్దాం.

కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ఇప్పుడిప్పుడే సర్దుకుంటోంది. పూర్తిగా కాకపోయినా చాలా రాష్ట్రాలు ఆంక్షలను సడలించాయి. మరికొన్ని రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఆ తరువాత ఇతర దేశాలకు ప్రయాణాలు కూడా ప్రారంభమవుతాయని అధికారులు భావిస్తున్నారు. అయితే విదేశాలకు ప్రయాణాలు చేయాలంటే ఇప్పటివరకు పాస్‌పోర్ట్‌, వీసా ఉంటే సరిపోయేది. రానున్న రోజుల్లో వీటికి అదనంగా మరో కీలక పత్రం కూడా మీ దగ్గర ఉండాలి. అదే కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్. ఈ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను పాస్‌పోర్ట్‌తో లింక్ చేసుకుంటే.. ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు ఇబ్బందులు ఎదురుకావు. ఈ నేపథ్యంలో పాస్‌పోర్ట్‌తో వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను ఎలా లింక్ చేయాలో చూద్దాం.

పాస్‌పోర్ట్‌తో వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఎలా లింక్ చేయాలి?

మీరు ఇప్పటికే వేరే ఫొటో ఐడీని ఉపయోగించి టీకా తీసుకుంటే.. అధికారిక కోవిన్ వెబ్ సైట్ (www.cowin.gov.in) ద్వారా అకౌంట్‌కు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత 'అకౌంట్ డీటేల్స్' విభాగంలో 'రెయిజ్ ఇష్యూ' అనే బటన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు సర్టిఫికెట్ కరెక్షన్, మెర్జ్ మల్టిపుల్ డోస్ ప్రొవిజనల్ సర్టిఫికెట్స్, యాడ్ లింక్ డీటెల్స్.. అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో 'యాడ్ పాస్‌పోర్ట్‌ డీటేల్స్' అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

ఇక్కడ కనిపించే డ్రాప్ డౌన్ మెనూలో 'ఎంటర్ బెనిఫిషియరీ పాస్ పోర్ట్ నంబర్’ అనే విభాగంలో.. సభ్యుడి పేరు, పాస్ పోర్టు నంబరును నమోదు చేయాలి. మీరు సరైన నెంబరునే ఎంటర్ చేశారని నిర్ధారించుకోవాలి. ఎందుకంటే సర్టిఫికేట్ ఫొటో ఐడీ వివరాలను మార్చడానికి ఒకసారి మాత్రమే అనుమతి ఉంటుంది.

అనంతరం పాస్‌పోర్ట్‌ నెంబరు వివరాలను మరోసారి తనిఖీ చేసుకున్న తర్వాత 'ఐ డిక్లేర్ దట్ దిస్ పాస్ పోర్ట్ బిలాంగ్స్ టూ ద బెనిఫిషయరీ' అనే ఆప్షన్‌ పక్కన ఉన్న బాక్స్ లో టిక్ మార్కును పొందుపరచాలి. దీని తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. మీ అభ్యర్థన సబ్మిట్ చేశారని ధ్రువీకరించేందుకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు మెసేజ్ వస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన అయిన తర్వాత 'మీ అభ్యర్థన విజయవంతంగా అప్‌డేట్ అయింది' అని పేర్కొంటూ మరో మెసేజ్ వస్తుంది.

అనంతరం అకౌంట్ డీటెయిల్స్ కు వెళ్లి సర్టిఫికేట్ బటన్ పై క్లిక్ చేయండి. మీరు మీ పాస్ పోర్టుకు లింక్ చేసిన కొత్త వ్యాక్సిన్ ప్రమాణ పత్రాన్ని డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇంకా కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోనివారు త్వరలో ప్రయాణాలు చేయాల్సి ఉంటే.. వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకునేటప్పుడు మీ పాస్‌పోర్ట్‌ను ఫొటో ఐడీ ప్రూఫ్‌గా ఎంచుకోవచ్చు.

పాస్‌పోర్ట్‌కు వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను ఎందుకు లింక్ చేయాలి?
విదేశాల్లో ఉద్యోగాలకు, చదువుకునేందుకు, టోక్యో ఒలింపిక్స్ లేదా ఇతర కారణాలతో వెళ్తుంటే పాస్ పోర్టుతో లింక్ చేసిన వ్యాక్సిన్ సర్టిఫికేట్ చాలా అవసరమవుతుంది. ముఖ్యంగా మీరు బయలుదేరే సమయంలో వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అనే వివరాలు అడగవచ్చు. కోవిడ్ టీకా వేసుకున్న తర్వాతే మీరు భారత్ నుంచి వెళ్తున్నారని ధ్రువీకరించడానికి అధికారులకు ఇది సహాయపడుతుంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Passport

తదుపరి వార్తలు