Home /News /explained /

EXPLAINED HOW THE RAJYA SABHA ELECTIONS WILL BE HELD KNOW FULL DETAILS OF ELECTIONS HERE GH VB

Explained: రాజ్యసభ ఎన్నికలు ఎలా జరుగుతాయి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

Rajya Sabha elections

Rajya Sabha elections

రాజ్యసభ ఎన్నికలు(Rajya Sabha Elections) దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు వివిధ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. జూన్- ఆగస్టు మధ్య సభ్యుల పదవీ విరమణ కారణంగా ఖాళీ అయ్యే 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి.

రాజ్యసభ ఎన్నికలు(Rajya Sabha Elections) దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు వివిధ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. జూన్- ఆగస్టు(June-August) మధ్య సభ్యుల పదవీ విరమణ కారణంగా ఖాళీ అయ్యే 57 రాజ్యసభ(Rajya Sabha) స్థానాలకు జూన్ 10న ఎన్నికలు(Elections) జరగనున్నాయి. ఇప్పటికే 41 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంకా 16 స్థానాలు ఖరారు కావాల్సి ఉంది. లోక్‌సభ(Lok Sabha) సభ్యులను సాధారణ ఎన్నికల సమయంలో ప్రత్యక్ష ఓటింగ్(Voting) ద్వారా ఓటర్లు(Voters) ఎన్నుకుంటారు. అయితే రాజ్యసభలో ఓటింగ్ భిన్నమైన పద్ధతిని అనుసరిస్తుంది.

ఎవరు ఓటు వేయగలరు?
రాజ్యసభకు పరోక్ష ఎన్నికలు జరుగుతాయి, కేవలం రాష్ట్ర శాసన సభలకు ఎన్నికైన సభ్యులు మాత్రమే ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. ఇది సింగిల్‌ ట్రాన్స్‌ఫరబుల్‌ ఓటు(Single Transferable Vote) ద్వారా నిర్వహిస్తారు. ఎగువ సభలో మెజారిటీ పార్టీ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉండకుండా ఉండడానికి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పార్టీల ఎంపీల కూటమి తమకు అవసరమైన సభ్యులను ఎన్నుకుని, రాజ్యసభకు పంపవచ్చు.ప్రక్రియ ఇలా..
రాజ్యసభ ఓటింగ్ కొంచెం సంక్లిష్టమైనది. ఎన్నికలలో పాల్గొనే మొత్తం అభ్యర్థుల కంటే ఖాళీల సంఖ్య తక్కువగా ఉన్నట్లయితే మాత్రమే ప్రక్రియ మొదలవుతుంది. ప్రతి పక్షాల అసెంబ్లీ బలం ఇప్పటికే తెలిసినందున ఏ పార్టీ గెలుస్తుందో అంచనా వేయడం చాలా సులభం. ఉదాహరణకు అధికార పార్టీ, దాని మిత్రపక్షాలు మొత్తం సీట్లలో 60 శాతం ఆధిక్యత కలిగి ఉంటే, రాజ్యసభ ఎన్నికల్లో 10 స్థానాల్లో పోటీ చేస్తే, అధికార పార్టీ ఆరు స్థానాలు, ప్రతిపక్షం నాలుగు స్థానాలను కైవసం చేసుకుంటాయి.
సింగిల్‌ ట్రాన్స్‌ఫరబుల్‌ ఓట్‌ సూత్రం ద్వారా ఓటర్లు ప్రాధాన్యతా క్రమంలో ఎంతమంది అభ్యర్థులకైనా ఓటు వేయవచ్చు.

Germany-Ukraine: IRIS-T SLM అంటే ఏంటి..? ఉక్రెయిన్ కు ఈ IRIS-T SLMను అందించనున్న జర్మనీ..

ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల్లో గెలవడానికి నిర్దిష్ట సంఖ్యలో మొదటి ప్రాధాన్యత ఓట్లను దక్కించుకోవాల్సి ఉంటుంది. ఇది ఓటర్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. మొదటి రౌండ్ పోల్స్‌లో, ప్రతి మొదటి ప్రాధాన్యత ఓటు విలువ 100 పాయింట్లుగా నిర్ణయిస్తారు. అభ్యర్థి ఓటు వేసిన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యను ఎన్నికలు జరిగే సీట్ల సంఖ్యతో డివైడ్‌ చేయడం ద్వారా పొందిన కోటీన్ కంటే ఒక పాయింట్ ఎక్కువ సాధించాలి. ఉదాహరణకు 220 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును ఉపయోగించుకుంటూ, 10 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నట్లు అయితే, అభ్యర్థి 220/(10+1) = 22 ఓట్లు లేదా 2200 వాల్యూ పాయింట్లను సాధించాలి.

మొదటి రౌండ్ ఓటింగ్ తర్వాత ఫలితాలు చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ, అభ్యర్థులు పేర్కొన్న నంబర్‌ను క్లియర్ చేయడంలో విఫలమైతే ప్రక్రియ రెండో రౌండ్‌లోకి ప్రవేశించవచ్చు. సభ్యుడిని ఎంపిక చేసిన తర్వాత, అతని లేదా ఆమె జాబితాలోని మిగులు ఓట్లు తగ్గిన విలువతో ప్రాధాన్యత జాబితా క్రమాన్ని అనుసరించి తదుపరి సభ్యునికి బదిలీ చేస్తారు.

Ukraine-Russia: ఉక్రెయిన్‌ యుద్ధంలో పుతిన్ తన లక్ష్యాలను సాధిస్తున్నారా..?యుద్ధం ముగినట్లేనా..?


పదవిలో ఆరేళ్లు
లోక్‌సభ ఎన్నికల మాదిరిగా కాకుండా ఓపెన్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ నిర్వహిస్తారు. క్రాస్ ఓటింగ్‌ను నిరోధించడానికి ఇది జరుగుతుంది . ఎమ్మెల్యేలు తమ ఓట్లను పార్టీ నియమించిన అధీకృత ఏజెంట్‌కు చూపించాలి. అదనంగా రాజ్యసభ ఎన్నికల్లో నోటా ఆప్షన్‌ ఉండదు.

ప్రస్తుతానికి రాజ్యాంగం ఎగువ సభలో గరిష్టంగా 250 మంది సభ్యులకు చోటు కల్పిస్తున్నారు. వారిలో 238 మంది సింగిల్‌ ట్రాన్స్‌ఫరబుల్‌ ఓట్‌ల విధానం ద్వారా ఎన్నుకోబడతారు. అయితే 12 మంది సభ్యులను సంగీతం, క్రీడలు, ఆర్థిక శాస్త్రం, ఇతర వివిధ రంగాల నుంచి రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆరు సంవత్సరాలు ఉంటుంది. మొత్తం సభ్యులలో మూడింట రెండు వంతుల మంది ప్రతి రెండు సంవత్సరాలకు పదవీ విరమణ చేస్తారు.
Published by:Veera Babu
First published:

Tags: Elections, Explained, Rajyasabha

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు