హోమ్ /వార్తలు /Explained /

Explained: Domestic Flight Fares: పెరిగిన దేశీయ విమాన సర్వీసులు, ఛార్జీలు.. ప్రయాణికులపై ఎలాంటి భారం పడుతుందంటే.. తెలుసుకోండి

Explained: Domestic Flight Fares: పెరిగిన దేశీయ విమాన సర్వీసులు, ఛార్జీలు.. ప్రయాణికులపై ఎలాంటి భారం పడుతుందంటే.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్ నేపథ్యంలో గతంలో దేశీయ విమానయాన సంస్థల సర్వీసులపై విధించిన 65 శాతం పరిమితిని ప్రభుత్వం తాజాగా 72.5 శాతానికి పెంచింది. ఈ నిర్ణయంతో విమానయాన సంస్థలు దేశీయ మార్గాల్లో ఎక్కువ విమానాలను నడిపే అవకాశం ఉంది.

కరోనా సెకండ్ వేవ్ తరువాత ఇప్పుడిప్పుడే అన్ని వ్యాపారాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరిగింది. దీంతో కోవిడ్ నేపథ్యంలో గతంలో దేశీయ విమానయాన సంస్థల సర్వీసులపై విధించిన 65 శాతం పరిమితిని ప్రభుత్వం తాజాగా 72.5 శాతానికి పెంచింది. ఈ నిర్ణయంతో విమానయాన సంస్థలు దేశీయ మార్గాల్లో ఎక్కువ విమానాలను నడిపే అవకాశం ఉంది. అయితే దేశీయ విమానాల టికెట్ ధరలను సైతం ప్రభుత్వం తాజాగా పెంచింది. దీంతో విమాన ప్రయాణం మరింత ఖరీదైనదిగా మారనుందని ప్రజలు భావిస్తున్నారు. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో రెండు నెలల పాటు దేశీయ విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. ఆ తరువాత 2020 మే నెలలో భారత్‌లో విమానయానం తిరిగి ప్రారంభమైంది. అయితే మౌలిక సదుపాయాలపై అధిక భారం పడకూడదనే ఉద్దేశంతో.. ఎయిర్‌లైన్ కంపెనీలు నిర్వహించే దేశీయ విమాన సర్వీసులను ప్రభుత్వం నియంత్రించింది. మొదటి లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత.. ఒక్కో విమానయాన సంస్థ దేశీయ మార్గాల్లో సేవలందించే విమానాల సంఖ్యను కేంద్రం 33 శాతానికే పరిమితం చేసింది. అయితే సెకండ్ వేవ్ ముందు వరకు దశల వారీగా ఈ సంఖ్యను 80 శాతానికి పెంచింది. ఆ తరువాత కోవిడ్ రెండో దశ ప్రభావంతో ప్రభుత్వం దీన్ని 50 శాతానికి తగ్గించింది. అనంతరం ఈ సామర్థ్యాన్ని 60 శాతానికి, ఇప్పుడు 72.5 శాతానికి పెంచింది.

Indian Railways: రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై ఆ సేవలు ఆన్‌లైన్‌లోనే.. వివరాలివే..

ఛార్జీలపై పరిమితులు ఎలా ఉన్నాయి?

విమానయాన కంపెనీలపై విధించిన ఆంక్షల మాదిరిగానే, సంస్థల టిక్కెట్ ఛార్జీలను కూడా ప్రభుత్వం నియంత్రించింది. విమాన ప్రయాణం వ్యవధి ఆధారంగా మొత్తం ఛార్జీలను ఏడు విభాగాలుగా విభజించి కనీస, గరిష్ట ఛార్జీలను కేంద్రం ప్రకటించింది. అయితే ఇంధన ధరల పెరుగుదలకు అనుగుణంగా ఛార్జీల పరిమితులను సైతం పెంచింది. తాజాగా విమాన ప్రాయాణానికి అతి తక్కువ సమయం పట్టే క్లాస్- A విభాగంలో కనీస ఛార్జీ రూ.2,600 నుంచి రూ.2,900 వరకు, గరిష్ట ఛార్జీ రూ.7,800 నుంచి రూ .8,800 వరకు పెరిగాయి. అలాగే దేశీయ సర్వీసుల్లో ఎక్కువ దూరం ప్రయాణించే క్లాస్- G విభాగంలో.. కనీస ధరలు రూ.8,700 నుంచి రూ.9,800 వరకు.. గరిష్ట ధరలు రూ .24,200 నుంచి రూ .27,200 వరకు పెరిగాయి.

టికెట్ ఛార్జీలను విభజించిన సెక్టార్లలో ఏయే మార్గాలు ఉన్నాయి?

విమాన ప్రయాణ దూరం ఆధారంగా టికెట్ల ధరలను వర్గీకరించడానికి మొత్తం ఏడు సెక్టార్లను కేంద్రం ప్రకటించింది. అతి తక్కువ దూరం నడిచే సర్వీసులు ఉండే క్లాస్- A లో బెంగళూరు-చెన్నై, భోపాల్-ముంబై, ఢిల్లీ-జైపూర్, పుణె-గోవా, ఢిల్లీ-చండీగఢ్ వంటి 41 సెక్టార్లు ఉన్నాయి. క్లాస్-Bలో ఢిల్లీ-శ్రీనగర్, ముంబై-అహ్మదాబాద్, ముంబై-గోవా, పుణె-అహ్మదాబాద్, చెన్నై-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, కోల్‌కతా-పాట్నా.. వంటి 83 రూట్లు ఉన్నాయి. క్లాస్-Cలో ఢిల్లీ-అహ్మదాబాద్, ఢిల్లీ-పాట్నా, ఢిల్లీ-లక్నో, ముంబై-బెంగళూరు, చెన్నై-కోల్‌కతా, ఢిల్లీ-నాగ్‌పూర్.. వంటి 87 సెక్టార్లు ఉన్నాయి.

క్లాస్-Dలో ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హైదరాబాద్, ఢిల్లీ-కోల్‌కతా, ముంబై-చెన్నై, పాట్నా-అహ్మదాబాద్, కోల్‌కతా-బెంగళూరు వంటి 70 రూట్లు ఉన్నాయి. క్లాస్- E లో ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-గోవా, బెంగళూరు-పాట్నా, ముంబై-పాట్నా, చెన్నై-అహ్మదాబాద్, ఢిల్లీ-గౌహతి, జైపూర్-బెంగళూరు వంటి 60 సెక్టార్లు ఉన్నాయి. క్లాస్-Fలో ఢిల్లీ-కొచ్చి, బెంగళూరు-చండీగఢ్, చెన్నై-గౌహతి, ముంబై-శ్రీనగర్, గౌహతి-బెంగళూరు వంటి 32 మార్గాలు ఉన్నాయి. క్లాస్- G విభాగంలో కోయంబత్తూర్-ఢిల్లీ, ఢిల్లీ-కోయంబత్తూర్, ఢిల్లీ-తిరువనంతపురం, పోర్ట్ బ్లెయిర్-ఢిల్లీ, ఢిల్లీ-పోర్ట్ బ్లెయిర్, తిరువనంతపురం-ఢిల్లీ వంటి ఆరు సెక్టార్లు ఉన్నాయి. .

ఈ ఛార్జీల పరిమితులు ఎలా వర్తిస్తాయి?

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. 30 రోజుల రోలింగ్ సైకిల్ వరకు మాత్రమే విమానయాన సంస్థలు కనీస, గరిష్ట ఛార్జీలను వసూలు చేస్తాయి. అంటే 30 రోజుల వరకు మాత్రమే ప్రస్తుతం పెరిగిన ధరలు అమల్లో ఉంటాయి. ఉదాహరణకు.. ఈరోజు నుంచి చూస్తే సెప్టెంబర్ 14 వరకు ఉండే ప్రయాణాలకు బుకింగ్స్ అందించే విమానాల్లో మాత్రమే కొత్త ఛార్జీల బ్యాండ్లు వర్తిస్తాయి.

First published:

Tags: Flight, Flight Offers

ఉత్తమ కథలు