కరోనా వైరస్ (Coronvirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron Variant) ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తుంది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా మ్యూటేషన్ చెందుతుండటమే దీనికి కారణం. అయితే ఒమిక్రాన్ వేరియంట్ మొదట ఎక్కడి నుంచి వచ్చింది? వారిలో ఉన్న లక్షణాలేంటి? అనే విషయాలు అందరిలో మెదులుతున్నాయి. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చిన తరువాత, దీని లక్షణాలపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణాఫ్రికాలో హెచ్ఐవీ సోకిన వ్యక్తి నుంచి ఇది కొత్తగా రూపాంతరం చెందినట్లు అనుమానం వ్యక్తం చేసింది. దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగులోకిచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ హెచ్ఐవీతో ముడిపడి ఉందని తెలిపింది.
Corona Updates: థర్డ్ వేవ్ లేనట్లే.. భారీగా తగ్గిన కరోనా కేసులు.. తాజా కేసుల వివరాలు
బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వ్యక్తుల్లో వైరస్ తొందగా మ్యుటేషన్ చెందుతుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అయితే దీనిపై ఇంకా అనేక పరిశోధనలు జరగాల్సి ఉందని, అప్పుడే స్పష్టత వస్తుందని తెలిపింది. కాగా, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది హెచ్ఐవీతో జీవిస్తున్న ప్రజలు సబ్ సహారా ఆఫ్రికాలో జీవిస్తున్నారు. ఆరోగ్య సేవల కొరత కారణంగా ఇక్కడ జీవిస్తున్న 8 మిలియన్ల మంది ప్రజలు హెచ్ఐవీకి చికిత్స పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ ప్రమాదం ఎక్కువగా ఉంది.
Omicron: గుడ్‌న్యూస్.. ఆ టాబ్లెట్‌తో ఒమిక్రాన్ వేరియెంట్ మటాష్.. అద్భుతమైన ఫలితాలు
* హెచ్ఐవీ, ఒమిక్రాన్ పెరుగుదలకు లింక్ ఏంటి?
కరోనా వైరస్ సహా ఏదైనా వైరస్, బలహీనమైన రోగనిరోధకత కలిగిన వ్యక్తి శరీరం లోపల సుదీర్ఘకాలం పాటు ఉంటుంది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి త్వరగా సోకుతుంది. హెచ్ఐవీ సోకిన వారికిలో ఒమిక్రాన్ ప్రమాదం ఎక్కువేని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా తేల్చి చెప్పారు. సాధారణంగా హెచ్ఐవీ సోకిన వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వారిలో వైరస్ వేగంగా మార్పులు చెందుతుంది. తర్వాత వారి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తులకు వైరస్ త్వరగా సోకే అవకాశం ఉంది. వివిధ రకాల ఆందోళన రకం వైరస్ వేరియట్లు ఇలాగే మ్యూటేషన్ చెందినట్లు వైరాలజిస్టులు నిర్ధారించారు. ఆల్ఫా, బీటా మ్యూటెంట్లు సైతం తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న వారి శరీరంలో వైరస్ మ్యూటేట్ అవ్వడం ద్వారానే తయారైనట్లు తేలింది. ఇవి 2020లో యూకే, దక్షిణాఫ్రికాలో వెలుగులోకొచ్చాయి. ఇవి కోవిడ్–19తో దీర్ఘకాలిక సంక్రమణకు దారితీస్తాయి.
ఎయిడ్స్ (AIDS) భయాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా (South Africa) లో 15 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు గల ప్రజల్లో ఒమిక్రాన్ ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాల్లో తేలింది. 2020 నాటికి దక్షిణాఫ్రికాలో 15-45 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులలో దాదాపు ఐదో వంతు మంది HIV పాజిటివ్‌గా ఉన్నారు. ఈ రోగులలో కేవలం 70 శాతం మంది మాత్రమే యాంటీరెట్రోవైరల్ థెరపీ తీసుకుంటున్నారు. ఇది వారి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వ్యాధులను అధిగమించే సామర్థ్యాన్ని పెంచుతుంది.
Corona Vaccine: వ్యాక్సిన్ వేయించుకోకుంటే జాబ్ నుంచి తొలగింపు.. గూగుల్ సంచలన నిర్ణయం
* హెచ్ఐవీ సోకిన వ్యక్తుల్లో ఎందుకు ప్రమాదం ఎక్కువ?
హెచ్ఐవీ సోకిన వ్యక్తిలో ఒమిక్రాన్ ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. మరోవైపు క్యాన్సర్, అవయవ మార్పిడితో సహా కొన్ని ఇతర వ్యాధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు దారితీస్తాయి. కరోనావైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సులభంగా సోకుతుంది. దక్షిణాఫ్రికాలో హెచ్ఐవీ రోగుల సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా అక్కడ ఒమిక్రాన్ కేసులు పెరగడానికి కారణమని కొందరు వాదిస్తున్నారు.
"ఈ వేరియంట్ హెచ్ఐవీతో సంబంధం కలిగి ఉన్న కారణంగా, ఇది దక్షిణాఫ్రికాలో ఉద్భవించింది. ఇక్కడ చాలామంది ప్రజలు హెచ్ఐవీతో బాధపడుతున్నారు." అని రష్యన్ సెంట్రల్ రీసెచ్లో అధిపతిగా ఉన్న వాడిమ్ పోక్రోవ్స్కీ అన్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో నిపుణుడు మాట్లాడుతూ ‘‘దక్షిణాఫ్రికాలో హెచ్ఐవీ అధిక ప్రాబల్యం కారణంగా ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువగా సోకుతోంది. అయితే, హెచ్ఐవీ వ్యాధి మాత్రమే కాదు ఇది వ్యక్తులలో రోగనిరోధకతను తగ్గిస్తుంది." అని చెప్పారు.
Omicron: పంటి నొప్పికి చికిత్స చేయించుకుందామని వెళితే బయటపడ్డ కరోనా.. అది కూడా ఒమిక్రాన్
* టీకాలతో ఒమిక్రాన్‌కు చెక్ పెట్టవచ్చా?
కరోనా మొదటి, రెండో వేవ్‌లు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గుణపాఠాలు నేర్పించాయి. వీటికి వ్యతిరేకంగా కనుగొన్న టీకాలు ఒమిక్రాన్‌పై కూడా పనిచేస్తాయా? అనే ప్రశ్నపై స్పష్టత లేదు. అయితే, దక్షిణాఫ్రికాలో కేవలం 8 శాతం మందికి మాత్రమే టీకాలు వేశారు. దీంతో అక్కడ ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. డిసెంబరు 19 నాటికి, అమెరికాలో, యూరప్, ఆసియాలో అర్హతగల వ్యక్తులకు 50 శాతం టీకాలు పూర్తయ్యాయి. ఆఫ్రికాలో 8 శాతం మాత్రమే వ్యాక్సిన్ పూర్తయ్యింది. అందుకే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
‘పెరుగుతున్న ఒమిక్రాన్ ప్రమాదాన్ని కోవిడ్–19 టీకాలు తగ్గిస్తాయి. అయితే హెచ్ఐవీ ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో, కోవిడ్–19 టీకా కవరేజ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది." అనిప్రొఫెసర్ మూర్ చెప్పారు. కాగా, కరోనా వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా ఎంత బలంగా పనిచేస్తాయనే విషయంపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aids, Coronavirus, Covid-19, HIV, Omicron, South Africa