Home /News /explained /

EXPLAINED HOW IMPORTANT IS THE DOLBY TAG FOR SMART TV BUYERS IN INDIA GH VB

Explained: స్మార్ట్ టీవీలకు డాల్బీ ట్యాగ్ ఉండాల్సిందేనా..? ఈ టెక్నాలజీ ఏంటి..? ఎలా పనిచేస్తుంది..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టీవీ అయినా, థియేటర్ అయినా.. విజువల్స్‌తో పాటు సౌండ్ క్లారిటీ కూడా బాగుంటేనే దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తాం. అందుకే ఈ మధ్య స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్స్‌లో కూడా డాల్బీ అట్మాస్ సౌండ్ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

టీవీ(TV) అయినా, థియేటర్ అయినా.. విజువల్స్‌తో(Visual) పాటు సౌండ్ క్లారిటీ కూడా బాగుంటేనే దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తాం. అందుకే ఈ మధ్య స్మార్ట్ టీవీ(Smart Tv), స్మార్ట్ ఫోన్స్‌లో కూడా డాల్బీ అట్మాస్ సౌండ్ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. అసలీ డాల్బీ అంటే ఏంటీ? టీవీల్లో ఇది నిజంగా పని చేస్తుందా? ఈ విషయాన్ని తెలుసుకునేందుకు న్యూస్18 టెక్ టీం(News 18 Tech Team).. డాల్బీ లేబొరేటరీస్‌ ఎమర్జింగ్ మార్కెట్స్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కేడియా, రీసెర్చ్ డైరెక్టర్(Research Pathak) తరుణ్ పాఠక్‌తో మాట్లాడింది. ఆ వివరాలు..

డాల్బీ అందరికీ అవసరమా?
"ఇంట్లో మంచి సినిమా ఎక్స్ పీరియెన్స్‌ను అందించేందుకు డాల్బీ ఎంతగానో సాయపడుతుంది. టీవీలు.. థియేటర్ లాంటి అనుభూతిని ఇవ్వకపోవచ్చు. కానీ కావాల్సినంత పెద్ద స్క్రీన్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఓటీటీలు, 4కే(4k) రిజల్యూషన్ సినిమాలు అందుబాటులోకి వచ్చాక టీవీల్లో చూసే సినిమా కూడా మంచి ఎక్స్ పీరియెన్స్‌ను ఇస్తుంది. ఇందులో తగ్గిందల్లా సౌండ్ క్లారిటీ ఒక్కటే. అందుకే డాల్బీ ద్వారా బెస్ట్ సౌండ్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందేలా మేము కృషి చేస్తున్నాం" అని డాల్బీ డైరెక్టర్లు చెబుతున్నారు.

Explained: డిజిటల్ రూపీ అంటే ఏమిటి..? బిట్ కాయిన్ కు దీనికి తేడా ఏమిటి.. బడ్జెట్ ప్రసంగంలో దీనిపై మంత్రి ఏం మాట్లాడారు..?


లౌడ్‌నెస్ Vs క్లారిటీ
మంచి ఆడియో గురించి కెడియా మాట్లాడుతూ, "ఎంటర్‌టైన్మెంట్‌ను పూర్తిగా ఆస్వాదించడానికి సౌండ్ చాలా కీలకం. డైలాగ్‌ క్లారిటీ, సౌండ్ డిజైన్‌లో ఉపయోగించిన కొత్త సౌండ్ ఎఫెక్ట్స్ ఇలాంటివన్నీ పూర్తి స్థాయిలో వినలేకపోతే నిజమైన సినిమా ఎక్స్‌పీరియెన్స్‌ను పొందలేరు. అందుకే సౌండ్ పెద్దగా వినిపించడంతో పాటు అందులోని అన్ని వేరియంట్స్‌ను వినగలగాలి. డాల్బీ అదే పని చేస్తుంది" అని చెప్పారు.

డాల్బీ అట్మాస్ vs డాల్బీ విజన్ టెక్నాలజీ
డాల్బీ అట్మాస్(Dolby Atmos) అనేది స్టీరియో స్పీకర్‌ల నుంచి ఆడియోని వేవ్స్ రూపంలో రిలీజ్ చేస్తుంది. ఇది త్రీడీ(3D) సౌండ్ ఎఫెక్ట్ ను ఇస్తుంది. అన్ని దిశల నుంచి శబ్దాలు వినేలా ఈ ఆడియో టెక్నాలజీని డిజైన్ చేస్తారు. మరోవైపు, డాల్బీ విజన్ అనేది విజువల్స్ కు సంబంధించింది. సరైన బ్రైట్‌నెస్, మెరుగైన డార్క్‌నెస్ ఉండేలా విజువల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. ఇది హెచ్‌డీఆర్ (HDR) టెక్నాలజీలా పనిచేస్తుంది. అట్మాస్ , విజన్ ఈ రెండూ సాధ్యమైనంత బెస్ట్ యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించడానికి ఉపయోగపడతాయి.

 'డాల్బీ ట్యాగ్' ముఖ్యమా?
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో 62 శాతం మంది స్మార్ట్ టీవీ యూజర్స్ కు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ గురించి తెలుసునని కౌంటర్ పాయింట్ ‘మార్కెట్ లెన్స్’ సర్వేలో వెల్లడైంది. అయితే, టైర్ 2 నగరాల్లోని కస్టమర్‌లలో ఈ అవగాహన అంతగా లేదు. అందుకే వినియోగదారులకు డాల్బీ ఫీచర్‌ను నొక్కి చెప్పేందుకు స్మార్ట్ టీవీ కంపెనీల వారు ఈ ట్యాగ్ పెడుతుంటారని డైరెక్టర్లు చెబుతున్నారు.

అసలు డాల్బీ ఏం చేస్తుంది?
ఇప్పటివరకూ ఉన్న సౌండ్ టెక్నాల‌జీలన్నీ చానెల్స్ ద్వారా సౌండ్‌ను ప్రసారం చేస్తాయి. ఏదైనా ఒక్క చానెల్‌లో స‌మ‌స్య ఉన్నా.. సౌండ్ క్లారిటీ దెబ్బతింటుంది. అయితే డాల్బీ అట్మాస్ మాత్రం ఆడియోను ఆబ్జెక్ట్స్‌గా క్రియేట్ చేసి, దానికి త‌గ్గట్టుగా బెస్ట్ ఆడియోను అందిస్తుంది. సౌండ్‌లో ఎక్కువ క్లారిటీ, మ్యూజిక్‌లో డెప్త్‌ను క్రియేట్ చేస్తుంది. బెస్ట్ డాల్బీ అట్మాస్‌ను స‌పోర్ట్ చేసే ఆడియో సిస్టమ్ ఉంటేనే.. అది స‌రిగ్గా ప‌నిచేస్తుంది.

Explained: ఉక్రెయిన్‌, రష్యా మధ్య ఉద్రిక్తతలు.. ఈ రెండు దేశాలతో భారతదేశం సంబంధాలు ఎలా ఉన్నాయి..?


సర్వే వివరాలివీ..
భారతదేశంలో స్మార్ట్ టీవీ మార్కెట్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రధాన నగరాల్లో హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌ను మెరుగుపరచుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. 4K/UHD టెక్నాలజీపై అవగాహన ఉన్నవారు 64 శాతం మంది ఉన్నారు. డాల్బీ టెక్నాలజీల గురించి అవగాహన ఉన్నవారు 6 శాతం, HDR పై అవగాహన ఉన్నవారు 60 శాతం ఉన్నారు. మొత్తంగా మెరుగైన ఆడియో, వీడియో నాణ్యత ఉంటే టీవీ ఎక్స్‌పీరియెన్స్ మెరుగవుతుందని 94 శాతం మంది వినియోగదారులు విశ్వసిస్తున్నట్టు సర్వేలో తెలిసింది.
Published by:Veera Babu
First published:

Tags: Dolby, Explained, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు