2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) కంట్రిబ్యూషన్స్‌పై 8.1 శాతం వడ్డీ రేటును(Interest Rates) అందిస్తున్నట్లు గత శుక్రవారం(Friday) కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రకటించింది. మార్చిలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) ఈ రేటును ప్రకటించింది. ఇది నాలుగు దశాబ్దాలలో కనిష్ట రేటు కావడంతో చాలా మంది నిరాశకు గురయ్యారు. అయితే ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారు వడ్డీరేట్లతో పాటు వాటిపై వర్తించే పన్ను నియమాలను నియమాలు నిపుణులు సూచిస్తున్నారు.
EPF పన్ను నియమాలు
భారీ ప్యాకేజీలతో వేతనాలు పొందే ఉద్యోగులు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2021 బడ్జెట్లో ఏడాదికి రూ.2.5 లక్షల (ప్రభుత్వ ఉద్యోగులకు రూ.5 లక్షలు) కంటే ఎక్కువ ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్స్‌పై వడ్డీ పొందుతుంటే పన్ను విధించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నిధులు జమ అయితే వచ్చే వడ్డీపై పన్ను విధించాలని నిర్ణయించారు. అప్పటి వరకు EPF పెట్టుబడి, అక్యుములేషన్, మెచ్యూరిటీ అన్నీ పూర్తిగా పన్ను రహితంగా ఉన్నాయి.
ఒక సంవత్సరం క్రితం ప్రకటన చేసినా.. EPFO 8.1 శాతం వడ్డీని సభ్యుల ఖాతాలకు జమ చేసినప్పుడు ఉద్యోగులు నిరాశ చెందుతారు. రిటైర్మెంట్ బాడీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి వడ్డీని క్రెడిట్ చేసే సమయంలో 10 శాతం చొప్పున పన్ను (TDS) తీసివేస్తుంది. ఈపీఎఫ్‌వో ఓ సర్క్యులర్‌లో.. ‘ప్రావిడెంట్ ఫండ్ ఫైనల్ సెటిల్మెంట్, బదిలీ క్లెయిమ్‌లు, అక్యుములేషన్ ట్రాన్స్ఫర్, మినహాయింపు పొందిన సంస్థల నుంచి EPFOకి బదిలీ చేసినప్పుడు వార్షిక ఖాతాల ప్రాసెసింగ్ సమయంలో TDS వర్తిస్తుంది’ అని పేర్కొంది. అధిక సంపాదనతో పాటు, పరిమితికి మించి వారి వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF)కి కంట్రిబ్యూట్ చేసేవాళ్లు కూడా ప్రభావితమవుతారు.
నాన్ ట్యాక్సబుల్ అకౌంట్ అంటే ఏంటి?
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సర్క్యులర్ ప్రకారం.. EPF స్టేట్మెంట్ను ట్యాక్సబుల్ అకౌంట్, నాన్ ట్యాక్సబుల్ అకౌంట్‌గా విభజిస్తారు. వార్షిక EPF/VPF కంట్రిబ్యూషన్‌పై లభించే వడ్డీ రూ.2.5 లక్షలకు మించి ఉంటే పన్ను చెల్లించాలి. కొత్త ఫార్మాట్ గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని EPFO తన ఏప్రిల్ సర్క్యులర్‌లో పేర్కొంది. స్టేట్మెంట్లోని నాన్-టాక్సబుల్ కాంపోనెంట్ 2021 మార్చి 31 నాటికి EPF ఖాతాలో ఎండ్ బ్యాలెన్స్, సంవత్సరంలో చేసిన నాన్-టాక్సబుల్ కంట్రిబ్యూషన్లు (రూ. 2.5 లక్షల కంటే తక్కువ), కాంపోనెంట్పై సంపాదించిన వడ్డీ చూపుతుంది. వడ్డీ వార్షిక ప్రాతిపదికన క్రెడిట్ అవుతుంది. కానీ ఉద్యోగుల PF ఖాతాలను నెలవారీ ప్రాతిపదికన నిర్వహిస్తారు.
ట్యాక్సబుల్ అకౌంట్ ఎలా పని చేస్తుంది?
కంట్రిబ్యూషన్ రూ.2.5 లక్షల మార్కును దాటిన క్షణంలో, ప్రతి నెల అదనపు సహకారం, వర్తించే వడ్డీ ట్యాక్సబుల్ ఖాతాకు బదిలీ అవుతుంది. ఈ కాంపోనెంట్పై వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాలి. పాన్‌ను లింక్ చేసి ఉంటే వడ్డీని క్రెడిట్ చేయడానికి ముందు EPFO 10 శాతం చొప్పున పన్నును తీసివేస్తుంది.
ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన చర్యలు?
రిటర్న్‌లను దాఖలు చేసే సమయంలో EPFO TDSని 10 శాతం చొప్పున నిలిపివేస్తుంది. పన్ను పరిధిలోకి వచ్చేవాళ్లు మొత్తం పన్నును లెక్కించాలి. రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో ఈ మొత్తంపై అదనపు పన్ను చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి, వర్తించే స్లాబ్ రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. EPFO TDSని నిలిపివేస్తుంది కాబట్టి, ఇది యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో కనిపిస్తుంది. ఆదాయ పన్ను రిటర్న్ ఫారమ్‌లలో కూడా ముందస్తుగా ఉంటుంది. రిటర్న్‌లు దాఖలు చేసే సమయంలో పన్నులు చెల్లించకపోతే ఆదాయపు పన్ను శాఖ నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాన్ అందించని వారికి TDS రేటు 20 శాతం ఉంటుంది. నాన్ రెసిడెంట్ ఉద్యోగులకు, TDS రేటు 30 శాతం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government, EPFO, Explained, PF account