Home /News /explained /

EXPLAINED HOW DOES THERMAL INVERSION HAPPEN AND HOW IT AFFECTS AIR POLLUTION GH SRD

Explained: థర్మల్ ఇన్వర్షన్ అంటే ఏంటి? ఇది వాయు కాలుష్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Explained: వాతావరణంలో ఎంత ఎత్తుకు వెళ్తే, గాలి ఉష్ణోగ్రత అంత తక్కువగా ఉంటుంది. కానీ ఉష్ణ విలోమం సమయంలో వాతావరణం పూర్తి వ్యతిరేకంగా మారుతుంది.

శీతాకాలంలో నెలకొనే వాతావరణ పరిస్థితుల కారణంగా వాయు కాలుష్యం పెరుగుతుంది. దీనికి తోడు పంట వ్యర్థాల దహనం, పండుగలు, పొగమంచు వల్ల ఈ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. దీపావళి సందర్భంగా పటాకులు పేల్చడం వల్ల మాత్రమే గాలి కాలుష్యం జరగుతుందని చాలామంది భావిస్తారు. అయితే పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అన్ని సీజన్లలో ఉద్గారాలు గాల్లోకి విడుదలవుతూ ఉంటాయి. చలికాలం ఉష్ణోగ్రతలో తగ్గుదల, గాలి వేగం మందగించడం వంటి వాతావరణ లక్షణాలు.. కాలుష్య కారకాల విజృంభణకు కారణమవుతాయి. అయితే చలికాలంలో కాలుష్యం పెరగడానికి దోహదపడే మరో సహజ వాతావరణ పరిస్థితి ఉంది. అదే ఉష్ణ విలోమం లేదా ఉష్ణోగ్రత విలోమం (Thermal inversion). ఈ నేపథ్యంలో థర్మల్ ఇన్వర్షన్ అంటే ఏంటి? కాలుష్యంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? వంటి వివరాలు తెలుసుకుందాం.

* థర్మల్ ఇన్వర్షన్ అంటే ఏంటి?
వాతావరణంలో ఎంత ఎత్తుకు వెళ్తే, గాలి ఉష్ణోగ్రత అంత తక్కువగా ఉంటుంది. కానీ ఉష్ణ విలోమం సమయంలో వాతావరణం పూర్తి వ్యతిరేకంగా మారుతుంది. ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉండే ప్రక్రియను థర్మల్ ఇన్వర్షన్ అంటారు. ఈ స్థితిలో భూ ఉపరితలానికి దగ్గరగా ఉండే గాలి చల్లగా ఉంటుంది. పై పొరల్లో మాత్రం వెచ్చని గాలి పొరలు ఉంటాయి.

* థర్మల్ ఇన్వర్షన్ ఎలా జరుగుతుంది?
నిర్దిష్ట వాతావరణ పరిస్థితుల్లో ధర్మల్ ఇన్వర్షన్ సంభవిస్తుంది. వివిధ ప్రాంతాలను బట్టి కూడా ఉష్ణ విలోమం జరగవచ్చు. శీతాకాలంలో రాత్రి వేళల్లో భూమికి దగ్గర్లో ఉండే గాలి వేగంగా వేడిని కోల్పోతుంది. కానీ పగటిపూట భూమి వెలువరించే వేడిని పై పొరల్లోని గాలి నిలుపుకుంటుంది. దీంతో ఉష్ణ విలోమ పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని తీర ప్రాంతాల్లో, మంచు ఎక్కువగా కురిసే ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రత విలోమాలు ఏర్పడతాయి.

* దీనివల్ల ఏం జరుగుతుంది?
థర్మల్ ఇన్వర్షన్ ఏర్పడినప్పుడు వాతావరణంలోని కింది పొరల్లోని గాలి పైకి వేగంగా కదలదు. వేడి గాలి ఇలా చల్లటి గాలిని నిరోధించడం వల్ల పరిసరాల్లోని పొగ, ఇతర కాలుష్య కారకాలు వాతావరణంలోని పై పొరల్లోకి వెళ్లలేవు. దీంతో ఉద్గారాలన్నీ భూ ఉపరితలానికి దగ్గరగా ఉంటాయి. దీనివల్ల గాలి నాణ్యత తగ్గిపోతుంది. థర్మల్ ఇన్వర్షన్‌లో బంధీ అయిన కాలుష్య కారకాలు.. అప్పటికే ఘనీభవించిన నీటి ఆవిరితో కలిసి పొగమంచును ఏర్పరుస్తాయి.

ఇది కూడా చదవండి : ఉప్పునీటితో జీరో కార్బన్ తాగు నీరును ఉత్పత్తి చేయగలమా? సౌదీ అరేబియాలో డీశాలినేషన్‌ ఎలా కొనసాగుతోంది?

1952లో గ్రేట్ స్మోగ్ ఆఫ్ లండన్ అనేది ఇలాగే ఏర్పడింది. భూమిపై తక్కువ రేడియేటివ్ ఉష్ణోగ్రత కారణంగా థర్మల్ ఇన్వర్షన్ గాలి కదలికను (vertical wind movement) కూడా తగ్గిస్తుంది. దీంతో తీవ్రమైన శీతాకాల వాతావరణ పరిస్థితుల్లో ఉష్ణోగ్రత విలోమం కాలుష్యాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. గాలి వేగం 2మీ/సెకను కంటే తక్కువగా ఉంటే.. వాతావరణంలోని దిగువ పొరల నుంచి కాలుష్య కారకాల వ్యాప్తి నెమ్మదిస్తుంది. దీంతో ఇలా కలుషితమైన గాలిని పీల్చినవారు అనారోగ్యాల బారిన పడతారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Air Pollution, Delhi pollution

తదుపరి వార్తలు