Home /News /explained /

EXPLAINED HOW CRITICAL ARE MSMES IN FULFILLING MAKE IN INDIA GOAL OF THE INDIAN AIR FORCE KNOW DETAILS HERE GH VB

Explained: భారత వైమానిక దళం మేక్-ఇన్-ఇండియా లక్ష్యాన్ని నెరవేర్చడంలో MSMEలు ఎంత కీలకం..? తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సైన్యానికి అవసరమైన ఆయుధాలు, ఇతర పరికరాల తయారీకి అవసరమైన వస్తువులను అందించడంలో స్వదేశానికి చెందిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కీలకంగా మారాయి. స్వదేశీ సంస్థల ద్వారా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

భారత వైమానిక దళం(IAF-Indian Air Force), సైన్యానికి అవసరమైన ఆయుధాలు, ఇతర పరికరాల తయారీకి మొదటి నుంచి చివరి దశ వరకు అవసరమైన వస్తువులను అందించడంలో స్వదేశానికి చెందిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(MSME- Micro, small and medium enterprises) కీలకంగా మారాయి. స్వదేశీ సంస్థల ద్వారా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విడిభాగాలకు సంబంధించిన అవసరాలను MSMEలు తీరుస్తున్నాయి. వైమానిక దళానికి సంబంధించి 60,000 కంటే ఎక్కువ విడిభాగాలు అవసరమైతే, వాటిలో 40,000 విడిభాగాలు MSMEల ద్వారా స్వదేశంలో తయారు చేస్తున్నట్లు PHD ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో ఎయిర్ వైస్ మార్షల్ PS సారిన్ చెప్పారు. రక్షణ రంగంలో పనిచేస్తున్న దాదాపు 12,000 MSMEలలో దాదాపు 700 MSMEలు IAFలో నేరుగా రిజిస్టర్‌ అవ్వడం గమనార్హం.

Explained: ప్రభుత్వానికి RBI ట్రాన్స్‌ఫర్ చేసే డివిడెండ్‌లో భారీ తగ్గుదల.. ఈ డివిడెండ్ ఎందుకు తగ్గుతోంది..?


అయితే సంవత్సరాలుగా MSMEలు కేవలం విడిభాగాలను తయారు చేసేవి. ప్రస్తుతం తేలికపాటి యుద్ధ విమానం తేజస్, ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ ఆకాష్, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్, కంట్రోల్ సిస్టమ్(IACCS), సు30-Mk1 ఫైటర్‌జెట్‌, చీతా హెలికాప్టర్‌, అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ను తయారు చేసే స్థాయికి చేరాయి. రక్షణ రంగంలో MSMEలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టింది. IAF, రక్షణ రంగానికి సంబంధించి ఏడాదికి రూ.100 కోట్లకు పైగా ఆర్డర్‌లు ఇచ్చేందుకు రిజర్వు చేస్తున్నట్లు 2020లో ప్రకటించింది. రక్షణ మంత్రిత్వ శాఖ కూడా డిఫెన్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌లో 25 శాతం కేటాయించడంతో2022-23 ఆర్థిక సంవత్సరంలో MSMEలు, స్టార్టప్‌ల బడ్జెట్ మొత్తం రూ.21,149.47 కోట్లకు చేరింది.

4,006 రక్షణ వస్తువల తయారీకి ఆసక్తి
ప్రైవేట్ రంగం ద్వారా స్వదేశంలో ఉత్పత్తులు చేపట్టే అంశాల గురించి సమాచారాన్ని అందించడానికి ఆగస్టు 2020లో ప్రారంభించిన సృజన్ పోర్టల్ వంటి కార్యక్రమాలను రక్షణశాఖ మంత్రి గుర్తించారు. 2022 ఏప్రిల్ 1 నాటికి, రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, అంతకుముందు దిగుమతి చేసుకున్న 19,509 రక్షణ వస్తువులను పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. వాటిలో 4,006 రక్షణ వస్తువులను స్వదేశంలో తయారు చేసేందుకు సంస్థలు ఆసక్తి చూపాయి. ప్రత్యేకించి IAFకి సంబంధించి, ఆర్థిక సంవత్సరం 2021లో దాదాపు రూ.770 కోట్ల విలువైన 469 వస్తువులు దిగుమతి అయ్యాయి, ఇది 2022కి రూ.474 కోట్ల విలువైన 84 వస్తువులకు తగ్గింది.

* మేక్‌ ప్రాజెక్టులకు 70 శాతం ప్రభుత్వ నిధులు
IAFలో ఖర్చు తగ్గింపునకు సంబంధించి మరొక మార్గాన్ని నిపుణులు సూచిస్తున్నారు. సుమారు 1,300 విమానాలు, 900 రోటరీ విమానాలు ఉన్నాయి. IAF వద్ద దాదాపు 1,383 ఏరో ఇంజిన్లు , నౌకాదళంలో 193 ఇంజిన్లు, సైన్యం వద్ద దాదాపు 181 ఇంజిన్లు ఉన్నాయి. వీటి నిర్వహణ, మరమ్మత్తులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి MSMEలు పరిష్కారం కావచ్చు. చిన్న వ్యాపారాలు సహాయపడే రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది పరోక్షంగా MSMEలు పెద్ద వ్యాపారాలు, రక్షణ ప్రభుత్వ రంగ యూనిట్లకు (DPSUs) టైర్ వన్, టూ, త్రీ విక్రేతలుగా పని చేయవచ్చు. రెండవది నేరుగా వివిధ మేక్ ఇన్ ఇండియా పథకాలలో పాల్గొనడం. వీటిని ప్రభుత్వం లేదా పరిశ్రమల నిధులతో స్వదేశీ డిజైన్, రక్షణ పరికరాల అభివృద్ధిని సులభతరం చేయడానికి మూడు వర్గాలుగా విభజించిన మేక్ ప్రాజెక్ట్‌లు అంటారు.

ప్రధాన పరికరాలు, సిస్టమ్‌ల రూపకల్పన, అభివృద్ధితో కూడిన ప్రాజెక్ట్‌లను ఒక సంవత్సరం కంటే తక్కువ కాకుండా అభివృద్ధి కాలాలతో పరిష్కరించడం మేక్ I లక్ష్యం. ఈ ప్రాజెక్టులకు 70 శాతం ప్రభుత్వ నిధులు ఉంటాయి. మేక్ II పరిశ్రమ-నిధుల ప్రోటోటైప్ అభివృద్ధి లేదా ప్రభుత్వ నిధులు అందించని ప్రైవేట్ రంగం ద్వారా ప్రధానంగా దిగుమతి ప్రత్యామ్నాయం లేదా వినూత్న పరిష్కారాల కోసం అప్‌గ్రేడ్‌లు ఉంటాయి. చివరగా మేక్ III సబ్‌సిస్టమ్‌, సబ్‌ అసెంబ్లీ, కాంపొనెంట్స్‌, పదార్థాలు, మందుగుండు సామగ్రి మొదలైనవాటిని కలిగి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి, రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, MSMEలు, స్టార్టప్‌లతో సహా 63 MAKE ప్రాజెక్ట్‌లు భారత రక్షణ పరిశ్రమతో కలిసి చేపడుతున్నాయి.

Home Loan: హోమ్ లోన్ కావాలా? 7 శాతం లోపు వడ్డీకే రుణాలు ఇస్తున్న బ్యాంకులు ఇవే

IAF వద్ద 20 మేక్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి, వాటిలో 15 ప్రభుత్వం సూత్రప్రాయంగా (AIP) ఆమోదం పొందాయి. వీటిలో లైట్నింగ్ డిటెక్షన్ సిస్టమ్, 1,000 కిలోల వైమానిక బాంబు, ధరించగలిగే రోబోటిక్ పరికరాలు, ఇండియన్ సెక్యూరిటీ ప్రోటోకాల్‌లతో కమ్యూనికేషన్ సిస్టమ్, 80mm, 70 mm రాకెట్లు మొదలైనవి ఉన్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: Air India, Development, Explained, Indian Air Force, Manufacture

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు