Home /News /explained /

EXPLAINED HISTORY OF PRESIDENTS FLEET REVIEW ITS SIGNIFICANCE AND WHAT TO EXPECT FROM THE 12TH EDITION GH VB

Explained: ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ చరిత్ర, ప్రాముఖ్యత ఏంటి..? 12వ ఎడిషన్ ఫ్లీట్ నుంచి ఏమేం ఆశించవచ్చు..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సోమవారం విశాఖపట్నంలో ఇండియన్‌ నేవీ ఆధ్వర్యంలో జరుగనున్న ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ చరిత్ర, దీని ప్రాధాన్యం ఏంటో తెలుసుకుందాం.

సోమవారం విశాఖపట్నంలో(Visakhapatnam) ఇండియన్‌ నేవీ ఆధ్వర్యంలో జరుగనున్న ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌కు రాష్ట్రపతి(President) రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరుకానున్నారు. పూర్తిగా స్వేదేశీ పరిజ్ఞానంతో భారత్‌లోనే ఇండియన్‌ నేవీ(Indian Navy), కోస్టుగార్డు (Coast Guard) తయారు చేసిన 60 నౌకలను కార్యక్రమంలో రామ్‌నాథ్‌ కోవింద్‌ పరిశీస్తారు. ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది 12వ ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ అని ఇండియన్‌ నేవీ తెలిపింది. అంతకుముందు 2016లో జరిగిన ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌కు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అసలు ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ(Review) చరిత్ర, దీని ప్రాధాన్యం ఏంటో తెలుసుకుందాం.

ప్రెసిటెండ్స్‌ ఫ్లీట్‌ అంటే ఏంటి?
ప్రపంచ దేశాలు ప్రెసిటెండ్స్‌ ఫ్లీట్‌ రివ్యూ నిర్వహించడాన్ని ఒక సంప్రదాయంగా భావిస్తాయి. ముందస్తుగా ఎంచుకొన్న చోట నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలను ప్రదర్శిస్తారు. దేశ రక్షణలో నౌకాదళం పాత్ర, సాధించిన అభివృద్ధిని చాటడంటో భాగంగా ఫ్లీట్‌ను నిర్వహిస్తారు. రాష్ట్రపతి పదవీకాలం ముగిసే సరికి కనీసం ఒక్కసారి అయినా ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ నిర్వహిస్తారు. రిపబ్లిక్‌ డే రోజున నిర్వహించే సైనిక ప్రదర్శన మొదటిదని, ఆ తరహాలో చేపట్టే రెండో కార్యక్రమం ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ అని నేవీ అధికారులు వివరించారు.

ఇండియాలో మొట్టమొదటి సైనిక, ఆయుధ ప్రదర్శనను 18వ శతాబ్దంలో మరాఠా రాజులు నిర్వహించారు. తీరప్రాంతంలోని కోట రత్నగిరిలో అప్పటి సర్కీల్‌ కన్హోజీ అంగ్రీ నేతృత్వంలో గురబ్స్‌, గల్లివట్స్‌గా పేర్కొనే సైనికుల ప్రదర్శన జరిగింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 11 సార్లు ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ నిర్వహించారు. అందులో రెండు ఇంటర్నేషనల్ ఫ్లీట్స్‌ ఉన్నాయి. 2001, 2016లో అంతర్జాతీయ స్థాయి ఫ్లీట్స్‌ను ఇండియన్‌ నేవీ చేపట్టింది.

ప్రస్తుతం విశాఖపట్నంలో రెండోసారి ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ నిర్వహిస్తున్నారు. 2016లో కూడా విశాఖలో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ జరగ్గా అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం హాజరయ్యారు. ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌లో నౌకలను చూసి రాష్ట్రపతి ఇచ్చే ప్రశంసలు విశ్వాసాన్ని పెంపొందిస్తాయని, దేశరక్షణలో ఇండియన్‌ నేవీ పాత్రను సత్తాను ప్రదర్శన చాటుతుందని నేవీ అధికారులు తెలిపారు. 2020లో అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో జరగాల్సిన ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.

ఇది కూడా చదవండి: ఊపిరిపీల్చుకోండి.. ఈ నియమాలు అనుసరిస్తే మీ ఊపిరితిత్తులకు ఏ హానీ కలగదు..!


ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌లో ప్రత్యేకతలు
‘ఇండియన్‌ నేవీ- 75 ఇయర్స్‌ ఇన్‌ ది సర్వీస్‌ ఆప్‌ ది నేషన్‌’ అనే నినాదంతో ప్రస్తుతం ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ జరుగుతోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఫ్లీట్‌ను ప్రత్యేకంగా జరుపుతున్నారు. ప్రదర్శనలో 60 నౌకలు, సబ్‌మెరైన్స్‌, 50 ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ పాల్గొంటాయని అధికారులు పేర్కొన్నారు. షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కోస్టుగార్డ్‌కు చెందిన నౌకలు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీకి చెందిన సబ్‌మెరైన్స్‌ కూడా ఫ్లీట్‌లో పాల్గొంటాయి.

సోమవారం నౌకల ప్రదర్శన, ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ విన్యాసాలు ఉంటాయి. కార్యక్రమం అనంతరం ప్రత్యేక కవర్‌, పోస్టల్‌ స్టాంప్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విడుదల చేస్తారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్రెసిడెన్షియల్‌ యాచ్‌ ద్వారా మ్యారిటైమ్‌ ఆర్గనైజేషన్స్‌కు చెందిన నౌకలు, యుద్ధ నౌకలు., సబ్‌మెరైన్స్‌ను రాష్ట్రపతి పరిశీలిస్తారు. యాచ్‌లో ప్రయాణిస్తూ ఆయా నౌకల్లోని అధికారుల గౌరవవందనాన్ని రాష్ట్రపతి స్వీకరిస్తారు. గాల్లో ఎగురుతూ సెల్యూట్‌ చేసే వంటి విన్యాశాలను ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ చేస్తాయి.

ఇండియన్‌ నేవీకి చెందిన ఏవియేషన్‌ వింగ్‌ ఆధ్వర్యంలో 50 ఎయిర్‌క్రాఫ్ట్స్‌ కనువిందు చేయనున్నాయి. అందులో కొత్తగా నేవీలో భాగమైన Mikoyan MiG-29k, Boeing P-82 Neptune, HAL Dhruv MKIII ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్స్‌ ప్రదర్శన తర్వాత మెరైన్‌ కమాండోస్‌(Marcos) ద్వారా యాంటి టెరరిస్ట్‌ ఆపరేషన్స్‌, రెస్క్యూ డ్రిల్‌, సబ్‌ మెరైన్స్‌ విన్యాసాలు ఉంటాయి. కార్యక్రమాలు పూర్తయిన తర్వాత జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తారు. కార్యక్రమానికి గుర్తుగా ప్రత్యేక కవర్‌, పోస్టల్‌ స్టాంప్ విడుదల చేస్తారు.
Published by:Veera Babu
First published:

Tags: Fleet, Indian Navy, Vizag

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు