Home /News /explained /

EXPLAINED HERE IS FULL DETAILS ABOUT LINKING VOTER ROLLS TO AADHAAR NS GH

Explained: ఓటర్ ఐడీని ఆధార్‌తో లింక్ చేయడం సాధ్యమేనా? దీనిపై ప్రభుత్వం, ప్రతిపక్షాల వాదన ఏంటి?

ఓటర్ ఐడీని ఆధార్‌తో లింక్ చేయడం సాధ్యమేనా? దీనిపై ప్రభుత్వం, ప్రతిపక్షాల వాదన ఏంటి?

ఓటర్ ఐడీని ఆధార్‌తో లింక్ చేయడం సాధ్యమేనా? దీనిపై ప్రభుత్వం, ప్రతిపక్షాల వాదన ఏంటి?

ప్రతిపక్షాల ఆందోళనల నడుమ ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు- 2021ను (The Election Laws (Amendment) Bill - 2021) రాజ్యసభ మంగళవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లును సోమవారం లోక్‌సభ (Lok Sabha) ఆమోదించింది. ఈ నేపథ్యంలో బిల్లు ఉద్దేశం ఏంటి? దీన్ని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్ కార్డుకు అనుసంధానించే బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఎలక్టోరల్ రోల్ డేటాను ఆధార్ ఎకోసిస్టమ్‌తో లింక్ చేసే ఈ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనల నడుమ ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు- 2021 (The Election Laws (Amendment) Bill - 2021) ను రాజ్యసభ (Rajya Sabha) మంగళవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లును సోమవారం లోక్‌సభ (Lok Sabha) ఆమోదించింది. ఈ నేపథ్యంలో బిల్లు ఉద్దేశం ఏంటి? దీన్ని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ బిల్లును తీసుకురావడానికి కారణం ఏంటి?
ఈ బిల్లులో అనేక ఎన్నికల సంస్కరణలను పొందుపరిచినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఎలక్టోరల్ రోల్స్‌తో ఆధార్‌ను లింక్ చేయడం వల్ల ఒకే వ్యక్తి వివిధ ప్రాంతాల్లో ఓటు వేయడం కుదరదు. ఈ బిల్లుతో దొంగ ఓట్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఒక వ్యక్తి వేర్వేరు ప్రాంతాల్లో ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవడం కుదరదు. దీంతో ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించవచ్చని కేంద్రం తెలిపింది.
Indian Army: చైనా, పాక్ బోర్డర్‌లో మేడ్ ఇన్ ఇండియా ల్యాండ్‌మైన్స్.. ఆర్మీకి సరికొత్త అస్త్రం

న్యాయ శాఖ గ్రాంట్ల డిమాండ్లపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, నివేదికను ఈ ఏడాది మార్చి 6న రాజ్యసభకు సమర్పించింది. ఓటరు ఐడీ కార్డ్‌తో ఆధార్ నంబర్‌ను అనుసంధానించాలని ఈ కమిటీ సూచించింది. ఓటరు వేరే ప్రాంతానికి మారితే, ఆ మేరకు సవరణలు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని వెల్లడించింది. అయితే తాజా బిల్లుపై పార్లమెంటులో మాట్లాడారు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు. ఓటర్ ఐడీతో ఆధార్‌ను లింక్ చేయడం స్వచ్ఛందమేనని చెప్పారు. ఇది తప్పనిసరి కాదన్నారు. ఈ బిల్లును తీసుకురావడానికి ముందు ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌తో చాలాసార్లు సమావేశాలు నిర్వహించిందని తెలిపారు.
PM Narendra Modi: మ‌హిళ‌ల వివాహ వ‌య‌సు పెంచితే.. కొంద‌రికి బాధ క‌లుగుతోంది: ప్ర‌ధాని మోదీ

గతంలో ఈసీతో చర్చలు జరిగాయా?
2015 మార్చిలో ఎన్నికల సంఘం నేషనల్ ఎలక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్ అండ్ అథెంటికేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. నకిలీ ఓట్లను తొలగించే ప్రయత్నంలో భాగంగా ఆధార్‌ను ఓటర్ ఐడీలకు లింక్ చేయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల ప్రధాన అధికారుల (CEOS)కు ఎన్నికల సంఘం సూచనలను జారీ చేసింది. ఓటర్లు ఆధార్ నంబర్‌ను అందించడం తప్పనిసరి కాదని, సుప్రీం కోర్ట్ మార్గదర్శకాల ప్రకారం ఇది ఆప్షనల్ అని పేర్కొంది. అదే సంవత్సరం.. ఆధార్ కార్డ్ పథకం పూర్తిగా స్వచ్ఛందమైనది, ఈ విషయంపై కోర్టులు నిర్ణయం తీసుకునే వరకు దీన్ని తప్పనిసరి చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆధార్- ఓటరు ID కార్డుల అనుసంధానం సహా పెండింగ్‌లో ఉన్న ఎన్నికల సంస్కరణలను పరిశీలించాని కోరుతూ EC న్యాయ శాఖకు లేఖ రాసింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని సంస్కరణలపై క్యాబినెట్ నోట్‌ను ఖరారు చేసేందుకు PMO నిర్వహించిన అనధికారిక సమావేశానికి నవంబర్ 16న ఎన్నికల సంఘం హాజరైనట్లు ఈ వారం ప్రారంభంలో న్యాయ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రతిపక్షాల అభ్యంతరాలేంటి?
కాంగ్రెస్‌కు చెందిన మనీష్ తివారీ, మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటర్ ఐడీ, ఆధార్‌లను అనుసంధానించడం సుప్రీంకోర్టు తీర్పులో నిర్వచించిన గోప్యత హక్కును ఉల్లంఘిస్తుందన్నారు. అయితే న్యాయశాఖ మంత్రి రిజిజు మాత్రం ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ప్రస్తుత చట్టపరమైన నిబంధనలలో కొన్ని అసమానతలు, లోపాలను సరి చేసేందుకే కొత్త బిల్లు తీసుకువచ్చామని చెప్పారు. ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్- 1951లోని వివిధ సెక్షన్లకు ప్రతిపాదించిన సవరణలను ఆయన వివరించారు. ఆధార్‌ను ఓటర్ల జాబితాతో లింక్ చేయడం వల్ల ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడంతోపాటు ఎన్నికల అక్రమాలు తగ్గుతాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

దొంగ ఓట్లను గుర్తించడంలో ఎలాంటి సమస్యలు ఎదురు కావచ్చు?
ఓటర్ ఐడీ, ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాకపోతే బిల్లు అమలు విజయవంతం అవుతుందా? అనేది ప్రధాన ఆందోళన. కొన్ని ఎన్నికల సంస్కరణలను అమలు చేయడానికి ప్రజాప్రాతినిధ్య చట్టం- 1950, ప్రజాప్రాతినిధ్య చట్టం- 1951లను ఈ బిల్లు ద్వారా కేంద్రం సవరించింది. 1950 చట్టం ప్రకారం ఒక వ్యక్తి తన పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడానికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు. వారి పేరు ఇప్పటికే ఓటర్ల జాబితాలో ఉంటే, ఎలక్టోరల్ రోల్‌లోని ఎంట్రీల ప్రామాణీకరణ కోసం ఆధార్ నంబర్ అవసరం కావచ్చు. కానీ ప్రజలు తమ ఆధార్‌ను చూపించలేకపోతే ఓటర్ల జాబితాలో వారిని చేర్చకుండా ఆపలేరు లేదా ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగించరు. దీంతో ఓటర్ ఐడీని ఆధార్‌తో తప్పనిసరిగా అనుసంధానం చేస్తేనే బోగస్ ఓటింగ్‌కు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇతర ఆందోళనలు ఉన్నాయా?
ఆధార్‌ను అనుసంధానం చేయడం వల్ల పౌరులు కానివారు ఓటు వేసేందుకు వీలు కలుగుతుందని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ లోక్‌సభలో మాట్లాడుతూ.. ఆధార్‌ అనేది పౌరసత్వానికి గుర్తింపు కాదని, కేవలం నివాస ధ్రువీకరణ పత్రమని చెప్పారు. ఓటు కోసం ఆధార్‌ అడిగితే.. పౌరసత్వం లేని వ్యక్తులకు ఓటు వేయడానికి అవకాశం కల్పించినట్లు అవుతుందన్నారు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Aadhaar, Aadhaar card, UIDAI

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు